Share News

Amaravati: టెన్త్‌ విద్యార్థులకు గ్రాండ్‌ టెస్ట్‌

ABN , Publish Date - Feb 25 , 2025 | 06:27 AM

పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలకు ముందు గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహించాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీచేశారు.

Amaravati: టెన్త్‌ విద్యార్థులకు గ్రాండ్‌ టెస్ట్‌

  • మార్చి 3 నుంచి 13 వరకు.. మొదటిసారి నిర్వహణ

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలకు ముందు గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహించాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీచేశారు. వందరోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా ఈ మేరకు గ్రాండ్‌ టెస్ట్‌ తేదీలు ప్రకటించారు. మార్చి 3న ప్రథమ భాష, 4న ద్వితీయ భాష, 5న ఇంగ్లీష్‌, 7న గణితం, 10న ఫిజికల్‌ సైన్స్‌, 11న బయలాజికల్‌ సైన్స్‌, 13న సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 6, 12 తేదీల్లో ఒకేషనల్‌, ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. గ్రాండ్‌ టెస్ట్‌ ముగిసిన మూడు రోజులకు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకూ పబ్లిక్‌ పరీక్షలకు ముందు ప్రీఫైనల్‌ పరీక్షల విధానం మాత్రమే ఉంది. అయితే విద్యార్థులంతా మొదటిసారి ఇంగ్లీష్‌ మీడియంలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ పరీక్షలు రాస్తున్నందున సన్నద్ధత కోసం మొదటిసారి గ్రాండ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు.

Updated Date - Feb 25 , 2025 | 06:27 AM