Share News

APSRTC Bus Smoke Incident: ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:41 AM

ఏపీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. కాకినాడ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

APSRTC Bus Smoke Incident: ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..
APSRTC Bus Smoke Incident

రాజమండ్రి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో వరుస ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కాకినాడ డిపోనకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుకు ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఈ బస్సు రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.


ఈ బస్సు రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్దకు చేరుకోగానే బస్సులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై కిందకు దిగారు. వైరింగ్ కిట్ కాలిపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ సమయంలో బస్సులో ఎక్కువగా మహిళా ప్రయాణికులు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా తల్లి ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం చేస్తున్నారు: ఎంపీ రమేష్‌

జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2025 | 06:50 AM