Gold Hunt: బరితెగించిన యూట్యూబర్..మరీ ఇంత దారుణమా..
ABN , Publish Date - Mar 01 , 2025 | 05:07 PM
Fake Gold Hunt YouTube Scam: రీల్స్, యూట్యూబ్ షాట్లపై పిచ్చి పీక్స్‌కు పోయి లైకుల కోసం ఆరాటపడుతూ యూ ట్యూబర్లు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యూట్యూబర్ చేసిన పనితో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

అంబేద్కర్ కోనసీమ (అమలాపురం): యూట్యూబ్ చానెల్ ఫ్యూస్ కోసం ఇటీవల యూ ట్యూబర్లు బరితెగిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వారి చేష్టలతో రెచ్చిపోతున్నారు. పలు చిత్ర, విచిత్ర పోటీలు పెడుతూ ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు. ఇటీవల యూ ట్యూబర్ల మాయలో ప్రజలు పడిపోతున్నారు. వారు చెప్పిందే నిజమని పోరపడుతున్నారు. మనీ హంట్ పేరుతో ఈ మధ్య కాలంలో ప్రజలను తప్పుదోవ పట్టించిన ఘటనలు చూసే ఉంటాం. గోల్డ్ హంట్ పేరిట సదరు యూట్యూబర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టాడు.
గోల్డ్ హంట్ పేరుతో పోటీ..
వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యూట్యూబర్ చేసిన పనితో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. భూమిలో వెండి, బంగారం, ఇయర్ పాడ్స్ దాచాను దొరికిన వాళ్లు తీసుకోండి అంటూ మందపాటి ఆదిత్య అనే యూట్యూబర్ ప్రాంక్ చేశాడు. ఫస్ట్ ప్రైజ్ కింద గోల్డ్, రెండో ప్రైస్ కింద వెండి ఉంగరం, మూడో ప్రైజ్ కింద ఇయర్ బర్డ్స్ ఇస్తానని నమ్మించాడు. శుక్రవారం ఆదిత్యను ఇన్స్‌స్టాలో ఫాలో అయిన వారికి గోల్డ్ హంట్ వీడియోను రీల్‌గా పెట్టాడు.
ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు స్టేడియం వద్దకు పరుగులు తీశారు. అయితే వెండి, బంగారం, ఇయర్ పాడ్స్ కోసం100 మందికి పైగా స్థానిక యువకులు స్టేడియంలో గోతులను తవ్వి వాటిని వెతకడం ప్రారంభించారు. స్టేడియాన్ని తవ్వుతున్న యువకులను స్టేడియం ఉద్యోగులు అడ్డుకున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్‌కు తెలవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్డేడియానికి చేరుకుని యూట్యూబర్ మందపాటి ఆదిత్య ఆట కట్టించారు. ఆయనపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గోల్డ్ హంట్ కోసం స్టేడియంలో గోతులు తవ్వడంపై క్రీడాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన యూట్యూబర్ మందపాటి ఆదిత్యపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రీడాధికారి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Chandrababu: ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాలు
Narayana: మరో ఆరు నెలల్లో అభివృద్ధి పరుగులే
Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
AP Government: సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్
Read Latest AP News And Telugu News