Share News

AP CM Chadrababu : పదవులపై మాట్లాడొద్దు!

ABN , Publish Date - Jan 22 , 2025 | 04:14 AM

సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీకి చెందిన మంత్రి టీజీ భరత్‌, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పిఠాపురం నాయకుడు

AP CM Chadrababu : పదవులపై మాట్లాడొద్దు!

  • సోషల్‌ మీడియాలోనూ ఆ పోస్టులు పెట్టొద్దు

  • జనసేన నేతలకు అధిష్ఠానం ఆదేశం

  • సీఎం, డిప్యూటీ సీఎం పదవుల వ్యాఖ్యలపై సీరియస్‌

  • ఇప్పటికే అలా మాట్లాడిన నాయకులకు మందలింపు

  • టీడీపీలోనూ చంద్రబాబు ఆదేశాలతో తగ్గిన నేతలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీకి చెందిన మంత్రి టీజీ భరత్‌, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పిఠాపురం నాయకుడు ఎస్‌వీఎస్ఎన్‌ వర్మ.. ఇలా ప్రతి ఒక్కరూ బహిరంగంగా డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ సోషల్‌ మీడియా టీమ్‌ కూడా దీనిపై భారీగానే పోస్టులు పెట్టడం ప్రారంభించింది. మరోవైపు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ నాయకులు, ఆ పార్టీ సోషల్‌ మీడియా సిబ్బంది కూడా తమ అధినేత పవన్‌ కల్యాణ్‌ను సీఎం చేయాలని పోస్టులు చేయడం ప్రారంభించారు. జనసేన నేత కిరణ్‌ రాయల్‌ ఒకడుగు ముందుకేసి పవన్‌ను సీఎంగా చూడాలని తాము పదేళ్ల నుంచి కోరుకుంటున్నామన్నారు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ నేతలు కోరుకోవడంలో తప్పులేదని, అలానే తాము కూడా పవన్‌ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలకు, సోషల్‌ మీడియాకు బ్రేక్‌ వేసేందుకు స్వయంగా సీఎం చంద్రబాబు స్పందించి డిప్యూటీ సీఎం, సీఎం పదవులపై ఎవ్వరూ ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని సూచించారు. కూటమి ప్రభుత్వంలో అన్నీ సమష్టి నిర్ణయాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో జనసేన కేంద్ర కార్యాలయం కూడా ఈ అంశంపై స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవ్వరూ మాట్లాడొద్దని, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టవద్దని, మీడియాతోనూ మాట్లాడవద్దని స్పష్టం చేసింది. పార్టీ లైన్‌కు విరుద్ధంగా ఎవ్వరూ ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, తమ ఆదేశాలను పాటించాలని తేల్చిచెప్పింది. ఇప్పటికే మీడియా ముఖంగా డిప్యూటీ సీఎం, సీఎం పదవులపై మాట్లాడిన కొంత మంది నాయకులను పార్టీ కార్యాలయం గట్టిగానే మందలించింది.


వైసీపీ పెట్టిన చిచ్చే!

కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై అసత్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో టీడీపీ, జనసేన నాయకులూ ఆ పదవులపై మీడియా ముందు హడావుడి చేశారు. టీడీపీ అధిష్ఠానం, జనసేన పార్టీ కేంద్రం కార్యాలయం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఇరు పార్టీల నేతలను మందలించడం ద్వారా ఇప్పటికి ఈ సమస్యను సద్దుమణిగేలా చేశాయి. అయితే, భవిష్యత్తులోనూ వైసీపీ ఇలాంటి అసత్య ప్రచారాలను మరిన్ని సృష్టించే అవకాశం లేకపోలేదు.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2025 | 04:14 AM