5న కోటి మొక్కలు నాటాలి: సీఎం
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:16 AM
ఈనెల 5న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అనేక ప్రదేశాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల పొరుగున మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్ ఆంధ్ద్రజ్యోతి: రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ఈనెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఈకార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఈ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండులు, రహదారులకు ఇరువైపులా ‘కోటి మొక్కల’ కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా, ఈనెల ఐదో తేదీన అమరావతిలోని అనంతవరంలో జరిగే వన మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడీసీఎల్ సీఎండీ లక్ష్మీ పార్థసారథి అనంతవరంలోని నర్సరీ, ఉద్యానవనాలను సోమవారం పరిశీలించారు. మొత్తం రెండు వేల మొక్కలు ఈ కార్యక్రమంలో భాగంగా నాటనున్నారు.