TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. అన్యమత ఉద్యోగిపై వేటు
ABN , Publish Date - Apr 19 , 2025 | 08:23 AM
TTD ON Employee Paganism: టీటీడీలో సేవలు అందిస్తున్న ఓ ఉద్యోగిపై అన్యమత ప్రచారం, నిర్వాహక లోపాల ఆరోపణల నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకున్నారు. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఆసుంతా అన్యమత ప్రచారం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆమెపై యాక్షన్ తీసుకున్నారు.

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్యమత ప్రచారం చేస్తున్న ఉద్యోగిపై చర్యలు తీసుకుంది. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఆసుంతా అన్యమతం ప్రచారం, పలు అక్రమాలకు పాల్పడినట్లు ఈవోకు సహచర ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఆసుంతాపై వేటు వేశారు. ఆసుంతాను ఆయుర్వేదిక్ ఫార్మసీకి బదిలీ చేస్తూ డీఈవో విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
టీటీడీలో పనిచేసే ఉద్యోగులు హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. టీటీడీలో చేరే ముందే ఉద్యోగులకు అన్యమత ప్రచారంపై స్పష్టంగా చెబుతారు. కానీ కొంతమంది అధికారులు మాత్రం ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. ఉద్యోగులు చేస్తున్న తప్పిదాలతో తిరుమల దేవస్థానం ఇలాంటి వివాదాల్లో నిలుస్తోంది. ఇప్పటికే టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని అవసరమైతే తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
TTD Donation Management: గోవిందుడి ఖజానా మరింత భద్రం
Minister NMD Farooq: మైనార్టీలకిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యం
Kasireddy Rajasekhar Reddy: ముందస్తు బెయిలివ్వండి అరెస్టు నుంచి కాపాడండి
Read Latest AP News And Telugu News