Share News

TTD Chairman BR Naidu: ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్

ABN , Publish Date - Aug 03 , 2025 | 03:20 PM

ఏఐ టెక్నాలజీని వినియోగించి భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించడం సాధ్యం కాదంటూ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చేశారని టీటీడీ చైర్మన్ విమర్శించారు.

TTD Chairman BR Naidu: ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్
TTD Chairman BR Naidu

తిరుమల: ఏఐ టెక్నాలజీని (AI Technology) వినియోగించి భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించడం సాధ్యం కాదంటూ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం (LV Subrahmanyam) చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) ఖండించారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించే అంశంపై అధ్యయనం చేసేందుకు గూగుల్, టీసీఎస్ సంస్థలు ముందుకు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇవాళ(ఆదివారం) తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు.


ఈ సంస్థలు టీటీడీకి ఉచితంగా సేవలు అందిస్తున్నాయని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. దాతల సహాయంతో చేస్తున్న పనిని కూడా వృథా అనడాన్ని ఎల్వీ సుబ్రహ్మణ్యం విజ్ఞతికే వదిలేస్తున్నానని హితవు పలికారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రోజుల తరబడి క్యూ లైనల్లో పడిగాపులు ఉండటం మంచిదా..? అని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోందని గుర్తుచేశారు. భక్తుల ఇబ్బందులు తొలగించడానికే ఏఐ టెక్నాలజీని వినియోగించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని..ఇందులో ఎలాంటి తప్పు లేదని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కాం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. మంత్రి టీజీ భరత్..

కొడాలి నానికి బిగ్ షాక్!

For More AP News and Telugu News

Updated Date - Aug 03 , 2025 | 03:30 PM