Share News

Rapido Bike Driver Misbehaves: ఏపీలో దారుణం.. మహిళపై ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన

ABN , Publish Date - Nov 02 , 2025 | 02:28 PM

తిరుపతిలో మహిళపై ర్యాపిడో బైక్ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Rapido Bike Driver Misbehaves: ఏపీలో దారుణం.. మహిళపై ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన
Rapido Bike Driver Misbehaves

తిరుపతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): సమాజంలో మహిళల (Womens)కు రక్షణ లేకుండా పోతోంది. మహిళలపై కొంతమంది కామాంధులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తమ కామవాంఛని తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా తిరుపతి (Tirupati)లో ఓ మహిళపై ర్యాపిడో బైక్ డ్రైవర్ (Rapido Bike Driver Misbehaves) చేసిన దారుణం సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. ఈ కేసుకి సంబంధించి అలిపిరి సీఐ రామకిశోర్ ఓ ప్రకటన విడుదల చేశారు.


నిన్న (శనివారం) రాత్రి 12:30 గంటల సమయంలో.. అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్‌.ఆర్‌.కాలనీ, అంకుర హాస్పిటల్ వెనుక నివసిస్తున్న ఒక మహిళ.. బ్యూటీ పార్లర్‌ నుంచి ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బైక్ సర్వీస్‌ బుక్ చేసుకున్నారు. ఆమెను ఇంటి వద్దకు తీసుకువచ్చాడు ర్యాపిడో రైడర్ పెద్దయ్య. ఆ తర్వాత ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ర్యాపిడో రైడర్‌ని నిలువరించే సమయంలో మహిళా కేకలు వేసింది. ఆమె కేకలు వేస్తుండడంతో భర్త , బంధువులు గుర్తించారు.


వెంటనే ఇంటి ముందుకు వచ్చి నిందితుడిని పట్టుకున్నారు. అదే సమయంలో నైట్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న అలిపిరి సీఐ రామకిశోర్, తన సిబ్బంది అక్కడికి చేరుకుని నిందితుడైన ర్యాపిడో రైడర్ పెద్దయ్యని అదుపులోకి తీసుకున్నారు. ర్యాపిడో డ్రైవర్‌ని అలిపిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు పెద్దయ్యపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం నిందితుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, భవిష్యత్తులో ఇటువంటి అమానుష ప్రవర్తన మళ్లీ చేయకూడదని తిరుపతి తహసీల్దార్ వద్ద ఏడాదిపాటు బైండోవర్ చేసినట్లు అలిపిరి సీఐ రామకిశోర్ పేర్కొన్నారు.


పోలీసుల విజ్ఞప్తి..

తిరుపతి పోలీసులు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రతకి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఉద్ఘాటించారు. ఎవరైనా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 100/112/181 ఎమర్జెన్సీ నంబర్‌కు సమాచారమివ్వాలని సూచించారు. మహిళల భద్రత కాపాడటం అందరి సామాజిక బాధ్యతని అలిపిరి పోలీసులు పేర్కొన్నారు. మహిళలపై ఎవరైనా అమానుషంగా ప్రవర్తిసే కఠిన చర్యలు తీసుకుంటామని అలిపిరి పోలీసులు హెచ్చరించారు.


మహిళల భద్రత కోసం పోలీసుల సూచనలు:

మహిళలు ర్యాపిడో, ఓలా, ఊబర్‌ వంటి బైక్‌ ట్యాక్సీ సర్వీసులు వినియోగించే సమయంలో ఈ కింది జాగ్రత్తలు పాటించాలని అలిపిరి పోలీసులు సూచించారు.

1. రైడర్‌ వివరాలు (పేరు, ఫోన్‌ నంబర్‌, వాహన నంబర్‌) కుటుంబ సభ్యులకు షేర్‌ చేయాలి.

2. ప్రయాణ సమయంలో లైవ్‌ లొకేషన్‌ షేర్‌ ఆప్షన్‌ ఆన్‌ చేయాలి.

3. రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తే మహిళా రైడర్‌ లేదా వెరిఫైడ్‌ డ్రైవర్‌ ఉన్న సర్వీస్‌నే ఎంపిక చేసుకోవాలి.

4. రైడర్‌ ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 100/ 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలి.

5. సురక్షితంగా గమ్యస్థానానికి చేరిన వెంటనే కుటుంబసభ్యులకు ధ్రువీకరణ పంపాలని అలిపిరి పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

నేను అభివృద్ధి చేస్తుంటే.. వాళ్లు విధ్వంసం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2025 | 05:48 PM