Fire Accident: ఏపీలో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jul 03 , 2025 | 07:31 AM
గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సన్నిధి వీధిలోని ఓ షాపులో మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు ఎగసిపడుతున్నాయి.

తిరుపతి: గోవిందరాజస్వామి సన్నిధి (Govindarajaswamy Sannidhi) వీధిలో ఇవాళ (గురువారం) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. సన్నిధి వీధిలోని ఓ షాపులో మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరగడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. గోవిందరాజస్వామి ఆలయ పందిరి కొంత మేర దగ్ధమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేశారు.
అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేస్తున్నారు. అగ్నిప్రమాదం జరగడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆలయంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌తోనే మంటలు వ్యాపించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగింపు
రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు
For More AP News and Telugu News