Share News

Tirupati: రోడ్డుపై పడుకుని భూమన డ్రామా

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:51 AM

తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని, కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు. అయినా ఆయన నాటకాలు ఆగడంలేదు. రోడ్డుపై పడుకుని డ్రామా చేస్తున్నారు.

Tirupati: రోడ్డుపై పడుకుని భూమన డ్రామా
Bhumana Karunakar Reddy Overaction

తిరుపతి: టీటీడీ (TTD) గోశాల వ్యవహారంపై వైసీపీ (YCP) రాజకీయ రచ్చ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తిరుపతి (Tirupatiలో వైసీపీ నేతలు ఓవరాక్షన్ (Overaction) చేస్తున్నారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) గోశాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించినప్పటికీ ఆయన నాటకాలు ఆగడంలేదు. రోడ్డుపై పడుకుని డ్రామా చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావుడి చేయకుండా గోశాలకు వెళ్లాలని పోలీసులు భమనకు సూచించారు. ఆయన మాత్రం తనను పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తున్నారు.

Also Read..: సురానా ఇంట్లో భారీగా నగదు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం


టీడీపీ ఛాలెంజ్‌పై స్పందించా..

టీడీపీ నేతల ఛాలెంజీపై తాను స్పందించానని, తనను రమ్మని వాళ్లే నిర్బంధించడం ఎంత వరకు న్యాయమని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలని అన్నారు. తాను ఒక్కడినే రావడానికి సిద్ధమని.. టీడీపీ నేతలు వెళ్లిపోయాక అనుమతిస్తే ఏం ఉపయోగమని అన్నారు. పోలీసుల బలగాలతో నిర్బంధించడం దారుణమన్నారు. కాగా అంతకుముందు పద్మావతి పురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. టీటీడీ గోశాలకు వెళ్లేందుకు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి సిద్ధమయ్యారు. దీంతోవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై పడుకుని పోలీసులు తీరుపై నిరసన తెలిపారు.


కాగా టీటీడీ గోశాలల్లో మూగ జీవాల మృతిపై రాజకీయ రగడ జరుగుతోంది. వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గోశాలలో ఘోరాలు జరుగుతున్నాయంటూ గొంతు చించుకున్న ఫ్యాన్ పార్టీ నేతలకు టీటీడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో నోరు పెగలని పరిస్థితి. ఆవుల మృతిని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని ప్రయత్నించిన వైసీపీ చివరకు అబాసుపాలైంది. గో సంవర్షణ శాలల్లో మూగ జీవాల మృతి వెనుక ఉన్న రాజకీయాలేంటి.. గత పాలక మండలి నిర్వాహకాలపై విజిలెన్స్ నివేధికలోని అంశాలను గత వైసీపీ ప్రభుత్వం తొక్కి పెట్టింది.

తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని వైసీపీ నేతలకు తిరుపతి పోలీసుల సూచించారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి కూటమి ప్రజా ప్రతినిధులు.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సవాళ్లపై పోలీసు శాఖ గురువారం ఈ ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు. శాంతి ర్యాలీ పేరుతో వందలాది కార్యకర్తలతో కాకుండా గన్ మెన్ లతో‌ గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడవచ్చని కూటమి ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులు కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ టాబ్లెట్స్ మోతాదుకు మించి తీసుకుంటే..

Tirupati: భూమనకు పల్లా శ్రీనివాస్ సవాల్

జైకా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ..

For More AP News and Telugu News

Updated Date - Apr 17 , 2025 | 11:51 AM