AP DSC Hall Ticket 2025: ఏపీ మెగా డీఎస్సీ.. హాల్ టికెట్లు రిలీజ్ చేసిన మంత్రి లోకేశ్..
ABN , Publish Date - May 31 , 2025 | 03:53 PM
AP Mega DSC Hall Tickets 2025 Download: ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. అభ్యర్థులు ఈసారి అధికారిక వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.

AP DSC Hall Tickets 2025: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 హాల్ టిక్కెట్లను శనివారం నాడు మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. అధికారిక పోర్టల్ https://apdsc.apcfss.in లేదా వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని లోకేశ్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అయి హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఏపీ డీఎస్సీ హాల్ టికెట్ల విడుదల సందర్భంగా మంత్రి లోకేశ్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మెగా డీఎస్సీ నిర్వహణ పట్ల మా నిబద్ధత నెరవేరింది. డీఎస్సీలో అభ్యర్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి’ అని ఆకాంక్షించారు.
మరోవైపు అధికారిక వెబ్‌సైట్ cse.ap.gov.in ద్వారా కూడా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే, ఈసారి వాట్సాప్ ద్వారానూ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 95523 00009 నంబర్ కు మెసేజ్ చేయడం ద్వారా వాటిని పొందొచ్చని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లోని 16,347 టీచర్ పోస్టులను ఈ నియామకం ద్వారా ఏపీ ప్రభుత్వం భర్తీ చేయనుంది. స్కూల్ అసిస్టెంట్ (SA), సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ప్రిన్సిపల్స్ పోస్టులు భర్తీ చేసేందుకు జూన్ 6 నుంచి 30 వరకూ సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. కాగా, మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు.
AP DSC హాల్ టికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
అధికారిక AP DSC పోర్టల్ apdsc.apcfss.in ను సందర్శించండి
హోమ్‌పేజీలో "డౌన్‌లోడ్ హాల్ టికెట్" లింక్‌పై క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
హాల్ టికెట్‌ను యాక్సెస్ చేయడానికి “సబ్మిట్” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
హాల్ టికెట్ PDF ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పత్రాలు
AP DSC 2025 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఈ క్రింది పత్రాలను తీసుకెళ్లాలి.
AP DSC అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) హార్డ్ కాపీ
ఇటీవల తీసుకున్న రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు పత్రం. ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లలో ఏదో ఒకటి.
పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీను జులై 8న విడుదల చేస్తారు. ఫలితాలు జులై 2025 చివరి వారంలో వెలువడే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
ఇకపై ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులూ పైలట్స్ కావచ్చు.. ఎలాగంటే..
ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
మరిన్ని ఎడ్యుకేషన్, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి