Asmit Reddy: తాడిపత్రిలో కేతిరెడ్డి డ్రామాలు చేస్తే ఊరుకోం.. జేసీ అస్మిత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:11 PM
వైసీపీ హయాంలోని ఐదేళ్ల నిర్లక్ష్యం వల్ల తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి ఆరోపించారు. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో కేతిరెడ్డి ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే తప్పేముందని జేసీ అస్మిత్‌రెడ్డి నిలదీశారు.
అనంతపురం, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy)పై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి (MLA JC Asmit Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోని గత ఐదేళ్లలో ఏం జరిగిందో పెద్దారెడ్డి ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కేతిరెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తాడిపత్రిలో కేతిరెడ్డి డ్రామాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటామంటే ఎలా అని ప్రశ్నించారు. కేతిరెడ్డి నియోజకవర్గంలో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.
వైసీపీ హయాంలో తాడిపత్రి అభివృద్ధికి నోచుకోలేదు..
తాడిపత్రి నియోజకవర్గంలో తాము ఎక్కడా కేతిరెడ్డిని ఆపడం లేదని.. అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆయన ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఉదయం సమయంలో చేసుకోవాలని సూచించారు. వైసీపీ హయాంలో ఐదేళ్ల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో కేతిరెడ్డి ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే తప్పేముందని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని స్పష్టం చేశారు. కేతిరెడ్డి ఇప్పటికీ కూడా ఫ్యాక్షన్ చేయాలంటే ఏ కాలంలో ఉన్నారో ఒక్కసారి చూసుకోవాలని హితవు పలికారు. అసలు ఆయన వెంట ఎంతమంది వస్తారని ప్రశ్నించారు. లేకపోతే తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి కత్తి పట్టి తిరుగుతారా అని ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడిపత్రిలో ఉద్రిక్తతలు..
కాగా.. తాడిపత్రిలో ఇవాళ(బుధవారం) మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి ప్రారంభించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీ చేపట్టారు. వైసీపీ నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కేతిరెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శాంతిభద్రతల కారణంగా అడ్డుకున్నామని కేతిరెడ్డికి పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు.. సంచలన విషయాలు వెలుగులోకి...
వైసీపీ ర్యాలీకి అనుమతుల్లేవ్.. పోలీసుల వార్నింగ్
Read Latest AP News And Telugu News