Share News

Fire Accident: ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. ఏమైందంటే..

ABN , Publish Date - Nov 01 , 2025 | 08:02 PM

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె. గంగవరం మండలం కోటిపల్లి రేవులో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోటిపల్లి రేవులో ఉన్న కాకా హోటల్లో టీ కాసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

 Fire Accident: ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. ఏమైందంటే..
Major Fire Accident in AP

అంబేద్కర్ కోనసీమ జిల్లా, నవంబరు1 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema Dist) కె. గంగవరం మండలం కోటిపల్లి రేవులో ఇవాళ(శనివారం) భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) జరిగింది. కోటిపల్లి రేవులో ఉన్న కాకా హోటల్లో టీ కాసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే అప్రమత్తమై హోటల్లో ఉన్న మహిళను బయటకు తీసుకురావడంతో ప్రాణనష్టం తప్పింది.


అగ్నిప్రమాద విషయాన్ని స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలని ఆర్పివేశారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అగ్నిప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక సిబ్బంది సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

నేను అభివృద్ధి చేస్తుంటే.. వాళ్లు విధ్వంసం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 01 , 2025 | 08:29 PM