Share News

JC Prabhakar Reddy VS Madhavilata: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. అసలు కారణమిదే..

ABN , Publish Date - Feb 15 , 2025 | 08:51 AM

Madhavilata Cyber Complaint: జేసీ ప్రభాకర్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ 31న తాడిపత్రిలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. తాడిపత్రిలో ఉండే మహిళల కోసం ఈ స్పెషల్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌ను బీజేపీ నేత మాధవిలత తప్పుపట్టారు. అప్పటి నుంచి వీరిమధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

 JC Prabhakar Reddy VS Madhavilata: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్..  అసలు కారణమిదే..
JC Prabhakar Reddy , Madhavilata Controversy

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి, సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. మాధవిలతపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై ఇవాళ(శనివారం) మాధవిలత సైబరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు. మాధవిలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 31 గర్ల్స్ ఈవెంట్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవిలత మధ్య వివాదం రాజుకుంది. తనకు బెదిరింపు కాల్స్‌తో పాటు సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని మాధవిలత సైబరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో తెలిపారు. ఈ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాధవీలత కోరారు.


JC-Prabhakar-Reddy.jpg

వెనక్కు తగ్గని మాధవిలత...

కాగా, గత ఏడాది డిసెంబర్ 31న తాడిపత్రిలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. తాడిపత్రిలో ఉండే మహిళల కోసం ఈ స్పెషల్ ఈవెంట్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. ఈ ఈవెంట్‌ను మాధవిలత తప్పుపట్టారు. దీంతో ఆమెపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగానే జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమైంది. దీని వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. దీంతో బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఆవేశంలో అలా మాట్లాడానని.. తాను చేసింది తప్పేనని జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కోరారు. అయితే కొన్ని రోజుల క్రితం మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో, హెచ్‌ఆర్సీకి కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu : నేరుగా అర్జీదారుల వద్దకే!

Transgender Welfare: రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు

Nimmala Ramanaidu : ఆ ట్వీట్‌ జగన్‌ నేర స్వభావాన్ని చాటుతోంది

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 15 , 2025 | 09:00 AM