BJP chief Madhav: అపార పంట నష్టం.. బాధితులకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:44 PM
మత్స్యకారులకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం అందేలా చర్యలు ఉంటాయని అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. బీమా, లోన్ సౌకర్యాలు పథకంలో ఉన్నాయని తెలిపారు.
అనంతపురం: మొంథా తుఫాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. తుఫాన్ గురించి ప్రధాని మోదీ స్వయంగా ఆరా తీశారని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ(గురువారం) మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అపార పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి, పంట నష్టం అంచనాలకు సర్వే బృందాలు పని చేస్తున్నాయని వివరించారు. పంట నష్టం జరిగిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.
మత్స్యకారులకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం అందేలా చర్యలు చేపడుతున్నట్లు అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. బీమా, లోన్ సౌకర్యాలు పథకంలో ఉన్నాయని తెలిపారు. మత్స్యకారులను అన్ని విధులుగా ఆదుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలయ్యే లాగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వం దీనిని సక్రమంగా అమలు చేయలేక ఇబ్బందులు తలెత్తాయని ఆరోపించారు. నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు తమ పార్టీ తరఫున ఓ నోట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని మాధవ్ వెల్లడించారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ మొదటి నుంచి వ్యతిరేక విధానాన్ని అమలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ విమర్శించారు. గూగుల్ వచ్చినప్పుడు, అంతకు ముందు ఇలానే మాట్లాడారని గుర్తు చేశారు. మొంథా విపత్కర పరిస్థితుల్లోనూ.. వ్యతిరేకంగా ప్రచారం చేశారని మండిపడ్డారు. తిరుమల దేవస్థానం ప్రాశస్త్యం తగ్గించే విధంగా గత ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. అక్రమాలపై విచారణ జరుగుతోందని.. అన్ని విషయాలపైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. శ్రీవాణి నిధులు, పరకామణి నిధులు సహా అనేక విషయాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రభుత్వాని కోరారు.
ఇవి కూడా చదవండి..
Home Minister Amit Shah: పీఎం, సీఎం..రెండు పదవులూ ఖాళీ లేవు
Former Bangladesh PM Sheikh Hasina: భారత్‌లో స్వేచ్ఛగా ఉన్న..బంగ్లాదేశ్‌కు వెళ్లే ఉద్దేశం లేదు