Kadiri Municipality: వైసీపీ చేజారిన కదిరి మున్సిపాలిటీ.. చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం
ABN , Publish Date - Apr 23 , 2025 | 02:03 PM
Kadiri Municipality: కదిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నిసాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నజీమున్నిసాపై అవిశ్వాసం పెట్టడంతో ఈ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది.

శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నిసాపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానానికి 25మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. కోరం ఉండటంతో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. చైర్ పర్సన్‌తో పాటు వైసీపీకి చెందిన 11మంది గైర్హాజరయ్యారు. హాజరైన మొత్తం 25మంది అవిశ్వాసానికి మద్దుతుగా ఓటింగ్ వేశారు. ఎమ్మెల్యే, ఎంపీ ఓటు లేకుండానే అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కదిరి మునిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కదిరి మున్సిపల్ టీడీపీ కైవసం కావడంతో కార్యాలయం వద్ద టీడీపీ నేతలు సంబురాలు చేసుకున్నారు. టపాసులు పేలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ టీడీపీ నేతలు సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
వైసీపీ అధినేత జగన్ మూర్ఖ ఆలోచన మీద కదిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నిసాపై అవిశ్వాసం నెగ్గామని కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అన్నారు. ప్రజల అభిప్రాయం, ప్రజాస్వామ్యయుతంగానే అవిశ్వాసం జరిగిందని తెలిపారు. కదిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ నజీమున్నిసా అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. కదిరిలో అభివృద్ధి లేదని, అవినీతి హెచ్చు మీరిందని విమర్శించారు. అందుకే వైసీపీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం వైపు మొగ్గు చూపారని అన్నారు. డబ్బులిచ్చి కొన్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని.. అది జగన్‌కున్న అలవాటు అని విమర్శించారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని వైసీపీలో చేరితే ఏం చేశారని ప్రశ్నించారు. కదిరి అభివృద్ధి కోసమే.. అవిశ్వాసం పెట్టాం.. నెగ్గామని స్పష్టం చేశారు. త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన మున్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్‌ను ఎన్నుకుంటామని కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Andhra Pradesh Liquor Scam: జగన్ చెప్పారు.. నేను చేశాను!
PSR Anjaneyulu: అరెస్టు చేసినా అదే బాసిజం
Chandrababu Naidu: కేంద్రమంత్రి మేఘవాల్ ఇంట్లో ‘సైకిల్’పై చర్చ
Heatwave: ఎండదెబ్బకు ఒక్క ప్రాణమూ పోకూడదు
Read Latest AP News And Telugu News