Petrol stations : పెట్రోలు బంకుల్లో జాగ్రత్త
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:33 AM
పెట్రోల్, డీజిల్ వేయించుకునే సమయంలో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలని విజిలెన్స ఎస్పీ వైబీపీటీఏ ప్రసాద్ సూచించారు. స్థానిక బళ్లారి రోడ్డులోని విజయ ఫిల్లింగ్ స్టేషనలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెట్రోలు బంకుల్లో అక్రమాలపై ఆయన వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 8 పెట్రోలు బంకుల్లో తనిఖీలు చేశామన్నారు. మూడు బంకుల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ...

కొలతల్లో తేడా అనిపిస్తే ఫిర్యాదు చేయండి
విజిలెన్స ఎస్పీ వైబీపీటీఏ ప్రసాద్
అనంతపురం న్యూటౌన, మార్చి7(ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్ వేయించుకునే సమయంలో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలని విజిలెన్స ఎస్పీ వైబీపీటీఏ ప్రసాద్ సూచించారు. స్థానిక బళ్లారి రోడ్డులోని విజయ ఫిల్లింగ్ స్టేషనలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెట్రోలు బంకుల్లో అక్రమాలపై ఆయన వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 8 పెట్రోలు బంకుల్లో తనిఖీలు చేశామన్నారు. మూడు బంకుల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్నారు. సోములదొడ్డిలోని జయలక్ష్మి ఫిల్లింగ్ స్టేషనలోని డిస్పెన్షింగ్ యూనిట్ (డీయూ) పైభాగంలోని డిస్‌ప్లే బోర్డులో చిప్‌ను అమర్చారన్నారు. మదర్‌బోర్డును ట్యాంపర్ చేసి, ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్ చేసిన చిప్‌ను ఏర్పాటు చేశారన్నారు. సనప,
అనంతపురంలోని విజయ ఫిల్లింగ్ స్టేషనలో సైతం ఇదే తరహా మోసాలు వెలుగు చూశాయన్నారు. ఇలా టాంపరింగ్ చేయడం ద్వారా ప్రతి లీటరు పెట్రోలు, డీజిల్‌కు 60 మి.లీ. నుంచి 100 మి.లీ. దాకా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానం వస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్, విజిలెన్స సీఐలు శ్రీనివాసులు, జమాల్‌బాషా, సద్గురుడు, ఏఓ వాసుప్రకాష్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...