Share News

Aishwarya Rai Bachchan: సత్యసాయి బాబా ఐదు విధానాలు ఆదర్శం: ఐశ్వర్యరాయ్ బచ్చన్

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:54 PM

సత్యసాయి బాబా చెప్పిన మాటలు తాను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ వ్యాఖ్యానించారు. సత్యసాయి బాబా సూచించిన ఐదు విధానాలను తాను ఇప్పటికీ పాటిస్తానని పేర్కొన్నారు.

Aishwarya Rai Bachchan:  సత్యసాయి బాబా ఐదు విధానాలు ఆదర్శం: ఐశ్వర్యరాయ్ బచ్చన్
Aishwarya Rai Bachchan

శ్రీ సత్యసాయి జిల్లా, నవంబరు18(ఆంధ్రజ్యోతి): సత్యసాయి బాబా (Sathya Sai Baba) చెప్పిన మాటలు తాను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) వ్యాఖ్యానించారు. ఇవాళ(బుధవారం) సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆమె ప్రసంగించారు. సత్యసాయి బాబా సూచించిన ఐదు విధానాలను తాను ఇప్పటికీ పాటిస్తానని పేర్కొన్నారు ఐశ్వర్యరాయ్ బచ్చన్.


సత్యసాయి బాబాది ప్రేమ మతం..

‘సత్యసాయి బాబాది ప్రేమ మతం, మానవతా జాతి. మానవత్వమే జాతి, ప్రేమే మతం, హృదయమే బాష, దేవుడు సర్వవ్యాప్తుడు.. అని బాబావారు ఎప్పుడూ చెబుతుండేవారు. సత్యసాయి జన్మించి వందేళ్లు గడిచిపోయాయని.. బాబా మనతో లేకపోయినా లక్షలాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. బాబా నేర్పిన పాఠాలు, మార్గదర్శకత్వం, ఆచరించిన విధానాలు మనతో ఎప్పటికీ ఉంటాయి. దేవుడికి, ప్రజలకు సేవచేయడమే నిజమైన నాయకత్వం అని బాబా అనేవారు. సత్యసాయి ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రతి ఏడాది ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా విద్యని అందిస్తున్నారు. బాబా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రజలు ఐక్యతతో కలసి మెలసి ఉండాలని సత్యసాయి బాబా ఎప్పుడూ చెప్పేవారని.. ఈ విధానాన్ని అందరూ పాటించాలి’ అని ఐశ్వర్యరాయ్ బచ్చన్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

చరిత్రలో ఇదే ప్రథమం.. మావోల అరెస్ట్‌పై ఏడీజీ

మావోలకు దెబ్బ మీద దెబ్బ... నిన్న హిడ్మా.. నేడు మరికొందరు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2025 | 03:00 PM