Janasena Celebrations: జనసైనికుల ఆధ్వర్యంలో వినూత్న రీతిలో విజయోత్సవ సంబరాలు..
ABN , Publish Date - Jun 06 , 2024 | 08:52 AM
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఆయా పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేక్‌లు కట్‌చేసి, బాణాసంచా కాల్చి కూటమి విజయాన్ని వేడుకుగా జరుపుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఆయా పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేక్‌లు కట్‌చేసి, బాణాసంచా కాల్చి కూటమి విజయాన్ని వేడుకుగా జరుపుకుంటున్నారు. మరోవైపు జనసేన పార్టీ పోటీచేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడంతో జనసైనికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ నాయకులు జనసైనికులను తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో పాటు.. జనసేనాని పవన్‌కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ విమర్శించిన నేపథ్యంలో... ఈ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ పార్టీ సత్తా చాటడంతో జనసైనికులు ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. రాజకీయాల్లోనూ పవన్‌కళ్యాణ్ పవర్‌స్టార్ అంటూ నినదిస్తున్నారు. ప్రతి గ్రామంలో జనసేన శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో కూటమి తరపున టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు గెలవడంతో.. ఈ నియోజకవర్గంలో జనసైనికులు వినూత్న రీతిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
అత్యధిక మెజార్టీతో చరిత్ర సృష్టించాం
అంగరలో వినూత్నంగా..
జనసేన ఆధ్వర్యంలో కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో వినూత్న రీతిలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 21మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలవడంతో మొత్తం 23 కేక్‌లను కట్‌చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక్కో కేక్‌పై ఒక్కో నియోజకవర్గం పేరు, గెలిచిన అభ్యర్థుల పేర్లు రాశారు. అలాగే తమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ళ జోగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో ప్రత్యేక కేక్‌ను కట్ చేశారు. జనసేన మండపేట నియోజకవర్గ నాయకులు వేగుళ్ళ లీలాకృష్ణ, టీడీపీ మండల నాయకులు పుత్సల శ్రీనివాస్ ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్‌చేశారు. అంగర గ్రామానికి చెందిన జనసేన నాయకులు పిల్లా బసవరాజు, చీకట్ల గంగరాజు, తోరాటి శీను, కొంపెల్ల రాంబాబుతో పాటు భారీ సంఖ్యలో జనసైనికులు విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు.
Janasena : ప్రతి ఓటూ బాధ్యత గుర్తుచేసేదే
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Andhra Pradesh News and Latest Telugu News