AP NEWS: ద్వారంపూడి చంద్రశేఖర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. కారణమిదే..
ABN , Publish Date - Dec 27 , 2024 | 07:51 PM
Dwarampudi Chandrasekhar Reddy: కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి ఏపీ హై కోర్టులో బిగ్ షాక్ తగిలింది. వీరభద్ర రొయ్యల ఎక్స్‌పోర్ట్ కంపెనీలో ఉత్పత్తి నిలిపివేత ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

అమరావతి: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌కి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వీరభద్ర రొయ్యల ఎక్స్‌పోర్ట్ కంపెనీలో ఉత్పత్తి నిలిపివేత ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యర్ధాలను శుద్ధి చేయకుండా పంటకాలువలోకి విడుదల చేస్తున్నారని కాలుష్య నియంత్రణ మండలి ఫిర్యాదు చేసింది. PCB ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని ద్వారంపూడి చంద్రశేఖర్ హైకోర్టును ఆశ్రయించారు. కౌంటర్ దాఖలు చేయాలని కాలుష్య నియంత్రణ మండలికి హైకోర్టు ఆదేశించింది. విచారణను జనవరి 3వ తేదీకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
కాగా.. కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన రెండో రొయ్యలశుద్ధి కంపెనీలో భారీ ఉల్లంఘనలు బయటపడ్డాయి. ప్రత్తిపాడు మండలం లంపకలోవలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలో అడుగడుగునా కాలుష్య నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) గుర్తించింది. వీటిని సరిదిద్దుకునేందుకు మూడు నెలలు గడువిచ్చినా అతీగతీ లేదు. అయినా సీజ్ చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఆ ఫ్యాక్టరీపై అవ్యాజ ప్రేమ చూపుతున్నారు. లోపాలను సరిదిద్దడానికి మళ్లీ రెండో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కొందరు పీసీబీ అధికారులు తెరవెనుక సహకరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రొయ్యల ఫ్యాక్టరీకి వంతెన
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో ద్వారంపూడికి తన సోదరుడి పేరుతో వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ అనే రొయ్యల ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీకి వచ్చి వెళ్లే లారీలు, టిప్పర్లకు ప్రత్తిపాడు-లంపకలోవ మధ్యలో సుద్దగెడ్డ అనే వాగు అడ్డం వస్తుంది. చిన్నపాటి వర్షం వచ్చినా ఈ వాగు పొంగిపొర్లుతుంది. దీంతో 2021లో అప్పటి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి స్వయంగా వెళ్లి సుద్దగడ్డ వాగు పరిశీలించారు. 2021 మార్చి 25న రూ.2.70 కోట్లతో వంతెన నిర్మించేశారు. ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని 20 ఏళ్ల నుంచీ పది గ్రామాలకు చెందిన 40 వేలమంది పోరాడినా అప్పటి వరకూ పట్టించుకోలేదు. ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీ నిర్మాణం తర్వాత ఆ కంపెనీ వాహనాలకు ఇబ్బంది లేకుండా రోడ్డు కమ్ వంతెన ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Andhra Pradesh: ఈ దొంగోడి స్టైలే వేరు.. బట్టలన్నీ తీసేసి మరీ..
CM Chandrababu: మన్మోహన్ సింగ్ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది
Nimmala: జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలి
Read Latest AP News And Telugu news