Home » Yadadri Bhuvanagiri
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తొక్కాపురం గ్రామంలో అత్యంత విషాదకర ఘటన జరిగింది. మతిస్థిమితం లేని ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలపై కత్తితో దాడి చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వచ్చిన పొగలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ వద్ద హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.
యాదాద్రి భువనగిరి జిల్లా భారీ ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని విజె (VJ) సాయి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి.
ఇటీవలి కాలంలో అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారం, నీటి కొరత కారణంగా వన్యమృగాలు పట్టణాలు, గ్రామాల్లోకి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.
పెద్దపులి సంచారంతో జనగామ జిల్లాలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన పులులు అలజడి సృష్టిస్తున్నాయి. మొన్నటి వరకు ఏలూరు జిల్లా ఏజెన్సీని వణికించిన పెద్దపులి.. ఇప్పుడు తూర్పు గోదావరిలోకి ప్రవేశించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని ఓ పొలం సమీపంలో లేగదూడపై పులి దాడి చేసి చంపేసింది.
రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో. ఆలస్యం చేసినా ఆశాభంగం.. త్వరపడండి.. ఫాస్ట్ ఫాస్ట్..’’ అంటూ కేకలేస్తున్నంత పనిచేస్తోంది లండన్‌లోని బివొటిబి సంస్థ. ఈ కంపెనీ కొన్నేళ్ల నుంచీ ఖరీదైన ఇళ్లు, కార్లు, గడియారాలను వేలం వేస్తోంది.
ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పార్టీ పెడితే తనకు కాదని.. ప్రజలకు మేలు జరగాలని కవిత పేర్కొన్నారు.