Share News

Fatal Accident: అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన లారీ

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:31 AM

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఆదివారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. స్థానిక జగదేవ్‌పూర్‌ చౌరస్తా వద్ద అదుపు తప్పిన లారీ పాదచారులు, రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలు, దుకాణాలపైకి దూసుకెళ్లింది.

Fatal Accident: అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన  లారీ

  • ఇద్దరి మృతి, ధ్వంసమైన వాహనాలు, దుకాణాలు

భువనగిరి టౌన్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఆదివారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. స్థానిక జగదేవ్‌పూర్‌ చౌరస్తా వద్ద అదుపు తప్పిన లారీ పాదచారులు, రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలు, దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో జహీరాబాద్‌ జిల్లా కోహిర్‌ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన చిలమామిడి రామకృష్ణ (35), అతని సోదరుడి కుమారుడు..


కారు డ్రైవర్‌ చిలమామిడి సాయికుమార్‌ (27) మృతిచెందారు. వీరు జీవనోపాధి కోసం కుటుంబాలతో మేడ్చల్‌ జిల్లా సూరారంలో నివాసం ఉంటున్నారు. ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చి దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో దుకాణాలు మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.

Updated Date - Aug 04 , 2025 | 04:31 AM