Extra Marrital Affairs: ట్రయాంగిల్ అఫైర్స్.. భర్త ఒకరితో.. భార్య మరొకరితో.. కట్ చేస్తే..
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:17 PM
జిల్లాలోని కాటేపల్లి గ్రామ శివారులో జరిగిన స్వామి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మంగళవారం నాడు డీసీపీ ఆకాంక్ష్.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

యాదాద్రి, జులై 15: జిల్లాలోని కాటేపల్లి గ్రామ శివారులో జరిగిన స్వామి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మంగళవారం నాడు డీసీపీ ఆకాంక్ష్.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. స్వామి హత్యకు అక్రమ సంబంధమే కారణమని తేల్చారు. చెల్లి వరుసైన మహిళతో ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకోవడంతో.. అతన్ని చంపేశారని డీసీపీ తెలిపారు.
డీసీపీ చెప్పిన వివరాల ప్రకారం..
జులై 13వ తేదీన కాటేపల్లి గ్రామ శివారులో స్వామి(38) బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. స్వామిని అతని భార్య, బావమరిది చంపేసినట్లు గుర్తించారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు వ్యవహారం బయటపడింది. బామ్మర్ది మహేష్ భార్యతో స్వామి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన స్వాతి.. భర్త స్వామిని నిలదీసింది. దీంతో ఆమెను వేధించసాగాడు. మరోవైపు.. బామ్మర్ది మహేష్‌కు కూడా ఈ అక్రమ సంబంధం వ్యవహారం తెలియడంతో.. స్వామిపై పీకల్లోతు పగ పెంచుకున్నాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందండోయ్.. స్వామి భార్య స్వాతికి కూడా వెరొకరితో ఇల్లీగల్ రిలేషన్ ఉంది. సాయి కుమార్ అనే వ్యక్తితో స్వాతి రహస్య ప్రేమాయణం సాగిస్తోంది. ఈ క్రమంలో స్వామిని అడ్డు తొలగిస్తే అన్నీ సెట్ అవుతాయని ఇటు స్వాతి, ఆమె ప్రియుడు.. అటు బామ్మర్ది మహేష్ భావించారు. ఇంకేముంది.. ముగ్గురూ కలిసి పక్కా ప్లాన్ వేశారు. మరో వ్యక్తిని తమ గ్యాంగ్‌లో చేర్చుకుని.. అతని సహకారంతో స్వామిని టార్గెట్ చేశారు.
ఇంకేముంది.. అనుకున్నట్లుగానే జులై 13వ తేదీన రాత్రి స్వామికి స్పాట్ ఫిక్స్ చేశారు. ఆ రోజున స్వామి తన స్నేహితుడు వీరబాబు బైక్‌పై పల్లెర్లకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని స్వాతి.. మహేష్, సాయి కుమార్‌లకు తెలిపింది. అప్పటికే అద్దె కారును తీసుకున్న వీరు.. స్వామి బైక్‌ను ఫాలో అయ్యారు రాయగిరి-మోత్కూర్ రోడ్డులో కారుతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో స్వామి అక్కడికక్కడే మృతి చెందగా.. వీరబాబుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతనికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ కేసులో నిందితులైన గుంటి సాయి కుమార్, మృతుడి భార్య స్వాతి, మహేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు డీసీపీ ఆకాంక్ష్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు, ఒక హోండా షైన్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read:
Youth Fight: అర్ధరాత్రి రోడ్డుపై యువతీయువకుల హల్‌చల్..
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్..!
For More Telangana News and Telugu News..