Home » Mulugu
కర్రెగుట్టలపై మంగళవారం కూడా బలగాల కుంబింగ్ కొనసాగుతోంది. హెలికాఫ్టర్ ద్వారా కర్రెగుట్టపైకి భారీగా బలగాలు వెళ్తున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బేస్ క్యాంప్ కోసమే బలగాలు , ఆయుధ సామాగ్రిని హెలికాఫ్టర్ ద్వారా తరలిస్తున్నారు. కాగా కర్రె గుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
Karreguttalu Encounter: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలపై భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపించారు. దాదాపు 38 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Karreguttalu Gunfight: ఆపరేషన్ కగార్‌లో భాగంగా కర్రుగుట్టల్లో భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.
దశాబ్దాలుగా ఈ గుట్టలు నక్సలైట్లకు కంచుకోటలుగా ఉంటుండగా.. అబూజ్‌మఢ్, ఇతర ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు పెరగడంతో.. ఉన్న క్యాడరంతా కర్రెగుట్టలపైకి చేరుకున్నట్లు భద్రతాబలగాలు ఉప్పందుకున్నాయి.
Operation Karreguttalu: తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కోసం 2 వేల మంది భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అనంతరం ఓ పసికందు మృతి చెందింది. ప్రసవం ఆలస్యంగా చేయడమే పసికందు మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క సోమవారం పోలీసులకు లొంగిపోయారు. దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య అయిన ఆమె 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు.
గురువారం ఉదయం సూర్యోదయానికి ముందు పూజారులు వనదేవతల మందిరాలకు చేరుకొని తల్లులకు శనివారం వరకు అంతర్గత పూజాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక మినీ జాతర ప్రారంభమైన నేపథ్యంలో మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మండమెలిగె పండుగ సందర్భంగా తల్లుల గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం ఉదయం ప్రారంభమైంది. వడ్డెలు సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారం, కన్నెపల్లికి ద్వారా బంధనం చేసి జాతర ప్రారంభించారు. ఈ క్రమంలో ములుగు మన్నెంలో జాతరల సందడి నెలకొంది.
ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం నిర్వహించనున్నారు. మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు, ఛత్తీస్‌గఢ్ నుండి గుత్తి కోయలు, ఆదివాసీలు; జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడా; మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రతీసాగర్ గోండులు; ఒరిస్సా నుంచి సవర ఆదివాసీలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు.