Top Maoist Leader: లొంగిపోవడానికి సిద్ధమైన మావోయిస్టు నేత.. 30 సంవత్సరాల తర్వాత..
ABN , Publish Date - Nov 15 , 2025 | 09:40 AM
మావోయిస్టు నేత కొయ్యాడ సాంబయ్య అలియాస్ గోపన్న లొంగిపోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై ఆయన కుటుంబసభ్యులు స్పందించారు.
మావోయిస్టు పార్టీలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గత కొంతకాలం నుంచి మావోయిస్టు కీలక నేతలందరూ వరుసగా లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు నేత కొయ్యాడ సాంబయ్య అలియాస్ గోపన్న అలియాస్ ఆజాద్ లొంగిపోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. సాంబయ్య లొంగిపోతున్నట్లు ధ్రువీకరించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడానికి చెందిన సాంబయ్య మూడు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. పలు కారణాల వల్ల ఆయన లొంగిపోవడానికి సిద్ధమయ్యారు.
భయపెడుతున్న ఆపరేషన్ కగార్..
కేంద్ర ప్రభుత్వం మావోయిజాన్ని తుడిచిపెట్టడానికి కంకణం కట్టుకుంది. మార్చి 31, 2026 నాటికి దేశంలో మావోయిజాన్ని లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఎదురు తిరిగిన మావోయిస్టులను ఏరిపారేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. సీనియర్లు కూడా లొంగిపోతుండటంతో దేశంలో మావోయిజం మెల్ల మెల్లగా క్షీణిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఆర్ఐ సతీష్ కుమార్ హత్య కేసు.. ఏబీఎన్ చేతిలో ఎఫ్‌ఐఆర్ కాపీ
సంచలనం సృష్టించిన బీఎస్పీ అభ్యర్థి.. 30 ఓట్ల తేడాతో గెలుపు