Medaram Jatara: జనవరి 28నుంచి 31వరకు మేడారం జాతర
ABN , Publish Date - Jul 03 , 2025 | 03:36 AM
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహాజాతర ముహూర్తం ఖరారైంది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుందని దేవస్థాన కార్యనిర్వాహక

తాడ్వాయి, జూలై 2(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహాజాతర ముహూర్తం ఖరారైంది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుందని దేవస్థాన కార్యనిర్వాహక అధికారి వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు బుధవారం ప్రకటించారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల మహా జాతర నాలుగు రోజులపాటు జరగనుందని తెలిపారు. జాతర ప్రారంభానికి ముందు జనవరి 21(బుధవారం) మండే మెలుగు(శుద్ధి పండుగ) కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
మహాజాతర షెడ్యూల్ ఇలా..
జనవరి 28న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ అమ్మవారు మేడారంలోని గద్దెను చేరుకుంటుంది. అలాగే పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు రావడంతో మహా జాతర మొదటి ఘట్టం ప్రారంభమవుతుంది.
జనవరి 29న సాయంత్రం 6 గంటలకు వనదేవత సమ్మక్క గద్దెకు చేరుకుంటుంది.
జనవరి 30న భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు.
జనవరి 31న (శనివారం) సాయంత్రం 6 గంటలకు వనదేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి