Mulugu: వాట్సాప్ పోస్టుతో ఉరి
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:55 AM
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకపోవడంతో ఆవేదనకు గురైన ఓ యువకుడు తమ గ్రామ వాట్సాప్ గ్రూపులో పెట్టిన పోస్టు.. అతని బలవన్మరణానికి కారణమైంది. బాధితుడి బంధుమిత్రుల కథనం ప్రకారం.

ఇందిరమ్మ ఇల్లు రాక.. వాట్సాప్ గ్రూప్‌లో యువకుడి ఆవేదన
భగ్గుమన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు
సెల్‌ఫోన్‌ను లాక్కొన్న పోలీసులు
కేసుల భయంతో యువకుడి బలవన్మరణం
గోవిందరావుపేట, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకపోవడంతో ఆవేదనకు గురైన ఓ యువకుడు తమ గ్రామ వాట్సాప్ గ్రూపులో పెట్టిన పోస్టు.. అతని బలవన్మరణానికి కారణమైంది. బాధితుడి బంధుమిత్రుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయికి చెందిన చుక్క రమేశ్(25) చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో.. అమ్మమ్మ వద్ద పెరిగారు. తర్వాత హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేశారు. ఇటీవల చల్వాయికి తిరిగి వచ్చి, ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేకపోవడంతో రమేశ్ ఆవేదనకు గురయ్యారు. ‘చల్వాయి సమాచారం’ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూపులో ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హులకు ఇళ్లు వచ్చాయని ఆరోపించారు.
ఇదే గ్రూపులో పస్రా ఎస్సై, డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రె్‌సకు చెందిన వారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రమేశ్ పోస్టులు పెడుతున్నారంటూ 15 రోజులుగా అతణ్ని టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ క్రమంలో న్యూసెన్స్ కేసంటూ డయల్-100కు ఫిర్యాదు వెళ్లాయి. రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం రమేశ్ సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. గురువారం ఠాణాకు రావాలని ఆదేశించారు. కేసు భయంతో రమేశ్ ఇంట్లో ఉరివేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా.. రమేశ్ మృతికి పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలేనని ఆరోపిస్తూ.. మృతుడి బంధువులు, బీఆర్‌ఎస్ నేతలు గ్రామంలోని 163వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రమేశ్ అమ్మమ్మ విశాల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రి వద్ద రమేశ్ మృతదేహానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రమేశ్ మృతికి మంత్రి సీతక్క బాధ్యత వహంచాలని, అతని కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
సమాచార శాఖలో 150 ఔట్ సోర్సింగ్ పోస్టులు
హైదరాబాద్, జూలై 3: సమాచార, ప్రజా సంబంధాల (ఐ అండ్ పీఆర్) శాఖలో వివిధ సర్వీసులకు ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు ప్రాతిపదికన 150 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కారు అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టులకు ఎంపికైన వారు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఏడాది కాలం పాటు సేవలందించాల్సి ఉంటుంది. ఉత్తర్వులో పేర్కొన్న మేరకు థర్డ్ పార్టీ ద్వారా వీరికి వేతనాలు అందించనున్నారు.
ఇవి కూడా చదవండి
రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..
తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్
Read latest Telangana News And Telugu News