Home » Fee Reimbursement
గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సర్కారు ముందు ప్రైవేటు కాలేజీల యాజమా న్యాలు కొత్త ప్రతిపాదన ఉంచాయి.
ప్రైవేటు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఏటేటా పెరిగిపోతుండడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో కాలేజీల యాజమాన్యాలే ఫీజు చెల్లింపునకు పరిష్కార మార్గాన్ని సర్కారుకు సూచించాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు అందించింది. రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల మెడికల్ రీ-యింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసింది.
గతంలో ప్రకటించిన విధంగా ఈనెల 30లోగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఉన్నత విద్య ఫీజుల విడుదల విషయంలో కొత్త సమస్య ఉత్పన్నమైంది. కాలేజీలకు బదులుగా తల్లిదండ్రుల కు ఫీజులు జమచేసే విధానాన్ని గత వైసీపీ ప్రభు త్వం ప్రవేశపెట్టడం దీనికి కారణం.
Fee Reimbursement: ఈసారి తప్పకుండా విద్యార్థుల హాజరును ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ముడిపెట్టి ఆ ఆదేశాలను అమలు చేయాలని ఉపకులపతుల సమావేశంలో నిర్ణయించారు. దీంతో కొంతమేర విద్యానాణ్యత పెరుగుతుందని వీసీలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత ధోరణితో లక్షల మంది పేద విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం గత 40 రోజులుగా చేస్తున్న సమ్మెకు తెర పడింది.
డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉన్నవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, జూనియర్ కళాశాలలకు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సూచనలతో ఫీజు నియంత్రణపై ప్రభుత్వం ముసాయిదా చట్టం సిద్ధం చేసింది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.4 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతూ ఎంపీ ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. కళాశాలలు ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు