Share News

Bhatti Vikramarka: భట్టితో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల భేటీ

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:44 AM

గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై సర్కారు ముందు ప్రైవేటు కాలేజీల యాజమా న్యాలు కొత్త ప్రతిపాదన ఉంచాయి.

Bhatti Vikramarka: భట్టితో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల భేటీ

  • ఫీజు రీయుంబర్స్‌మెంట్‌ చెల్లింపు ప్రత్యామ్నాయాలపై చర్చ..

  • కొత్తగా ఎస్బీఐ ఎడ్యుకేషన్‌ ఎపెక్స్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు ప్రతిపాదన

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై సర్కారు ముందు ప్రైవేటు కాలేజీల యాజమా న్యాలు కొత్త ప్రతిపాదన ఉంచాయి. ప్రతి ఏటా దాదా పు రూ.2,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో.. కొత్తగా ఎస్బీఐ ఎడ్యుకేషన్‌ ఎపెక్స్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి, దీని ద్వారా ఉన్నత విద్యాసంస్థల ఆర్థిక లావాదేవీలన్నీ నిర్వహించాలని కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు కోరారు.


సోమవారం డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్కతో జరిగిన సమావేశంలో తె లంగాణ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎన్‌. రమేశ్‌బాబు మాట్లాడుతూ ఆ బ్యాంకు నిధుల వడ్డీలతోనే చెల్లించవచ్చన్నారు. తమ ప్రతిపాదనపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని, సీఎస్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు తెలిపాయి. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని వెల్లడించాయి.

Updated Date - Jul 08 , 2025 | 04:44 AM