Home » Bhupalpalle
పంట నష్టం, అప్పుల బాధతో జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
భూపాలపల్లి జిల్లా జడల్‌పేటలో వీధి కుక్కల దాడికి బాలిక గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
తన భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, ఈ ఘటనలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిల ప్రమేయం ఉందని ఇటీవల హత్యకు గురైన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగ మూర్తి భార్య సరళ ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించిన వారి మరణాలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్‌లో పిల్లర్లు కుంగిపోవడంలో నాణ్యతా ప్రమాణాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి హత్యకు గురికావడం తెలిసిందే.
జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసు రోజుకో మలుపు తిరుగింది. చివరికి పోలీసులు హత్య కేసు మిష్టరీని చేధించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసు వివరాలను మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు.
జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసు రోజుకో మలుపు తిరుగింది. చివరికి పోలీసులు హత్య కేసు మిష్టరీని చేధించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరె హత్య కేసు వివరాలను వెల్లడించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసులో చిక్కుముడి వీడడం లేదు.
ఆ శిశువులు కవలలు.. వయసు నాలుగు నెలలే! బిడ్డలకు ఆ తల్లి పొద్దున, రెండు గంటల తేడాతో రెండుసార్లు పౌడరు పాలు తాగించి పడుకోబెట్టింది. కొద్దిసేపటికి శిశువుల ముక్కుల్లోంచి పాలు రావడం.. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు బిడ్డలను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య పథకం ప్రకారమే జరిగిందని, భూపాలపల్లి పట్టణంలో ఓ భూవివాదమే హత్యకు దారి తీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
తీవ్ర సంచలనం సృష్టించిన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి (52) హత్య.. రాజకీయ దుమారం రేపుతోంది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది.