Home » Bhadradri Temple
ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాచల రామయ్యకు చెందిన భూములకు రక్షణగా భద్రాద్రి దేవస్థానం శ్రీగోకులరామం చుట్టూ నిర్మించతలపెట్టిన ప్రహరీ నిర్మాణానికి మరోసారి దేవస్థానం అధికారులు కసరత్తు చేపడుతున్నారు.
సీతారామచంద్రస్వామి ఆలయ భూముల ఆక్రమణ అంశం మరోసారి రణరంగాన్ని తలపించింది.
భద్రాచలం పుణ్యక్షేత్రానికి సమీపంలో ఏపీ పరిధిలో ఉన్న భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది.
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి అత్యంత వైభవంగా మహాపట్టాభిషేకం నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య కల్యాణ సార్వభౌముడికి రాజ లాంఛనాలు సమర్పించారు.
Sri Rama Pattabhishekam: భద్రాచలంలో శ్రీరామంద్రుడి పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు మిథులా స్టేడియానికి తరలివచ్చారు.
సీతా రాముల కల్యాణం అనంతరం ఒక్క రామయ్యకు మాత్రమే నిర్వహించే విలక్షణ ఉత్సవం మహా పట్టాభిషేకం. ఏటా శ్రీరామ నవమి మరుసటి రోజు జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహాపట్టాభిషేకంగా పేర్కొంటారు. ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, శంఖు, చక్రాలు, కిరీటం ధరింపజేస్తారు.
భద్రాద్రి సీతారాముల కల్యాణం తిలకించేందుకు లక్షలాది భక్తులు దక్షిణ అయోధ్య బాట పట్టారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం.. అంగరంగ వైభవంగా జరగింది. ఇందుకోసం మిధిలా స్టేడియం అందంగా ముస్తాబైంది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
భద్రాచల పుణ్య క్షేత్రంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణమండపంలో ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది.
శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబైంది. నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సీతారాముల వారి కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట జాతీయ రహదారి శ్రీరామనామ స్మరణతో మార్మోగుతోంది. రాజమండ్రి జగ్గారెడ్డి గూడెం ప్రాంతాల నుంచి వేలాదిమంది రామ భక్తులు సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలతో పాదయాత్రగా గురువారం నాడు భద్రాచలం బయలు దేరారు.