Bhadradri Temple: భద్రాద్రి రామయ్య భూముల్లో ఆగని ఆక్రమణలు
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:58 AM
భద్రాచలం పుణ్యక్షేత్రానికి సమీపంలో ఏపీ పరిధిలో ఉన్న భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది.

ఏపీలోని పురుషోత్తమపట్నంలో ఉన్న దేవస్థానం భూముల్లో అక్రమంగా ఇంటి నిర్మాణం
అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులకు బెదిరింపులు
తెలంగాణ వాళ్లు రావొద్దని హెచ్చరిక
భద్రాచలం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం పుణ్యక్షేత్రానికి సమీపంలో ఏపీ పరిధిలో ఉన్న భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఏపీలోని అల్లూరి జిల్లా యటపాక మండలం పురుషోత్తపట్నంలో దేవస్థానం భూముల్లో ఆక్రమణదారులు ఇంటి నిర్మా ణం చేపట్టారు. అడ్డుకోవడానికి సోమవారం దేవస్థానం ఇబ్బంది వెళ్లగా ‘‘నిర్మాణాలు ఆపేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి’’ అంటూ ఆక్రమణదారులు తెగేసి చెప్పారు. ‘‘తెలంగాణ అధికారులు మా భూముల్లోకి రావద్దు’’ అంటూ బెదిరించారు.
దేవస్థానం సిబ్బందిని ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టే యత్నం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని యటపాక రెవెన్యూ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు సరిగా స్పందించలేదని దేవస్థానం వర్గాలు వాపోతున్నాయి. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ సమస్యపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తుండటం పట్ల రామ భక్తుల నుంచి ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి.