Share News

Bhadradri: కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం..

ABN , Publish Date - Apr 06 , 2025 | 01:09 PM

భద్రాద్రి సీతారాముల కల్యాణం తిలకించేందుకు లక్షలాది భక్తులు దక్షిణ అయోధ్య బాట పట్టారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం.. అంగరంగ వైభవంగా జరగింది. ఇందుకోసం మిధిలా స్టేడియం అందంగా ముస్తాబైంది. సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

Bhadradri: కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం..
Sita Rama Kalyanam

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచల పుణ్య క్షేత్రంలో శ్రీరామ నవమి (Sri Rama Navami) వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మిథిలా స్టేడియం (Mithila Stadium)లోని శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలో ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం (Thirukalyana Mahotsavam) ప్రారంభమైంది. ఈ కార్యక్రమం అనంతరం సీతారాముల కల్యాణం (Sita Rama Kalyanam) కన్నుల పండువగా జరిగింది. ఈ కల్యాణాన్ని తిలకించేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు (Devotees) పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిజిత్‌ లగ్నం (Abhijit Lagna)లో సీతారాముల కల్యాణం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో దేవస్థానం అధికారులు భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు, 200 క్వింటాళ్ల తలంబ్రాలను పంపిణీకి సిద్ధం చేశారు. ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌ పరిధిలో భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సోమవారం నిర్వహించే పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ విచ్చేయనున్నారు.

Also Read..: Bandi Sanjay: మాది దేశ భక్తి పార్టీ, ఎంఐఎం దేశ ద్రోహ పార్ట్టీ


భద్రాద్రి సీతారాముల కల్యాణం తిలకించేందుకు లక్షలాది భక్తులు దక్షిణ అయోధ్య బాట పట్టారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం.. అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకోసం మిధిలా స్టేడియం అందంగా ముస్తాబైంది. సీతారాముల కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ దంపతులు, డిప్యూటీ సీఎం దంపతులు, మంత్రి పొంగులేటి దంపతులు, ముఖ్యనేతలు, స్థానిక నేతలు, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

భద్రాచలం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులకు రామాలయంలో అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామ చంద్ర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అధికారులు మిధిలా స్టేడియం ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. శ్రీరాముని కల్యాణోత్సవాన్ని అందరూ వీక్షించేందుకు అన్ని సెక్టార్లలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కాగా సోమవారం శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. వేసవి కావడంతో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.


కాగా కల్యాణం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన బూరం శ్రీనివాసరావు అనే సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సన్న బియ్యం పంపీణిని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన నేపథ్యంలో సన్న బియ్యం అందుకున్న లబ్ధిదారుల ఇళ్లలో ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆదివారం భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కల్యాణానికి విచ్చేసిన సీఎం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీరామనవమి వేడుకలు.. సీతారాముల కల్యాణం..

ఒంటిమిట్ట కోదండరామ బ్రహ్మోత్సవాలు

పాలకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి..

For More AP News and Telugu News

Updated Date - Apr 06 , 2025 | 01:09 PM