Bhadradri Temple: రామయ్య భూముల్లో ప్రహరీ నిర్మాణం చేపడతాం
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:31 AM
ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాచల రామయ్యకు చెందిన భూములకు రక్షణగా భద్రాద్రి దేవస్థానం శ్రీగోకులరామం చుట్టూ నిర్మించతలపెట్టిన ప్రహరీ నిర్మాణానికి మరోసారి దేవస్థానం అధికారులు కసరత్తు చేపడుతున్నారు.

పోలీసుల సహకారం కోరుతూ భద్రాద్రి దేవస్థానం లేఖ!
భద్రాచలం, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాచల రామయ్యకు చెందిన భూములకు రక్షణగా భద్రాద్రి దేవస్థానం శ్రీగోకులరామం చుట్టూ నిర్మించతలపెట్టిన ప్రహరీ నిర్మాణానికి మరోసారి దేవస్థానం అధికారులు కసరత్తు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రహరీ నిర్మాణానికి ఉన్నతాధికారుల నుంచి ఆమోద ముద్ర రాగా పనులు చేపట్టే క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు.
దాంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. సుమారు రూ.70లక్షలతో ప్రహరీ నిర్మాణం చేపట్టనుండగా దానికి సహకరించాలని కోరుతూ 2 రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులకు భద్రాద్రి దేవస్థానం అధికారులు లేఖ రాశారని తెలిసింది. ఇటీవల రామయ్య భూముల్లో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన దేవస్థానం ఈవో రమాదేవిపై, ఇతర సిబ్బందిపై ఆక్రమణదారులు దాడి చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి దేవస్థానం అధికారులు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీకి, ఏపీలోని పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాసినట్టు సమాచారం.