Home » Apple Devices
టెక్ ప్రపంచంలో ఆపిల్ నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది. కొత్తగా వచ్చిన ఆపిల్‌కేర్ వన్ సర్వీస్ ప్లాన్ ద్వారా, వినియోగదారులు ఒక్క సబ్‌స్క్రిప్షన్‌తో ఐఫోన్, ఐప్యాడ్, మాక్, యాపిల్ వాచ్ వంటి అనేక ఉత్పత్తులకు సమగ్ర రక్షణ, ప్రీమియం సపోర్ట్ పొందవచ్చు.
భారతదేశంలో ఐఫోన్ తయారీ రంగానికి మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై ఫాక్స్‌కాన్ ప్లాంట్ (Foxconn India) నుంచి 300 మందికిపైగా చైనీస్ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అనూహ్యంగా వెనక్కి రప్పించారు. ఈ నిర్ణయం ద్వారా ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపించనుందని నిపుణులు చెబుతున్నారు.
టెక్ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ WWDC 2025 ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. టెక్ దిగ్గజం ఆపిల్ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌ను జూన్ 9న ఘనంగా ప్రారంభించనుంది. 5 రోజులపాటు కొనసాగనున్న ఈ ఈవెంట్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు సహా కీలక అప్‌డేట్స్ ప్రకటించనున్నారు.
టెక్ దిగ్గజం ఆపిల్ వాయిస్ అసిస్టెంట్ సిరి వినియోగదారుల అనుమతి లేకుండా వారి డేటాను రికార్డ్ చేసిందంటూ ఆరోపించిన క్లాస్ యాక్షన్ దావాను పరిష్కరించడానికి.. సదరు కంపెనీ 95 మిలియన్ డాలర్లు (రూ.810 కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ..
ఆపిల్ కంపెనీ ఐఫోన్ల తయారీ యూనిట్‌ను చైనా నుంచి భారత్‌కు తరలించాలనే యోచనలో ఉంది. ట్రంప్ విధించిన సుంకాలు, చైనా మీద ఆధారత తగ్గించాలన్న వ్యూహం ఇందుకు కారణంగా కనిపిస్తోంది
ఆపిల్ ప్రియులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈ క్రమంలో తన సిరీస్ వాచ్‌లలో కెమెరాలు అమర్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రస్తుతం పల్లెటూళ్లలో కూడా ఐఫోన్లు వాడే వాళ్లు కనబడుతున్నారు. ఐఫోన్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు యాపిల్ కంపెనీ మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. బడ్జెట్‌లో అందరికీ అందుబాటులో ఉండే ఎస్‌ఈ 4 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇండియాలో ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టెక్ ప్రియులు. ఇటీవలి కాలంలో ఐఫోన్ 17 సిరీస్ గురించి అనేక వార్తలు, ఫీచర్లకు సంబంధించిన లీక్‌లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మరి, టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ పై ప్రకటించిన ఆఫర్లు, ఈ సిరీస్‌లో ఉండబోయే ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఐఫోన్, మ్యాక్‌బుక్ వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఈ డివైజెస్ వినియోగించే వాళ్లు తక్షణం తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్నీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ - ఐఎన్) సూచన జారీ చేసింది. ఆయా ఉత్పత్తుల్లోని ఓఎస్‌లో కొన్ని కోడ్స్ కారణంగా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
యూపిల్ పరికరాలను వాడేవారు తమ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటి వ్యక్తిగత డేటా స్టోర్ చేసుకోవడానికి ఐక్లౌడ్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ప్రొటెక్షన్ బాగానే ఉన్నప్పటికీ ఈ డివైజ్ కూడా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి యూజర్లు కొన్ని టిప్స్‌ను పాటిస్తే ప్రొటెక్షన్ పెరుగుతుంది. ఆ టిప్స్ ఇవే