Share News

WWDC 2025: ఆపిల్ ఈవెంట్ నుంచి సరికొత్త అప్‌డేట్స్‌..ఈసారి ఏం ఉన్నాయంటే..

ABN , Publish Date - Jun 08 , 2025 | 09:57 PM

టెక్ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ WWDC 2025 ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. టెక్ దిగ్గజం ఆపిల్ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌ను జూన్ 9న ఘనంగా ప్రారంభించనుంది. 5 రోజులపాటు కొనసాగనున్న ఈ ఈవెంట్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు సహా కీలక అప్‌డేట్స్‌ ప్రకటించనున్నారు.

WWDC 2025: ఆపిల్ ఈవెంట్ నుంచి సరికొత్త అప్‌డేట్స్‌..ఈసారి ఏం ఉన్నాయంటే..
WWDC 2025

టెక్ ప్రియులు అనేక రోజులుగా ఎదురుచూస్తున్న ఈవెంట్ WWDC 2025 రానే వచ్చేసింది. టెక్ దిగ్గజం ఆపిల్, తన వార్షిక డెవలపర్ ఈవెంట్‌ను జూన్ 9 నుంచి ఐదు రోజులపాటు జరుపనుంది. ఈ కార్యక్రమం ఇండియన్ టైమ్ ప్రకారం రాత్రి 10:30కి మొదలవుతుంది. దీని ప్రారంభ వేడుక ఆపిల్ CEO టిమ్ కుక్ లైవ్ నోట్‎తో మొదలు కానుంది. సాధారణంగా WWDCలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సహా అనేక ఉత్పత్తులు వస్తాయని బావిస్తారు.


AI మోడళ్లను

కానీ ఈసారి కొంచెం ప్రత్యేకం. ఎందుకంటే టెక్ ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తున్న AI రేవల్యూషన్ పై ఆపిల్ ఎలా వస్తుందనే దానిపై అనేక మందిలో ఆసక్తి నెలకొంది. గతేడాది Apple Intelligence పేరుతో AI రంగంలోకి అడుగుపెట్టిన ఆపిల్, ఇతర కంపెనీలతో పోల్చుకుంటే కొంచెం నెమ్మదిగా వచ్చింది. కానీ ఈసారి కీలకమైన ముందడుగు వేయబోతోందని సమాచారం. WWDC 2025లో ఆపిల్ తన ఫౌండేషనల్ AI మోడళ్లను థర్డ్ పార్టీ డెవలపర్లకు సపోర్ట్ చేస్తుందని సమాచారం.


ఈసారి మాత్రం..

అంటే ఇకపై iPhone, iPad యాప్ డెవలపర్లు కూడా Apple AIని తమ యాప్‌ల్లోకి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇది ఆపిల్ ఎకోసిస్టమ్‌లో కొత్తదనాన్ని తీసుకొస్తుంది. బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్స్ ప్రకారం ఆపిల్ iOS 19ను స్కిప్ చేసి, iOS 26 పేరుతో కొత్త వర్షన్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి వినియోగదారులకు పూర్తిగా కొత్త ఇంటర్‌ఫేస్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ ను ఇవ్వాలనే లక్ష్యంతో, iPhone, iPad, Mac, Apple Watch, Vision Pro వంటి అన్ని డివైస్‌ల ఇంటర్‌ఫేస్‌లను ఒకేలా తీర్చిదిద్దాలని ఆపిల్ భావిస్తోంది. ఇది వినియోగదారులకు వినూత్నమైన అనుభవాన్ని అందించనుంది.


హెడ్జ్ గెస్టర్స్

AirPods కూడా ఈ WWDCలో కీలక అప్‌డేట్స్ పొందబోతున్నాయి. ముఖ్యంగా లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ ద్వారా ఇతర భాషల్లో మాట్లాడేటప్పుడు రియల్‌టైంలో అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా కాల్స్ విషయంలో తల ఊపడం, మెసేజ్‌ను డిక్లైన్ చేయడానికి తల ఆడించడం వంటి హెడ్జ్ గెస్టర్ కంట్రోల్స్‌ను కూడా ప్రవేశపెడుతుందని టాక్. ఆపిల్ ఇప్పుడు గేమింగ్ రంగాన్ని కూడా టార్గెట్ చేస్తోంది. కంపెనీ కొత్తగా ఓ సోషియల్ గేమింగ్ యాప్ ను లాంచ్ చేయనుంది. ఇది iPhones, iPads, Macs, Apple TVలో ముందుగానే ఇన్‌స్టాల్ అయి ఉంటుందని తెలిసింది.


హెల్త్ సహా..

ఆపిల్ హెల్త్ యాప్‌ నుంచి మెగా అప్‌డేట్ రానుంది. ఈసారి, AI డ్రివెన్ చాట్‌బాట్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య సమాచారం, డైలీ హెల్త్ టిప్స్, వెల్‌నెస్ రికమెండేషన్లు ఇచ్చేలా డిజైన్ చేశారు. ఇంకా iMessageలో కొత్తగా వచ్చే ఫీచర్లలో AI ఆధారిత పోల్స్ సృష్టించడం, రియల్‌టైమ్ ట్రాన్స్లేషన్ వంటి ఫీచర్లు ఉంటాయట. ఈ వర్చువల్ ఈవెంట్‌ను Apple Developer App, ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, YouTube ద్వారా లైవ్‎గా చూడవచ్చు.


ఇవీ చదవండి:

ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..


4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2025 | 10:00 PM