Home » AP CM
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐజేయూ జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో పాత్రికేయుల నివాసాల కోసం భూమి కేటాయించేందుకు సానుకూలంగా పరిశీలిస్తామని భరోసానిచ్చారు.
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కీలక పోరులో సమష్టి ప్రదర్శనతో టీమ్ఇండియా విజయం సాధించడం భారత క్రీడాభిమానులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
భారత డెయిరీ రంగ అభివృద్ధిలో విశిష్ట సేవలకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక 'అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025'ను సౌత్‌జోన్ ప్రదానం చేసింది.
‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇలాంటి అవార్డులు తాను ఎప్పుడూ తీసుకోలేదని అన్నారు.
కేంద్ర ప్రాయోజిత పథకాలు, నిధుల వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు సమీక్ష జరిపారు. కొన్ని శాఖలు, కొన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం సరికాదని..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబుకి తెలుగు రాష్ట్రాలనుంచే కాక, దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు. సీఎంకు స్థానిక నాయకులు, ప్రజలు అఖండ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.
పోలవరం-బనకచర్లతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కోస్తా తీరంలో 975 కిలోమీటర్లపాటు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రకృతి విపత్తులు, సునామీ, తుఫానుల నుంచి భూమిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నేతృత్వంలో మొక్కల పెంపకంతో సముద్ర తీరంలో పర్యావరణ సమతుల్యత సాధించడానికి ప్రణాళికలు రూపొందించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ తనకు సమానమేనని.. రెండూ అభివృద్ధి చెందాలన్నదే తన ఆశ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులు కడితే తామెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ఆయన గుర్తుచేశారు.