Share News

Breaking News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

ABN , First Publish Date - Jan 05 , 2026 | 07:33 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Breaking News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య
Breaking News

Live News & Update

  • Jan 05, 2026 19:47 IST

    సిద్దిపేట: డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసు FIRలో కీలకాంశాలు

    • జీజీహెచ్ వైద్యుడు ప్రణయ్ తేజతో లావణ్య రిలేషన్‌షిప్

    • కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించిన డాక్టర్‌ ప్రణయ్‌

    • రెండు నెలలుగా లావణ్యను దూరంపెట్టిన ప్రణయ్ తేజ

    • నెల క్రితం లావణ్య ఆత్మహత్యాయత్నం, అడ్డుకున్న స్నేహితులు

    • మరోసారి ప్రణయ్‌ను కలిసిన లావణ్య, పెళ్లి చేసుకోవాలని విజ్ఞప్తి

    • పెళ్లికి ప్రణయ్‌ నిరాకరించిడంతో 'ప్యారక్విట్' ఇంజక్షన్‌తో ఆత్మహత్య

    • డాక్టర్‌ ప్రణయ్‌పై త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు

  • Jan 05, 2026 19:46 IST

    హిందూ యువకుడి హత్య

    • బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

    • రాణా ప్రతాప్‌ను కాల్చిచంపిన దుండగులు

  • Jan 05, 2026 18:07 IST

    అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇంటిపై దాడి

    • సిన్సినాటిలోని జేడీ వాన్స్‌ ఇంటిపై కాల్పులు

    • వాన్స్‌ ఇంటి అద్దాలు ధ్వంసం, నిందితుడు అరెస్టు

  • Jan 05, 2026 18:07 IST

    అసెంబ్లీ సెక్రటరీతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ

    • సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌పై BRS ఫిర్యాదు

    • కృష్ణా జలాలపై చర్చలో సభను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు

  • Jan 05, 2026 18:05 IST

    శ్రీవారి పరకామణిలో సంస్కరణలపై హైకోర్టుకు టీటీడీ నివేదిక

    • పరకామణిలో హుండీ సీలింగ్‌, రవాణా, లెక్కింపు విషయంలో..

    • తక్షణం చేపట్టనున్న సంస్కరణలపై హైకోర్టుకు టీటీడీ నివేదిక

    • నివేదిక పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామన్న ఏపీ హైకోర్టు

    • కేసుల నమోదులో సుప్రీం తీర్పులను పరిశీలించి రావాలని..

    • సీఐడీ, ఏసీబీ డీజీకి ఏపీ హైకోర్టు ఆదేశం

    • కేసు తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా

  • Jan 05, 2026 17:30 IST

    NRI జనసేన శ్రేణులతో ఎమ్మెల్సీ నాగబాబు వర్చువల్ సమావేశం

    • పార్టీ కోసం పని చేసే వారికి అవకాశాలు వస్తాయి: ఎమ్మెల్సీ నాగబాబు

    • 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను పవన్.. మొదటి స్థానంలోకి తీసుకొచ్చారు: నాగబాబు

    • గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం..

    • ప్రత్యేక దృష్టిపెట్టిన గొప్ప నాయకుడు పవన్‌: నాగబాబు

    • కూటమి కలయిక కలకాలం ఉండాలని ప్రజలు భావిస్తున్నారు: నాగబాబు

  • Jan 05, 2026 17:29 IST

    వీసీల సమావేశంలో మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు

    • నాలెడ్జ్ బెస్ట్ సొసైటీ తయారీలో వర్సిటీలది కీలక పాత్ర: లోకేష్‌

    • వీసీలు పరిపాలన అధిపతులు కాదు.. సంస్కరణల అంబాసిడర్లు

    • ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలుగా తయారుచేయడమే మా లక్ష్యం

    • వీసీలు భవిష్యత్ అవకాశాలపై దృష్టిపెట్టాలి: మంత్రి లోకేష్‌

    • విద్యారంగ అభివృద్ధిపై మా నిబద్ధతకు ఇదే నిదర్శనం

    • విద్యార్థుల అనుభవంలో సమానత్వం, నిలకడ లోపిస్తోంది: లోకేష్‌

  • Jan 05, 2026 15:10 IST

    ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి లీకైన గ్యాస్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా

    • జిల్లా కలెక్టర్, ఎస్పీల‌తో ఫోన్‌లో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్న మంత్రి

    • స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేప‌ట్టాల‌ని ఆదేశం

    • సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని కలెక్టర్‌కు ఆదేశాలు

    • ఓఎన్‌జీసీ కంపెనీ ప్రతినిధుల‌తో మాట్లాడి సాంకేతిక నిపుణుల‌చే.. మంటలను అదుపులోకి తెవాలని మంత్రి ఆదేశం

  • Jan 05, 2026 14:36 IST

    నదీ జలాలపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు

    • ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టాం: సీఎం చంద్రబాబు

    • కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు అడ్డుపడలేదు: చంద్రబాబు

    • విద్వేషాలు కాదు.. ఐక్యత ముఖ్యం: సీఎం చంద్రబాబు

    • గోదావరి-పెన్నా నదుల అనుసంధానం కావాలి: చంద్రబాబు

    • కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు నీళ్లిచ్చాం: చంద్రబాబు

    • గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే ఎప్పుడూ అడ్డుచెప్పలేదు: చంద్రబాబు

  • Jan 05, 2026 13:43 IST

    అన్ని అంశాలపై చర్చించాలని బీఏసీలో BRS పట్టుబట్టింది: భట్టి

    • బీఆర్ఎస్ కోరికతో అన్ని అంశాలపై చర్చ పెడుతున్నాం

    • పాలమూరు, రంగారెడ్డిపై చర్చ పెడితే బీఆర్ఎస్ భయపడింది

    • మీకు ఇబ్బంది అయిన రోజు వాకౌట్ చేశారంటే ఓకే..

    • మిగతా రోజులు ఎందుకు రావడం లేదు?: డిప్యూటీ సీఎం భట్టి

  • Jan 05, 2026 12:50 IST

    అసెంబ్లీలో ప్రసంగించిన ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

    • శాసనమండలిలో నా చివరి ప్రసంగం అని వ్యాఖ్య

    • ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా సమ్మక్క,సారక్క వైదిక చిహ్నాలను చెక్కారు.. ఇది కరెక్ట్ కాదు: కవిత

  • Jan 05, 2026 12:48 IST

    కొత్తగూడెం ఎంఎల్ఏ క్యాంపు కార్యాలన్నీ ముట్టడించిన బిజెపి కార్యకర్తలు

    • అసెంబ్లీ లో ప్రధాని మోదీ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన

    • అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు

  • Jan 05, 2026 12:47 IST

    ఈనెల 18న మేడారం కు సీఎం రేవంత్ రెడ్డి

    • మేడారం అభివృద్ధి పనులను సమీక్షించనున్న సీఎం రేవంత్

  • Jan 05, 2026 12:47 IST

    నిఖిత హత్య కేసులో వెలుగు లోకి సంచలన విషయాలు

    • అర్జున్ శర్మ 4,500 డాలర్లు నిఖితను అప్పు అడిగినట్లు గుర్తింపు

    • అందుకు తాను 4,500 డాలర్లు అప్పిచినట్టు ఆమె కజిన్ సరస్వతి ఓ పోస్టు

  • Jan 05, 2026 12:46 IST

    అసెంబ్లీ లాబీకి వచ్చిన మందకృష్ణ మాదిగ

    • మంత్రి శ్రీధర్ బాబును కలవడానికి వచ్చిన మందకృష్ణ

  • Jan 05, 2026 10:27 IST

    అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

    • ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై సభ్యుల ప్రశ్న

    • సమాధానం చెప్పిన మంత్రి సీతక్క

  • Jan 05, 2026 10:06 IST

    నాలుగో రోజు తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

    • మొదలైన తెలంగాణ శాసనసభ

  • Jan 05, 2026 08:52 IST

    నేడు గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీకి సీఎం చంద్రబాబు

    • 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో హాజరుకానున్న సీఎం చంద్రబాబు

    • సాయంత్రం 4:30 గంటలకు RTGSపై సీఎం చంద్రబాబు సమీక్ష

  • Jan 05, 2026 08:52 IST

    తెలంగాణ భవన్‌కు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

    • పాలమూరు-రంగారెడ్డి, నదీ జలాలపై పోరాటానికి సిద్ధమైన BRS నేతలు

    • భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్న BRS నేతలు

    • మరోవైపు శాసనసభ, మండలి సమావేశాలను బహిష్కరించిన‌ BRS

  • Jan 05, 2026 08:47 IST

    నేడు శాసనమండలికి ఎమ్మెల్సీ కవిత

    • మండలిలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని.. ఇప్పటికే మండలి ఛైర్మన్ గుత్తాను కలసి విజ్ఞప్తి చేసిన కవిత

    • నేడు శాసనమండలిలో కవిత మాట్లాడే అవకాశం

    • తన రాజీనామాను ఆమోదించమని శాసనమండలిలో కోరనున్న కవిత

    • ఇప్పటికీ కవిత రాజీనామాకు ఆమోదం తెలపని మండలి చైర్మన్ గుత్తా

  • Jan 05, 2026 08:45 IST

    అసెంబ్లీ సమావేశాలకు దూరంగా బీఆర్ఎస్

    • శాసనసభ, శాసనమండలి సమావేశాలకు దూరంగా బీఆర్ఎస్

    • నేడు ఉభయ సభలకు హాజరుకావొద్దని నిర్ణయం

    • సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వటంలేదని నిరసనగా బీఆర్ఎస్ బాయ్ కాట్

  • Jan 05, 2026 08:43 IST

    నేడు నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    • ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

    • మొదట ప్రశ్నోత్తరాలు..

    • పలు కీలక గెజిట్ నోటిఫికేషన్లు సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం

  • Jan 05, 2026 08:19 IST

    వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌కు ట్రంప్‌ హెచ్చరిక

    • వెనెజువెలా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలుచేయాలన్న ట్రంప్‌

    • తన ప్రణాళికలు అమలుచేయకపోతే రోడ్రిగ్స్‌కు భారీ మూల్యం తప్పదన్న ట్రంప్‌

    • నికోలస్ మదురో కంటే దారుణమైన శిక్ష విధిస్తామని ట్రంప్ హెచ్చరిక

  • Jan 05, 2026 08:19 IST

    ఆదిలాబాద్‌ జిల్లాలో సోయా రైతుల పోరు ఉధృతం

    • నేడు BRS ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ కలెక్టరేట్ ముట్టడి

    • రేపు ఆదిలాబాద్ బంద్‌కు BRS నేతలు పిలుపు

  • Jan 05, 2026 07:33 IST

    ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు..

    • అసోం: మోరిగావ్‌లో భూకంపం

    • రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదు

    • త్రిపుర: గోమతిలో భూకంపం

    • రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.9గా నమోదు