ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 27 , 2026 | 07:24 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Feb 27, 2026 21:38 IST
కవితకు క్లీన్‌చిట్‌పై స్పందించిన కాంగ్రెస్‌నేత జగ్గారెడ్డి
ఇది బీజేపీ పొలిటికల్ గేమ్: జగ్గారెడ్డి
లిక్కర్ మాఫియా అని చెప్పిందే బీజేపీ: జగ్గారెడ్డి
శత్రువు దోస్త్ కావచ్చు... దోస్త్ శత్రువు కావచ్చు: జగ్గారెడ్డి
-
Feb 27, 2026 21:37 IST
హాథీరాంజీ మఠాధిపతి తొలగింపుపై స్టేని కొనసాగించిన సుప్రీంకోర్టు
మఠం ఆస్తులను ప్రస్తుత మఠాధిపతి అన్యాక్రాంతం చేయకూడదని ఆదేశం
మఠం లెక్కలన్నింటినీ అడిగినప్పుడు కోర్టు ముందు ఉంచాలని ఆదేశం
-
Feb 27, 2026 21:37 IST
అమరావతి: ఫలించిన ఎంపీ కేశినేని శివనాథ్ కృషి
నందిగామ నియోజకవర్గ విద్యా రంగంలో సరికొత్త అధ్యాయం
కేంద్రీయ విద్యాలయ స్థాపనకు రాఘవపురంలో 5 ఎకరాల భూమి కేటాయింపు
జి.వో.ఎమ్.ఎస్. నెంబర్ 145 జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్
-
Feb 27, 2026 21:26 IST
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను కలవడం ఆనందంగా ఉంది: మంత్రి లోకేష్
ఏపీలో సినిమా షూటింగ్‌లకు సంబంధించి చర్చించాం
సింగిల్ విండోలో అనుమతులు ఇవ్వడం, ఫిలిం సిటీ నిర్మాణం వంటి అంశాలుపై చర్చించాం
-
Feb 27, 2026 20:38 IST
మౌంట్ ఆబూ పేరు ఇకనుంచి ఆబూ రాజ్
రాజస్థాన్‌లో మూడు సిటీలకు పేరుమార్పు
జహాజ్‌పూర్ పేరు యజ్ఞపూర్‌గా మార్పు
కామా పేరును కామవన్‌గా మార్పు
రాజస్థాన్ అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ
-
Feb 27, 2026 19:58 IST
ఉత్తరాంధ్రకు మరో భారీ ఔషధ తయారీ కంపెనీ
అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ
రేపు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా బ్లూ జెట్ పరిశ్రమకు శంకుస్థాపన
రూ.2,300 కోట్ల పెట్టుబడి, 1,750 మందికి ఉద్యోగాల కల్పన
-
Feb 27, 2026 18:45 IST
టీ20 ప్రపంచ కప్: టాస్ నెగ్గిన న్యూజిలాండ్
సూపర్ 8లో ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ కీలక పోరు
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
తొలుత ఫీల్డింగ్ చేయనున్న ఇంగ్లండ్
ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌కు చేరనున్న న్యూజిలాండ్
-
Feb 27, 2026 18:24 IST
సచివాలయంలో ముగిసిన మాజీ మావోయిస్టుల భేటీ
మాజీ మావోయిస్టుల భేటీలో చర్చించిన కీలక అంశాలు
సచివాలయం నుంచి వెళ్లిపోయిన మాజీ మావోయిస్టులు
సీఎం, ఇతర ఉన్నతాధికారులతో గంటకుపైగా సమావేశం
-
Feb 27, 2026 18:23 IST
అమరావతి: ఉండవల్లిలో మంత్రి నారాయణ పర్యటన
స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన నారాయణ
సీడ్ యాక్సిస్ రోడ్‌ను పాత గుంటూరు హైవేకు అనుసంధానిస్తూ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం
త్వరితగతిన స్టీల్‌బ్రిడ్జి అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచన
-
Feb 27, 2026 18:13 IST
అవిముక్తేశ్వరానంద స్వామికి అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ
పిల్లలపై లైంగిక వేధింపుల కోసులో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు
నార్కో అనాలసిస్ టెస్ట్‌కు అంగీకరించిన అవిమూక్తేశ్వరానంద
-
Feb 27, 2026 17:00 IST
టీవీకే చీఫ్ విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్
చెంగల్‌పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు
విజయ్‌తో విడాకులు కోరుతూ సంగీత పిటిషన్
వివాహేతర సంబంధం కారణంగా కోర్టును ఆశ్రయించిన సంగీత
విజయ్, సంగీతకు కుమారుడు, కుమార్తె
-
Feb 27, 2026 16:58 IST
కేరళ స్టోరీ-2 సినిమాకు హైకోర్టులో ఊరట
సినిమా రిలీజ్‌పై స్టే తొలగించిన కేరళ హైకోర్టు
సింగిల్ బెంచ్ స్టేను రద్దు చేసిన డివిజన్ బెంచ్
-
Feb 27, 2026 16:36 IST
ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్ సవాల్
ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ సవాల్
ఎన్నికల్లో మా కంటే బీజేపీకి 10 సీట్లు ఎక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం చేస్తా
-
Feb 27, 2026 16:07 IST
గత వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు: సీఎం చంద్రబాబు
వైసీపీ హయాంలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు
రాయలసీమలో హార్టికల్చర్‌ను ప్రోత్సహిస్తున్నాం
రైతులు Ai టెక్నాలజీ వినియోగించుకునేలా చర్యలు
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఎక్కువ ప్రాధాన్యం
-
Feb 27, 2026 15:34 IST
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
961 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
318 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Feb 27, 2026 15:33 IST
మార్చి 4వ తేదీకి ఏపీ అసెంబ్లీ వాయిదా
-
Feb 27, 2026 15:13 IST
తెలంగాణ సచివాలయానికి మావోయిస్టు అగ్రనేతలు
మావోయిస్టు అగ్రనేతలతో భేటీకానున్న సీఎం రేవంత్
సమావేశంలో పాల్గొననున్న ప్రభుత్వ సలహాదారుడు కేకే
కాసేపట్లో సీఎంతో DGP శివధర్‌రెడ్డి, ఐజీ సుమతి భేటీ
-
Feb 27, 2026 15:12 IST
నంద్యాల: డోన్ హైవేపై రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి
కారును ఢీకొన్న క్రేన్, మహిళ సహా ఇద్దరు చిన్నారులు మృతి
మృతులు కర్ణాటక వాసులుగా గుర్తింపు
-
Feb 27, 2026 15:11 IST
ప్రకాశం: వైవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తే సంతోషించే వ్యక్తిని నేనే: బాలినేని
నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని సీఎంని కోరాను
వైసీపీ హయాంలో డ్వాక్రా గ్రూప్‌ల నగదు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
నా కొడుకుపై అసత్య ఆరోపణలు చేసి క్షోభకి గురిచేశారు
-
Feb 27, 2026 15:10 IST
ఢిల్లీ లిక్కర్ కేసులో 'సౌత్ గ్రూప్' పేరుపై సీబీఐ కోర్టు తీవ్ర అభ్యంతరం
'సౌత్ గ్రూప్' అని పిలవడం సరైన చర్య కాదని హెచ్చరించిన సీబీఐ కోర్టు
నేరం నిరూపించడానికి.. ఎక్కడి వాళ్లు అన్నది సంబంధం లేదు: సీబీఐ కోర్టు
మిగతా నిందితులను 'నార్త్ గ్రూప్' అని ఎందుకు పేరు పెట్టలేదు: సీబీఐ కోర్టు
-
Feb 27, 2026 14:49 IST
భారత న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు: కవిత
లిక్కర్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు
కోర్టులో కూడా అదే నిరూపితమైంది
కేసులో అందరికీ క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం
తప్పుడు కేసును కోర్టు పూర్తిగా కొట్టివేసింది
-
Feb 27, 2026 14:05 IST
వైసీపీ MLC బొత్సకు అస్వస్థత
హైదరాబాద్‌కు బొత్స సత్యనారాయణ తరలింపు
హైదరాబాద్ సిటీ న్యూరో ఆస్పత్రిలో బొత్సకు చికిత్స
ప్రస్తుతం నిలకడగా MLC బొత్స ఆరోగ్యం
-
Feb 27, 2026 13:53 IST
2018 APPSC గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టులో విచారణ
ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
అభ్యర్థులకు అప్రాధాన్యత పోస్టులు ఇవ్వాలని గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశం
-
Feb 27, 2026 13:51 IST
ఏపీ శాసనమండలి బుధవారానికి వాయిదా
సభలో నెలపై కూర్చుని వైసీపీ సభ్యుల ఆందోళన
-
Feb 27, 2026 13:49 IST
ప్రధానిని కలిసిన హీరో, హీరోయిన్..
ప్రధాని మోదీని కలిసిన హీరో విజయ్, హీరోయిన్ రష్మిక
మార్చి 4న రిసెప్షన్‌కు మోదీని ఆహ్వానించిన దంపతులు
-
Feb 27, 2026 13:09 IST
ప్రపంచవ్యాప్తంగా 800మందిని తొలగించనున్న ఈబే
భవిష్యత్తు అవసరాల కోసం మార్పుల్లో భాగంగా లేఆఫ్స్ చెపట్టామని వెల్లడి
సంస్థ ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య 12,300
-
Feb 27, 2026 12:43 IST
రాజకీయ కారణాలతోనే నాపై కేసు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
లిక్కర్ కేసును ఎవరూ నమ్మలేదు: కవిత
నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు: కవిత
నేను మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది: కవిత
న్యాయవ్యవస్థపై నేను పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదు: కవిత
-
Feb 27, 2026 12:28 IST
ఆయేశా మీరా అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగించిన అధికారులు
ఆయేశా అవశేషాలతో తెనాలి బయలుదేరిన తల్లిదండ్రులు
కోర్టు ఆదేశాలతో ప్రత్యేక భద్రత నడుమ ఆయేశా అవశేషాలు తరలింపు
వారి మతాచారం ప్రకారం తెనాలి స్మశాన వాటికలో అంత్యక్రియలు
-
Feb 27, 2026 12:26 IST
వాట్సాప్ వెబ్ డౌన్.. యూజర్ల కంప్లెయింట్‌లు
వాట్సాప్ వెబ్‌కు కనెక్ట్ కాలేకపోతున్నామన్న నెటిజన్లు
ఎక్స్ వేదికగా పలువురి ఫిర్యాదులు
ఉదయం 9.00 గంటల సమయానికి ఫిర్యాదులు పెరిగాయన్న డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్
-
Feb 27, 2026 12:25 IST
ఏపీ శాసనమండలిలో గందరగోళం..
వైసీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన ఛైర్మన్
ఛైర్మన్ పోడియం వద్ద వైసీపీ ఎమ్మెల్సీల నిరసన
నెయ్యి అంశంపై ఎన్నిరోజులైన చర్చకు సిద్ధం: మంత్రి అచ్చెన్నాయుడు
-
Feb 27, 2026 12:23 IST
ఢిల్లీలో హింసాత్మకంగా మారిన జేఎన్‌యూ విద్యార్థుల నిరసన
విద్యార్థుల ర్యాలీని క్యాంపస్ వెలుపలికి మళ్లించేందుకు యత్నించిన పోలీసులు
ఘర్షణకు దిగిన విద్యార్థులు.. 14 మంది అరెస్ట్
పోలీసుల అదుపులో జేఎన్ యూఎస్ యూ మాజీ, ప్రస్తుత అధ్యక్షులు
-
Feb 27, 2026 11:31 IST
క్లీన్ చిట్ ఇవ్వడంతో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న కేజ్రీవాల్
రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేయనున్న సీబీఐ
ఆప్‌కు చెందిన ఐదుగురు నేతలను జైల్లో పెట్టారు: కేజ్రీవాల్
నా జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదు: కేజ్రీవాల్
-
Feb 27, 2026 11:30 IST
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం
లిక్కర్ కేసు నుంచి కేజ్రీవాల్, కవితను తప్పించిన కోర్టు
కేజ్రీవాల్, కవితతోపాటు మాజీమంత్రి సిసోడియాకు క్లీన్‌చిట్
సీబీఐ వేసిన చార్జ్‌షీట్‌లో మెరిట్ లేదన్న రౌస్ అవెన్యూ కోర్టు
కవితతో పాటు 23మంది నిందితులు తప్పు చేసినట్టు సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసిన కోర్టు
-
Feb 27, 2026 10:30 IST
ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
ఏయూ వసతి గృహాల్లో రోజువారీ వేతనాలపై ఎమ్మెల్యే ప్రశ్న
వైసీపీ హయాంలో ఉద్యోగుల కేటగిరి మారుస్తామని చెప్పి మోసం: ఎమ్మెల్యే రామకృష్ణబాబు
వైసీపీ పాలనలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలన్నింటినీ భ్రష్టు పట్టించారు: మంత్రి లోకేశ్
-
Feb 27, 2026 10:29 IST
రాజస్థాన్‌లో వెలుగులోకి దారుణ సంఘటన
కుటుంబకలహాల నేపథ్యంలో అన్న కొడుకును చంపిన తమ్ముడు
ఐదేళ్ల తర్వాత బయటపడ్డ విషయం
బాలుడి శవం కోసం పోలీసుల అన్వేషణ
-
Feb 27, 2026 10:28 IST
బ్లాక్ నుంచి 4 వేల మంది ఉద్యోగుల తొలగింపు
ప్రకటించిన సంస్థ అధినేత జాక్ డోర్సీ
ఇంటెలిజెన్స్ టూల్స్‌తో సంస్థ నిర్వహణలో మౌలిక మార్పు వస్తోందని వ్యాఖ్య
పలు మార్లు లేఆఫ్స్ చేపట్టే బదులు ఇలా చేశానని వెల్లడి
-
Feb 27, 2026 10:28 IST
ఏపీ అసెంబ్లీ: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌పై ఎమ్మెల్యే ప్రశ్న
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాం: మంత్రి నిమ్మల
పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు అందించాలనే ఆలోచనతో ప్రాజెక్ట్ ముందుకు: మంత్రి
ఈ ఏడాదిలోనే పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Feb 27, 2026 10:27 IST
నిజామాబాద్: పసుపు కొనుగోళ్ల జాప్యంపై స్పందించిన ఎంపీ అర్వింద్
ఈ-నామ్ 2.0లో సాంకేతిక సమస్యలపై ఆరా తీసిన ఎంపీ అర్వింద్
ఢిల్లీలోని ఈ-నామ్ జాయింట్ సెక్రటరీ చిన్మయితో మాట్లాడిన అర్వింద్
పాత పద్ధతిలోనే పసుపు కొనుగోలు చేయాలని కోరిన అర్వింద్
-
Feb 27, 2026 10:26 IST
ఢిల్లీ జేఎన్‌యూ దగ్గర కొనసాగుతున్న ఉద్రిక్తత
రాత్రి విద్యార్థి సంఘాల లాంగ్‌మార్చ్‌ను అడ్డుకున్న పోలీసులు
పోలీసుల, విద్యార్థుల మధ్య ఘర్షణ, తోపులాట
పోలీసులపైకి రాళ్లు, చెప్పులు, కర్రలు విసిరిన విద్యార్థులు
ఘర్షణల్లో పలువురు విద్యార్థులు, పోలీసులకు గాయాలు
-
Feb 27, 2026 10:14 IST
ఏపీ అసెంబ్లీ: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 943 రకాల సేవలు: మంత్రి లోకేశ్
వాట్సాప్ గవర్నెన్స్‌కు AIని జోడించి యూజర్ ఫ్రెండ్లీగా మార్చాం: మంత్రి లోకేశ్
వేగంగా స్పందించడం, రసీదు వంటి అంశాలపై దృష్టిసారిస్తాం: మంత్రి లోకేశ్
సభ్యులు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి: లోకేశ్
మనమిత్ర 2.0ను కూడా ప్రారంభించాలని యోచన: మంత్రి లోకేశ్
-
Feb 27, 2026 10:13 IST
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
పెండింగ్ బిల్లులు రూ.745కోట్లు విడుదల
గ్రామ పంచాయతీలకు రూ.389కోట్లు విడుదల చేసిన ఆర్థికశాఖ
-
Feb 27, 2026 10:11 IST
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
డీఎంకేలో చేరిన తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన స్టాలిన్
-
Feb 27, 2026 09:08 IST
రాజమహేంద్రవరం: మండపేట మండలం ద్వారపూడి వేములపల్లిలో దారుణ హత్య
ప్రేమ వివాహం చేసుకున్న వరుడు పోలిపల్లి సూర్యప్రకాష్‌ను హత్య చేసిన వధువు కుటుంబసభ్యులు
రాయవరం మండలం డిప్యూటీ తహసీల్దార్ సంధ్య, వేములపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి ప్రేమ వివాహం
అన్నవరం ఆలయంలో పెళ్లి చేసుకున్న సంధ్య, సూర్య ప్రకాష్
-
Feb 27, 2026 09:06 IST
పాక్ F-16 విమానాన్ని కూల్చేశాం: అఫ్గానిస్థాన్ ప్రకటన
మా గగనతలంలోకి ప్రవేశించడంతో కూల్చివేశాం: అఫ్గానిస్థాన్
F-16 యుద్ధ విమానం కూల్చివేతపై స్పందించని పాకిస్థాన్
-
Feb 27, 2026 08:52 IST
భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత
రింకు సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూత
క్యాన్సర్‌తో బాధపడుతున్న ఖచంద్ర సింగ్
ఇవాళ తెల్లవారుజామున మృతిచెందిన ఖచంద్ర సింగ్
-
Feb 27, 2026 08:33 IST
తెనాలిలో నేడు ఆయేషా మీరా శరీర అవశేషాలు ఖననం
2019లో రీపోస్టుమార్టం కోసం సేకరించిన శరీర అవశేషాలను..
నేడు ఆయేషా మీరా తల్లిదండ్రులకు అప్పగించనున్న CBI
మధ్యాహ్నం చెంచుపేటలోని ఖబరస్తాన్‌లో శరీర అవశేషాలు ఖననం
-
Feb 27, 2026 08:08 IST
ఇమ్రాన్ ఖాన్‌పై చర్చ
యూకే పార్లమెంట్‌లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై చర్చ
పాక్‌కు నిధులను ఆపాలని యూకే ఎంపీల డిమాండ్
-
Feb 27, 2026 07:40 IST
నేడే విచారణ..
నేడు స్పీకర్ ఎదుట విచారణకు హాజరుకానున్న దానం నాగేందర్
దానంపై అనర్హత వేటు పిటిషన్ దాఖలు చేసిన కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి
-
Feb 27, 2026 07:40 IST
నేడు 12వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఉదయం 9గంటలకు సభలో ప్రశ్నోత్తరాలు
పలు కీలక బిల్లులను ఆమోదించనున్న ఏపీ అసెంబ్లీ
-
Feb 27, 2026 07:30 IST
సౌదీ రాజధాని రియాద్‌లో ఘోరం
తల్లిదండ్రులను చంపి ఆత్మహత్యకు పాల్పడ్డ భారతీయ టీనేజర్
తల్లిదండ్రులను చంపాక ఆన్‌లైన్‌లో ఫుడ్ తెప్పించుకుని తిన్న తనయుడు
అనంతరం మరో చోటకు వెళ్లి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య
-
Feb 27, 2026 07:26 IST
నేటి బంగారం, వెండి ధరలివే
నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,61,010
22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,590
కిలో వెండి రూ.2,94,900
-
Feb 27, 2026 07:25 IST
మారుతున్న పులుల స్వభావం
మనుషులను టార్గెట్ చేస్తున్న పులులు
2024తో పోలిస్తే.. 2025లో గణనీయంగా పెరిగిన దాడులు
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నివేదికలో ఆసక్తికర విషయాలు
-
Feb 27, 2026 07:24 IST
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు
పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ ప్రతీకార దాడులు
55 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్టు తాలిబన్లు ప్రకటన
19 పాక్ అవుట్ పోస్టులు, 2 స్థావరాలను ధ్వంసం చేసినట్టు అఫ్గాన్ వెల్లడి