Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 26 , 2026 | 06:54 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Feb 26, 2026 21:27 IST

    నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లిష్‌ మీడియం సిఫార్సు

    • ఒకటో తరగతి నుంచే త్రిభాషా విధానం అమలుకు సూచన

    • తెలుగు/ఉర్దూ, ఇంగ్లిష్‌, హిందీ బోధన: విద్యా కమిషన్‌

    • D.EI.ED కోర్సు రద్దుకు విద్యాకమిషన్‌ సూచన

    • EAPCET రద్దుకు విద్యాకమిషన్‌ సిఫార్సు

    • ఇంటర్‌ మార్కులు ఆధారంగా ఇంజినీరింగ్‌, అగ్రి, ఫార్మసీ అడ్మిషన్లు

  • Feb 26, 2026 21:27 IST

    తెలంగాణ ప్రభుత్వానికి విద్యాకమిషన్‌ కీలక సూచనలు

    • సెర్చ్‌ కమిటీ ద్వారా వీసీల నియామకం చేపట్టాలి: కమిషన్‌

    • టీచర్లకు ఆటోమేటిక్‌ పదోన్నతుల రద్దుకు సూచన

    • పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలన్న కమిషన్

    • ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా తప్పనిసరి

    • మెరుగుపడకపోతే సర్వీస్‌ నుంచి తొలగించాలని సూచన

  • Feb 26, 2026 20:32 IST

    శ్రీకాకుళం, తూ.గో.జిల్లా ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • రెండు జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీలో సీఎం చంద్రబాబు ఫైర్‌

    • అధికార యంత్రాంగాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

    • ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయి పర్యటనలకు మీరు వెళ్తారా?

    • లేక నేను వెళ్లడం మొదలుపెట్టమంటారా?: సీఎం చంద్రబాబు

  • Feb 26, 2026 19:53 IST

    శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలం పొన్నాడ బ్రిడ్జి వద్ద దారుణ హత్య

    • హత్యకు గురైన శ్రీకాకుళం వాంబే కాలనీకి చెందిన పైల మోహనరావు

  • Feb 26, 2026 19:52 IST

    ఖమ్మం వెలుగుమట్ల ఘటనపై మంత్రి పొంగులేటి స్పందన

    • మాది పేదల ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

    • హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణల కూల్చివేత వాస్తవమే: పొంగులేటి

    • 2023లో BRS కూడా ఇళ్లు కూలగొట్టింది: మంత్రి పొంగులేటి

    • నష్టపోయిన పేదలందరికీ న్యాయం చేస్తాం: మంత్రి పొంగులేటి

    • అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం: మంత్రి పొంగులేటి

  • Feb 26, 2026 19:51 IST

    భద్రాద్రి: చుంచుపల్లిలో గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు

    • 408 కేజీల గంజాయి పట్టివేత

    • నలుగురు అరెస్టు

  • Feb 26, 2026 19:03 IST

    నంద్యాల: ఆత్మకూరులో కల్తీ నెయ్యి కలకలం

    • ఎరుకల పేటలో రాజు అనే వ్యక్తి ఇంట్లో విజిలెన్స్, పోలీస్ అధికారుల సోదాలు

    • 20 కేజీల కల్తీ నెయ్యి, 4కిలోల కల్తీ నెయ్యి పౌడర్ స్వాధీనం

  • Feb 26, 2026 18:54 IST

    వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈఓ పదవికి బోర్జ్ బ్రెండే రాజీనామా

    • జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బోర్జ్ బ్రెండే సంబంధాలపై దర్యాప్తు చేపట్టిన ఫోరమ్

    • ఫోరమ్ దర్యాప్తు నేపథ్యంలో రాజీనామా నిర్ణయం తీసుకున్న బోర్జ్ బ్రెండే

    పూర్తికథనం

  • Feb 26, 2026 18:46 IST

    హైదరాబాద్‌: విద్యాశాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

    • స్కూళ్లలో మౌలిక వసతులపై దృష్టిపెట్టాలి

    • ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణంలో రాజీపడొద్దు

    • మధ్యాహ్న భోజన నాణ్యత కోసం Ai టెక్నాలజీ వినియోగించాలి

    • పకడ్బందీగా బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌ అమలుచేయాలి

  • Feb 26, 2026 18:40 IST

    అనిల్ అంబానీపై మరో కేసు నమోదు

    • అనిల్ అంబానీపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది

    • బ్యాంక్ ఆఫ్ బరోడాను మోసం చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు

    • బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో ఆర్‌కామ్‌పైనా కేసు నమోదు

  • Feb 26, 2026 18:34 IST

    ఏప్రిల్‌లో తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ

    • తెలంగాణలో SIRకు ఈసీఐ సన్నాహాలు

    • తెలంగాణ ఎన్నికల సంఘానికి ఈసీఐ సూచనలు

    • ఈసీఐ ఆదేశాలతో అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు

  • Feb 26, 2026 18:31 IST

    T20 WC సూపర్‌-8: సౌతాఫ్రికా విజయం

    • వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం

    • వెస్టిండీస్‌- 176/8, సౌతాఫ్రికా- 177/1

    • 23 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన సౌతాఫ్రికా

    • సౌతాఫ్రికా విజయంతో మెరుగైన భారత్‌ సెమీస్‌ అవకాశాలు

  • Feb 26, 2026 17:06 IST

    కాళేశ్వరంపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా?: అద్దంకి దయాకర్

    • బీఆర్ఎస్, బీజేపీకి మూసీ ప్రక్షాళన ఇష్టం లేదు

    • ప్రభుత్వానికి మంచిపేరొస్తుందని ఓర్వలేకపోతున్నారు

    • కాళేశ్వరం పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు

    • NDSA నివేదిక ప్రకారం ముందుకెళ్తాం

  • Feb 26, 2026 17:05 IST

    తెలంగాణలో దుర్మార్గ ప్రభుత్వం రాజ్యమేలుతోంది: కేటీఆర్‌

    • హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వరకు కూల్చివేతలే: కేటీఆర్‌

    • ఇళ్ల కూల్చివేత పాపం ముగ్గురు మంత్రులదే: కేటీఆర్‌

    • భూదాన్‌ భూముల బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్

  • Feb 26, 2026 17:04 IST

    జనగామ: స్టేషన్ ఘనపూర్‌లో ప్రమాదం

    • రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు

    • ప్రమాదంలో ఒకరు గల్లంతు

  • Feb 26, 2026 17:03 IST

    తెలంగాణలో అభివృద్ధి పనుల కార్యాచరణ ప్రణాళికకు కేబినెట్‌ సబ్‌కమిటీ

    • నలుగురు మంత్రులతో సబ్‌కమిటీ ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రభుత్వం

    • కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌, పొంగులేటి శ్రీనివాస్

    • 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్న కేబినెట్‌ సబ్‌కమిటీ

    • MPTC, ZPTC ఎన్నికలు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు

    • అసెంబ్లీ సమావేశాలు ముగిశాక 3 నెలలపాటు క్షేత్రస్థాయికి సబ్‌కమిటీ

  • Feb 26, 2026 17:02 IST

    అమరావతి: సభలో చర్చకు వైసీపీ భయపడుతోంది: మంత్రి పయ్యావుల

    • కేవలం గొడవ చేయడానికే సభకు వస్తున్నారు

    • వాస్తవాలు బయటకు వస్తాయనే వైసీపీ భయం

    • చర్చకు రాకుండా వైసీపీ పారిపోతోంది

    • చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నా.. వైసీపీ సిద్ధంగా లేదు

    • చర్చ కావాలని వైసీపీ నోటీసు కూడా ఇవ్వలేదు

  • Feb 26, 2026 17:00 IST

    T20 WC సూపర్‌-8: సౌతాఫ్రికా టార్గెట్‌ 177 పరుగులు

    • వెస్టిండీస్‌ స్కోర్‌- 176/8

    • వెస్టిండీస్‌ బ్యాటింగ్‌: షెఫర్డ్‌ 52, హోల్డర్‌ 49 పరుగులు

  • Feb 26, 2026 16:09 IST

    కడప: బ్రహ్మంగారిమఠంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి పీఠాధిపతి పట్టాభిషేకం కార్యక్రమం

    • 12 వ పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామికి పట్టాభిషేకం

    • వెంకటాద్రి స్వామి సింహాసనంపై అధిష్ఠించి కిరీట ధారణ చేసిన పలువురు పీఠాధిపతులు

  • Feb 26, 2026 15:59 IST

    ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    • అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో పడిపోయిన సూచీలు

    • మదుపర్లలో ఆందోళనలు పెంచిన అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ

    • ఫ్లాట్‌గా ముగిసిన సెనెక్స్, నిఫ్టీ

    పూర్తికథనం

  • Feb 26, 2026 15:44 IST

    సంగారెడ్డి: కొల్లూరు పీఎస్ పరిధిలో గంజాయి పట్టివేత

    • శేరిలింగంపల్లి జోన్ ఎస్ఓటీ సిబ్బందికి చిక్కిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లు

    • కొల్లూరు అంబేద్కర్ కాలనీలో 2.6 కిలోల గంజాయి పట్టివేత

    • అద్దె కారులో మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి సప్లయ్

    • ఎస్ఓటీ సిబ్బందికి చిక్కిన మహ్మద్ ఖాన్, ఒవెజ్ అనే వ్యక్తులు

  • Feb 26, 2026 15:43 IST

    మద్యం కుంభకోణం కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్

    • విజయవాడ: మద్యం కుంభకోణం కేసులో ఎ7 నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్టు

    • నాలుగు గంటల పాటు సాగిన విచారణ

    • విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

    • ఆ తరువాత ఏసీబీ కోర్టులో అవినాష్ రెడ్టిని హాజరు పరుచనున్న సిట్

  • Feb 26, 2026 15:38 IST

    ఖమ్మం: వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో కేటీఆర్‌ పర్యటన

    • భూదాన్‌ భూముల్లో తొలగించిన ఆక్రమణలను పరిశీలించిన కేటీఆర్‌

    • భూదాన్‌ భూముల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం: కేటీఆర్‌

    • వెలుగుమట్ల భూదాన్‌ భూముల బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్‌

    • అందరికీ న్యాయం జరిగే వరకు పోరాడతాం: కేటీఆర్‌

    • బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇదే స్థలంలో అందరికీ ఇళ్లు కట్టిస్తాం: కేటీఆర్‌

  • Feb 26, 2026 15:15 IST

    కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు

    • నల్లమల సాగర్‌తో తెలుగు రాష్ట్రాలకు లాభం తప్ప నష్టం లేదు

    • తెలంగాణ వాళ్లు కూడా నల్లమల సాగర్‌కు అభ్యంతరం చెప్పొద్దు

    • పోలవరం-నల్లమల సాగర్‌ వల్ల ఎవ్వరికీ నష్టం లేదు

    • సముద్రంలోకి వెళ్లే నీటిని మాత్రమే మేం ఉపయోగించుకుంటాం

  • Feb 26, 2026 15:07 IST

    తెలంగాణ విద్యావిధానంపై సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక

    • నివేదిక అందజేసిన విద్యాకమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి

  • Feb 26, 2026 15:01 IST

    ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

  • Feb 26, 2026 15:00 IST

    కేరళ స్టోరీ-2 సినిమా విడుదలపై హైకోర్టు స్టే

    • రేపు విడుదల కావాల్సిఉన్న కేరళ స్టోరీ-2 సినిమా నిలిపివేత

    • సెన్సార్‌ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం

    • సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయి: కేరళ హైకోర్టు

    • సినిమా సరిగా చూడకుండానే అనుమతి ఇచ్చారు: కేరళ హైకోర్టు

    • ఫిర్యాదులను సెన్సార్‌ బోర్డు పరిగణనలోకి తీసుకోవాలి: హైకోర్టు

  • Feb 26, 2026 13:32 IST

    ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా

    • లడ్డూ అంశంపై అధికార, విపక్షాల మధ్య మండలిలో దుమారం

    • ఎన్ని గంటలైనా చర్చించేందుకు సిద్ధమన్న అధికార పక్షం

    • అధికార, విపక్షాల మధ్య హాట్ హాట్‌గా చర్చ జరుగుతుండగా..

    • మండలిని అర్ధాంతరంగా రేపటికి వాయిదా వేసిన చైర్మన్

  • Feb 26, 2026 13:32 IST

    ఎరాజ్‌పల్లిలో రైతుల ధర్నా

    • నిజామాబాద్: బోధన్ మండలం ఎరాజ్‌పల్లిలో రైతుల ఆందోళన

    • యూరియాపై ఆంక్షలు ఎత్తివేయాలని సొసైటీ ఎదుట ధర్నా

  • Feb 26, 2026 13:31 IST

    ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని మోదీ

    • జెరూసలెంలోని హోలోకాస్ట్ స్మారకాన్ని సందర్శించిన మోదీ

  • Feb 26, 2026 13:25 IST

    గుంటూరు: RRR కస్టోడియల్ టార్చర్ కేసు

    • IPS సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

    • సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన ఏపీ పోలీసులు

    • ప్రస్తుతం బిహార్‌లో IGగా పనిచేస్తున్న సునీల్ నాయక్

  • Feb 26, 2026 13:24 IST

    ఏపీ మండలిలో మరోసారి రచ్చ

    • రాయలసీమ నీటి ప్రాజెక్టులపై ఏపీ మండలిలో మరోసారి రచ్చ

    • గాలేరు-నగరి ప్రాజెక్టుపై వైసీపీ ఎమ్మెల్సీ ప్రశ్న

    • రాయలసీమ ప్రాజెక్ట్, ఇతర పథకాలకు తేడా తెలుసుకుని ప్రశ్నలు వేయండి: మంత్రి రామానాయుడు

    • రాయలసీమ ఎత్తపోతల పథకాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు: బొత్స సత్యనారాయణ

  • Feb 26, 2026 12:13 IST

    వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

    • కోర్టు సిబ్బందిని బయటకు పంపి బాంబు స్క్వాడ్ తనిఖీలు

  • Feb 26, 2026 11:52 IST

    ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

    • మార్చి 5 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం, 6న స్క్రూటినీ

    • ఉపసంహరణకు మార్చి 9 చివరి తేదీ, 16న పోలింగ్

    • మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్

  • Feb 26, 2026 11:51 IST

    మోస్ట్ వాంటెడ్ అరెస్ట్‌

    • ఏపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ అనిల్‌కుమార్‌రెడ్డి అరెస్ట్‌

    • ఇంటర్‌పోల్‌ సాయంతో అనిల్‌కుమార్‌రెడ్డిని పట్టుకున్న CBI

    • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఏపీ పోలీసులకు అనిల్‌కుమార్‌రెడ్డిని అప్పగింత

    • ఇంటర్‌పోల్ ద్వారా 130 మందికి పైగా మోస్ట్ వాంటెడ్ నేరస్థులను భారత్‌కు అప్పగింత

  • Feb 26, 2026 11:50 IST

    జూబ్లీహిల్స్‌ మంగళగౌరి షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం

    • వెల్డింగ్ పనులు చేస్తుండగా చెలరేగిన మంటలు

    • 3 ఫైరింజన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

    • షాపింగ్ మాల్‌లో ఫర్నిచర్, వస్త్రాలు పూర్తిగా దగ్ధం

    • రోడ్ నెం.36లో భారీగా ట్రాఫిక్ జామ్

    పూర్తి కథనం

  • Feb 26, 2026 11:50 IST

    ఏపీ శాసనమండలిలో ఉద్రిక్త వాతావరణం

    • ఎమ్మెల్సీ సోమువీర్రాజు మీదకు దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు

    • రాయలసీమ ప్రాజెక్ట్‌పై చర్చకు పట్టుబట్టిన వైసీపీ ఎమ్మెల్సీలు

    • సమాధానం పూర్తైందన్న చైర్మన్.. మరో ప్రశ్న లేవనెత్తిన సోమువీర్రాజు

    • సోమువీర్రాజు మీదకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్

    • దీంతో మూడోసారి మండలిని వాయిదా వేసిన చైర్మన్

  • Feb 26, 2026 11:36 IST

    తిరిగి ప్రారంభమైన శాసనమండలి..

    • తాము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ప్రసంగం ఏంటని ప్రశ్నించిన బొత్స

    • తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం వాస్తవమా? కాదా చెప్పాలని కోరిన బొత్స

    • రేవంత్‌రెడ్డి చెప్పిన విషయంతో ఏకీభవిస్తారా? లేదా? అనే అంశానికి సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్

    • ప్రశ్నకు సమాధానం చెప్పడం పూర్తి అయిందని చెప్పిన చైర్మన్

    • మండలి చైర్మన్‌ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆగ్రహం

  • Feb 26, 2026 11:35 IST

    కాసేపట్లో నెల్లూరు కార్పొరేషన్‌ మేయర్ ఎన్నిక

    • హాజరైన 42 మంది టీడీపీ కార్పొరేటర్లు

    • నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 54 మంది కార్పొరేటర్లు

    • ఒక కార్పొరేటర్‌ రాజీనామాతో ప్రస్తుతం 53 మంది కార్పొరేటర్లు

    • టీడీపీ మేయర్ అభ్యర్థిగా బరిలో దేవరకొండ సుజాత

    • వైసీపీ కార్పొరేటర్లు, MLC చంద్రశేఖర్‌రెడ్డి గైర్హాజరు

  • Feb 26, 2026 11:34 IST

    ఏపీ శాసనమండలిలో గందరగోళం

    • రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం

    • తెలంగాణతో చంద్రబాబు కుమ్మక్కయ్యారు: వైసీపీ

    • అసలైన రాయలసీమ ద్రోహి జగన్‌: టీడీపీ

    • వాయిదాపడ్డ ఏపీ శాసనమండలి

  • Feb 26, 2026 11:31 IST

    విజయవాడ సిట్‌ ఆఫీస్‌లో లొంగిపోయిన ముప్పిడి అవినాష్‌రెడ్డి

    • ఏపీ లిక్కర్ స్కాం కేసులో A-7 ముప్పిడి అవినాష్‌రెడ్డి

    • సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణతో లొంగిపోయిన ముప్పిడి అవినాష్‌రెడ్డి

    • గతంలో హైకోర్టులో బెయిల్ నిరాకరణతో పరారీలో ముప్పిడి అవినాష్‌రెడ్డి

  • Feb 26, 2026 11:03 IST

    ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం

    • నేడు సిట్ ఎదుట ముప్పిడి అవినాష్‌రెడ్డి లొంగిపోయే అవకాశం

    • ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడు ముప్పిడి అవినాష్‌రెడ్డి

  • Feb 26, 2026 10:58 IST

    రాజమహేంద్రవరం కల్తీ పాల బాధితులను పరామర్శించిన మంత్రి దుర్గేష్

    • కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న 8 మందిలో నలుగురి పరిస్థితి విషమం

    • బాధితులను కాపాడేందుకు 'ఫోబి ఫిజల్' మెడిసిన్‌ తెప్పించిన ప్రభుత్వం

    • ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి

  • Feb 26, 2026 10:56 IST

    స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

    • హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,680

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200

    • కిలో వెండి ధర రూ.2,95,000

    పూర్తి కథనం

  • Feb 26, 2026 10:55 IST

    మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీ విచారణ

    • ముంబైలోని ఈడీ కార్యాలయానికి వెళ్లిన అంబానీ

    • విదేశీ ఆస్తులు, ఫెమా ఉల్లంఘనలపై అధికారుల ఆరా

    • పండోరా పేపర్స్ ఆరోపణల నేపథ్యంలో విచారణ

    పూర్తి కథనం

  • Feb 26, 2026 10:22 IST

    అది విచారకరం.. భారత బడ్జెట్‌పై ఇరాన్ విదేశాంగ మంత్రి కామెంట్

    • ఇరాన్‌లో చాబహార్ పోర్టు అభివృద్ధికి నిధులు కేటాయించని కేంద్రం

    • కేంద్ర బడ్జెట్‌లో కానరాని చాబహార్ పోర్టు ప్రస్తావన

    • ఈ పరిణామం తమతో పాటూ భారత్‌కూ విచారకరమన్న ఇరాన్ విదేశాంగ మంత్రి

    • ఏదోక రోజు ఈ పోర్టు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య

    పూర్తి కథనం

  • Feb 26, 2026 10:21 IST

    ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

    • క్రీడాకారులు, ఎన్‌సీసీ అభ్యర్థులకు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లపై ఎమ్మెల్యే ప్రశ్న

    • క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి: మంత్రి మండిపల్లి రాంప్రసాద్

    • డీఎస్సీ నియామకాల్లో క్రీడాకారులకు 426 మందికి ఉద్యోగాలు ఇచ్చాం: మంత్రి

  • Feb 26, 2026 10:20 IST

    నేటి నుంచి జనసేన మూడో విడత సభ్యత్వ నమోదు ప్రోగ్రాం

    • 'మెంబర్‌షిప్ టూ లీడర్‌షిప్‌' నినాదంతో సభ్యత్వ డ్రైవ్‌

    • ఇటీవల పిఠాపురంలో ముగిసిన సభ్యత్వ నమోదు కార్యక్రమం

    • నేటి నుంచి 5 రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం

  • Feb 26, 2026 10:18 IST

    హైదరాబాద్: బంజారాహిల్స్‌లో విషాదం

    • ఇంట్లో ఉరేసుకుని 5వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

    • ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపం

  • Feb 26, 2026 10:17 IST

    జస్టిస్ యశ్వంత్ తొలగింపుపై కమిటీ పునర్నియామకం

    • త్రిసభ్య కమిటీని పునర్నియామకం చేసిన లోక్‌సభ స్పీకర్

    • గతంలో జస్టిస్ యశ్వంత్‌వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభ్యం

    • జస్టిస్ యశ్వంత్‌వర్మను తొలగించాలంటూ లోక్‌సభలో అభిశంసన తీర్మానం

    • లోక్‌సభలో అభిశంసన తీర్మాన నోటీస్ తర్వాత కమిటీ వేసిన స్పీకర్

  • Feb 26, 2026 10:16 IST

    మధ్యప్రదేశ్: షాడోల్ జిల్లా పురానీబస్తీలో విషాదం

    • ఆన్‌లైన్ గేమ్‌లో సర్వం కోల్పోయిన శంకర్‌లాల్

    • కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగిన శంకర్ కుటుంబం

    • శంకర్‌లాల్, కూతురు స్వాతి మృతి, భార్య పరిస్థితి విషమం

  • Feb 26, 2026 10:16 IST

    ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్

    • భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

    • జంగ్లా పీఎస్ పరిధి ఇంద్రావతి నది ప్రాంతంలో ఘటన

  • Feb 26, 2026 10:15 IST

    నేడు ఖమ్మం, సూర్యాపేటలో కేటీఆర్ పర్యటన

    • భూదాన్ భూముల బాధితులను పరామర్శించనున్న కేటీఆర్

    • సాయంత్రం కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్

    • ఇటీవల కోదాడలో జరిగిన లాకప్‌డెత్‌లో కర్ల రాజేష్ మృతి

  • Feb 26, 2026 09:19 IST

    తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

    • మెుత్తం 42మంది ఐఏఎస్‌లు బదిలీ

    • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • Feb 26, 2026 09:15 IST

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

    • 11వ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    • పలు బిల్లులపై చర్చిస్తున్న సభ్యులు.. లైవ్ వీడియో..

  • Feb 26, 2026 09:01 IST

    శ్రీకాకుళంలో అదుపులోకి వస్తున్న డయేరియా

    • డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న వైద్య సేవలు

    • ఇప్పటివరకూ 102 మందికి లక్షణాలు గుర్తింపు

    • 13 మంది డిశ్చార్జ్, ఇంకా ఆస్పత్రిలో 85 మందికి చికిత్స

    • 50కి పైగా వైద్య బృందాలతో వార్డుల్లో సేవలు

  • Feb 26, 2026 08:39 IST

    ప్రధాని మోదీ మరో రికార్డు..

    • 100 మిలియన్ ఇన్‌స్టా ఫాలోవర్లతో ప్రపంచంలోనే నెం.1 నేతగా మోదీ

    • 43.2 మిలియన్ ఫాలోవర్లతో నెం.2గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్

    • భారత్‌లో నెం.1 ప్రధాని, తరువాతి స్థానంలో యోగీ ఆదిత్యనాథ్

    పూర్తి కథనం

  • Feb 26, 2026 08:20 IST

    మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    • ఏపీ అసెంబ్లీలో నేడు రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

    • అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, సచివాలయాల సవరణ బిల్లుపై చర్చ

    • జలవనరుల శాఖ బడ్జెట్ పద్దులపై చర్చ, ఆమోదం

  • Feb 26, 2026 08:00 IST

    విద్యార్థి జుట్టు కత్తిరించిన టీచర్.. తల్లిదండ్రుల ఆగ్రహం

    • కర్ణాటక: సింధనూరు హోలీఫ్యామిలీ విద్యాసంస్థలో దారుణం

    • విద్యార్థి జుట్టు కత్తిరించిన డ్రిల్‌ టీచర్‌

    • విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూలు ఫాదర్‌కి ఫిర్యాదు

    పూర్తి కథనం

  • Feb 26, 2026 07:56 IST

    లా డిగ్రీ లేకున్నా న్యాయమూర్తిగా.. పాక్‌లో వింత ఘటన

    • జస్టిస్ తారిఖ్ మొహమ్మద్ నియామకం చెల్లదంటూ ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు

    • తారిఖ్ అవకతవకలకు పాల్పడి న్యాయడిగ్రీ పట్టా పొందారన్న న్యాయస్థానం

    • హైకోర్టు తీర్పును ఫెడరల్ కాన్‌స్టిట్యూషనల్ కోర్టులో సవాలు చేసిన జస్టిస్ తారిఖ్

    పూర్తి కథనం

  • Feb 26, 2026 07:45 IST

    అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

    • అసైన్డ్‌ భూముల చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి అనగాని

    • గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి డోలా

  • Feb 26, 2026 07:37 IST

    టీ-20 ప్రపంచ కప్ 2026: నేడు సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్

    • అహ్మదాబాద్ వేదికగా తలపడనున్న విండీస్, సఫారీ జట్లు

    • మధ్యాహ్నం 3:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం

    • ఈ మ్యాచ్‌పై ఆధారపడనున్న భారత్ సెమీస్ అవకాశాలు

    పూర్తి కథనం

  • Feb 26, 2026 07:29 IST

    రెండో రోజు ఇజ్రాయెల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన

    • పలు రంగాల్లో భారత్‌-ఇజ్రాయెల్ అవగాహనా ఒప్పందాలు

    • నేడు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్బోగ్‌తో ప్రధాని మోదీ చర్చలు

    • ఒప్పందాల తర్వాత భారత్‌-ఇజ్రాయెల్‌ ప్రధానుల మీడియా సమావేశం

    • సాయంత్రం 4 గంటలకు నెతన్యాహుతో ప్రతినిధి స్థాయి చర్చలు

    • నేడు భారతీయ యూదు సమాజ ప్రముఖులతో ప్రధాని భేటీ

  • Feb 26, 2026 07:28 IST

    తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

    • నేటి నుంచి మార్చి 2 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

    • రాత్రి 7 గంటలకు పుష్కరిణిలో స్వామి, అమ్మవార్ల దర్శనం

    • తెప్పోత్సవాలతో నేడు, రేపు సహస్రదీపాలంకరణ సేవ

  • Feb 26, 2026 07:27 IST

    నేటి నుంచి రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

    • నామినేషన్ల స్వీకరణకు గడువు తేదీ మార్చి 5

    • మార్చి 6న స్క్రూటినీ, మార్చి 9న నామినేషన్ల ఉపసంహరణ

    • మార్చి 16న పోలింగ్‌, అదే రోజు సాయంత్రం కౌంటింగ్‌

  • Feb 26, 2026 07:04 IST

    పెరుగుతూనే ఉన్న పసిడి ధరలు

    • గత వారం రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు

    • ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,61,900

    • కిలో వెండి ధర రూ.2,95,100

    • ఈ వారం ధరలు మరింత పెరిగే ఛాన్స్

    పూర్తి కథనం

  • Feb 26, 2026 06:59 IST

    రాజంపేటలో అర్ధరాత్రి లాడ్జిలో చెలరేగిన మంటలు.. ఒకరి మృతి

    • కడప జిల్లా రాజంపేట రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న 'దీప్ లాడ్జి'లో భారీ అగ్ని ప్రమాదం

    • విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అర్ధరాత్రి వేళ లాడ్జిలో ఒక్కసారిగా మంటలు

    • లాడ్జిలోని 22 గదులకు వ్యాపించిన మంటలు, భవనం అంతా అలుముకున్న పొగ

    • లాడ్జిలో ఉన్న మొత్తం 33 మందిలో ఒకరి మృతి, 32 మందిని ఆస్పత్రికి తరలింపు

    పూర్తి కథనం

  • Feb 26, 2026 06:54 IST

    నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికకు ఏర్పాట్లు

    • ఉదయం 11 గంటలకు మేయర్‌ పదవికి ఎన్నిక

    • దేవరకొండ సుజాతకు మేయర్ పదవి దక్కే అవకాశం