Share News

యూట్యూబర్ అన్వేష్‌పై మండిపడిన హిందూ సంఘాలు..

ABN , First Publish Date - Jan 03 , 2026 | 06:44 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

యూట్యూబర్ అన్వేష్‌పై మండిపడిన హిందూ సంఘాలు..
Breaking News

Live News & Update

  • Jan 03, 2026 21:25 IST

    యూట్యూబర్ అన్వేష్‌పై మండిపడిన హిందూ సంఘాలు..

    • తిరుపతి: హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్‌పై మండిపడిన హిందూ సంఘాలు..

    • హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాల నిరసన..

    • అన్వేష్ ఫోటోలను చెప్పుతో కొడుతూ, నిప్పుపెట్టి నిరసన..

    • హిందూ దేవతల జోలికొస్తే తాటతీస్తామంటూ వార్నింగ్..

    • అనంతరం అన్వేష్‌ను అరెస్ట్ చేయాలంటూ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు.

  • Jan 03, 2026 21:19 IST

    22 కిలోల గంజాయి స్వాధీనం..

    • రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 22 కిలోల గంజాయి స్వాధీనం

    • హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై అజిజ్ నగర్ గ్రామం వద్ద వాహనాలు తనిఖీల్లో భాగంగా మారుతి XL6 వాహనంలో దొరికిన గంజాయి..

    • ఒరిస్సా రాష్ట్రం, మల్కాన్‌గిరికి చెందిన పబిత్ర సర్కార్, అమ్రితో పరమనిక్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

    • XL6 కారుతో పాటు రెండు ఫోన్లు స్వాధీనం..

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మొయినాబాద్ పోలీసులు.

  • Jan 03, 2026 20:28 IST

    భార్య కోసం టవర్ ఎక్కిన భర్త..

    • నారాయణపేట జిల్లా: నారాయణపేట జిల్లా కేంద్రం లోని సఖి సెంటర్ సమీపంలో టవర్ ఎక్కిన భర్త..

    • అమర చింత మండలం చిన్న కడుమూరు గ్రామానికి చెందిన విష్ణు అనే వ్యక్తి.. భార్య కోసం టవర్ ఎక్కాడు..

    • ఐదు రోజుల క్రితం నారాయణపేటకు భార్యాభర్తలు కౌన్సిలింగ్‌కి వచ్చారు..

    • తాను భర్తతో ఉండలేనని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..

    • మనస్థాపంతో టవర్ ఎక్కిన భర్త.. అక్కడికి చేరుకుని విచారిస్తున్న పోలీసులు.

  • Jan 03, 2026 19:57 IST

    న‌గ‌దు ర‌హిత వైద్య సేవ‌ల్లో భారీ పురోగ‌తి..

    • కూట‌మి పాల‌న‌లో న‌గ‌దు ర‌హిత వైద్య సేవ‌ల్లో భారీ పురోగ‌తి..

    • డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ వ్య‌యంలో 60 శాతం పెరుగుద‌ల‌..

    • 21 శాతం పెరిగిన ల‌బ్ధిదారులు..

    • నిర్దేశిత స‌మ‌యంలో రోగుల వ‌ద్ద‌కు చేరుకుంటున్న 108 వాహ‌నాలు..

    • అగ్రిమెంట్ ప్ర‌కారం 95 శాతం రోగుల‌ను గంట‌లో ఆసుప‌త్రుల‌కు చేరుస్తున్న 108 అంబులెన్సులు..

    • 104 వాహ‌నాల ద్వారా త్వ‌ర‌లో ఇంటి వ‌ద్ద‌నే 41 వైద్య ప‌రీక్ష‌లు..

    • అమ‌లు, నిర్వ‌హ‌ణ‌ను స‌మీక్షించిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌.

  • Jan 03, 2026 19:35 IST

    సూచనలు ఇస్తే తీసుకుందాం అనుకున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

    • ప్రాజెక్టులపై నిలదీస్తామన్న కేసీఆర్ సభకు రాలేదు: సీఎం రేవంత్ రెడ్డి

    • సభకు వచ్చి ఆయన దగ్గర ఉన్న సమాచారం ఇస్తారనుకున్నాం..

    • కేసీఆర్ సూచనలు ఇస్తే తీసుకుందాం అనుకున్నాం..

    • కృష్ణ నీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై ఒకరోజు చర్చ పెడదామనుకున్నాం..

    • రెండేళ్లుగా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదు..

    • సభకు వచ్చి మీ అనుభవాలు మాతో పంచుకోవాలని నేను పదేపదే కేసీఆర్‌ను కోరుతున్నా..

    • గతంలో జానారెడ్డి , భట్టి విక్రమార్క పోషించిన పాత్ర పోషించమని కోరా..

    • జానారెడ్డి, భట్టిలను ఆనాడు అవమానానించినా భరించి సభకు వచ్చి సలహాలు ఇచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి

  • Jan 03, 2026 19:32 IST

    లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్‌ ఆఫీసర్‌..

    • భద్రాద్రి: రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్‌ ఆఫీసర్‌ శ్రావణి..

    • ప్లాంటేషన్‌ కాంట్రాక్టర్‌ దగ్గర రూ.28 లక్షలు డిమాండ్‌ చేసిన శ్రావణి.

  • Jan 03, 2026 19:29 IST

    కూలిన్ అనే కెమికల్ వల్లే అగ్నిప్రమాదం..

    • అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం రాంబిల్లి మండలం SVS కెమికల్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం

    • కూలిన్ అనే కెమికల్ ఫైర్ అవడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం..

    • SVS కెమికల్ ఇండస్ట్రీ కంపెనీలో 25 మంది సిబ్బంది పనిచేస్తున్నారు..

    • కంపెనీలో ప్రమాదం జరిగే సమయానికి 14 మంది ఉన్నారు..

    • 14 మంది సురక్షతంగా బయటికి వచ్చారు..

    • ఆరు ఫైర్ ఇంజన్ల సహాయంతో గంటలకు మంటలను అదుపు చేశారు..

    • ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడతాం: రమణ, ఆర్డీవో, అనకాపల్లి.

  • Jan 03, 2026 19:04 IST

    అప్పులు తీర్చలేక పెట్రోల్ పోసుకుని నిప్పంచుకున్న వ్యక్తి..

    • మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం..

    • రూ.3 లక్షలు అప్పు తీర్చలేక మద్యం మత్తులో పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్న రవి..

    • చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి..

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు.

  • Jan 03, 2026 18:30 IST

    కాంట్రాక్టర్లపై అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..

    • ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కాంట్రాక్టర్లు మారడం లేదు..

    • ప్రభుత్వాలు మారుతున్నా.. కాంట్రాక్టర్లు ఎంజాయ్ చేస్తున్నారు..

    • ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టు అయినా సేమ్ కాంట్రాక్టర్లు కొనసాగుతున్నారు..

    • ప్రభుత్వ పథకాలు ఫెయిల్ అయినప్పుడు కాంట్రాక్టర్లపై బాధ్యత ఉంటుంది..

    • కాంట్రాక్టర్లకు సైతం నిబంధనలు వర్తించాలి..

    • ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ప్రభుత్వాలు మారిన కాంట్రాక్టర్లు వాళ్లే ఉంటున్నారు..

    • గత ప్రభుత్వంలో పాఠశాలల్లో పెయింటింగ్, బెంచ్‌ల కాంట్రాక్టర్లు ఇప్పుడు సైతం కొనసాగుతున్నారు..

    • కాంట్రాక్టర్లపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది..

    • సీబీఐ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది.

  • Jan 03, 2026 17:37 IST

    కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

    • పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సమయంలో..

    • లాబీల్లో ఎమ్మెల్యేలు తిరగడంపై సీఎం రేవంత్‌ సీరియస్‌

    • సభలో లేని MLAల తీరుపై సీఎం రేవంత్‌ అసహనం

    • అందరినీ సభలోకి పిలిపించాలని విప్‌లకు సీఎం ఆదేశం

  • Jan 03, 2026 17:31 IST

    డీ ఆడిక్షన్ సెంటర్‌కి ఎమ్మెల్యే కుమారుడి తరలింపు..

    • ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుదీర్ రెడ్డికి గంజాయి పాజిటివ్..

    • సుదీర్ రెడ్డి గత కొంత కాలంగా డిప్రెషన్‌లో ఉన్నట్లు గుర్తించిన ఈగల్ టీమ్..

    • ఈగల్ టీమ్‌కి వచ్చిన ఫోన్ కాల్‌తో సుదీర్ రెడ్డి ఇంట్లో సోదాలు..

    • సుదీర్ రెడ్డితో పాటు ఇంట్లో ఉన్న మరో ఇద్దరు స్నేహితులు..

    • సుదీర్ రెడ్డికి మాత్రమే గంజాయి పాజిటివ్ , మిగిలిన ఇద్దరు స్నేహితులకు నెగిటివ్..

    • సుదీర్ రెడ్డిని డీ ఆడిక్షన్ సెంటర్‌కి తరలింపు..

    • సోదాల సమయంలో డ్రగ్స్, గంజాయి దొరకాలేదని చెబుతున్న ఈగల్ టీమ్..

    • డిప్రెషన్ కారణంగానే డ్రగ్స్‌కి అలవాటు పడిన సుదీర్ రెడ్డి..

    • సుదీర్ రెడ్డి దొరికిన తరువాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన ఈగల్ టీమ్.

  • Jan 03, 2026 17:28 IST

    పాలమూరు రంగారెడ్డిపై విచారణ జరపాలనే యోచనలో ప్రభుత్వం..

    • ఇప్పటికే ఈ అంశం పై TOR టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను తెప్పించుకున్న సీఎం..

    • ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపే ఆలోచనలో ప్రభుత్వం..

    • అసెంబ్లీ లో ప్రకటించి తీర్మానం చేయనున్న సీఎం.

  • Jan 03, 2026 17:14 IST

    అచ్చుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం..

    • అనకాపల్లి : అచ్చుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం..

    • రాంబిల్లి మండలం SVS ఫార్మ కంపెనీలో అగ్నిప్రమాదం..

    • కంపెనీలో నుంచి వ్యాప్తి చెందుతున్న దట్టమైన నల్లటి పొగ..

    • రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.

  • Jan 03, 2026 17:09 IST

    కారును ఢీకొన్న జింక..

    • హైదరాబాద్: గచ్చిబౌలిలో కారును ఢీకొన్న జింక..

    • హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవి ప్రాంతం నుంచి బయటకు వచ్చిన జింక..

    • గచ్చిబౌలి లింగంపల్లి పాత ముంబాయి జాతీయ రహదారిపైకి రావడంతో కారును ఢికొన్న జింక..

    • సమాచారం అందుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యానిమల్ ప్రొటెక్షన్ టీం..

    • సంఘటన స్థలానికి చేరుకుని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది.

  • Jan 03, 2026 16:20 IST

    గంజాయితో పట్టుబడిన ఎమ్మెల్యే కుమారుడు..

    • హైదరాబాద్‌: నానక్‌రామ్‌గూడలో ఈగల్ టీమ్‌ తనిఖీలు..

    • గంజాయితో పట్టుబడిన జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు..

    • MLA ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌ రెడ్డికి డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌..

    • సుధీర్‌ రెడ్డిపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు..

  • Jan 03, 2026 15:08 IST

    జగిత్యాలలో జనసేన పార్టీ సమావేశం..

    • తెలంగాణ జన సైనికులకు అండగా ఉంటా: పవన్‌ కల్యాణ్‌

    • నా కష్టాల్లో తోడుగా ఉన్నది మీరే.. మీకోసం నిలబడతా: పవన్‌

    • ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పోరాడాలి: పవన్‌ కల్యాణ్‌

  • Jan 03, 2026 15:03 IST

    అసెంబ్లీలో నీళ్లు-నిజాలపై లఘు చర్చ

    • తెలంగాణ: అసెంబ్లీలో నీళ్లు-నిజాలపై లఘు చర్చ

  • Jan 03, 2026 14:52 IST

    తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ..

    • బ్రేక్ అనంతరం తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ..

    • అసెంబ్లీలో నీళ్లు నిజాలపై ప్రారంభమైన లఘు చర్చ.

  • Jan 03, 2026 14:01 IST

    వెనెజువెలా రాజధాని కరాకస్‌లో భారీ పేలుళ్లు

    • కరాకస్‌లో ఏడు చోట్ల పేలుళ్ల శబ్ధాలతో ప్రజలు భయభ్రాంతులు

    • వెనెజువెలాలో దాడులను ధృవీకరించని అమెరికా

  • Jan 03, 2026 14:00 IST

    గృహజ్యోతి పథకానికి రూ.3,590 కోట్లు చెల్లించాం: భట్టి

    • తెలంగాణలో 52.49 లక్షల కుటుంబాలకు లబ్ధి: భట్టి

    • 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం కొనసాగిస్తాం: భట్టి

    • వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ కోసం ఏటా 13 వేలకోట్లు: భట్టి

  • Jan 03, 2026 13:50 IST

    ఆదిలాబాద్: సోయా కొనుగోళ్లు జరపాలంటూ BRS ఆందోళన

    • MLA పాయల్ శంకర్ ఇంటి ముట్టడికి BRS కార్యకర్తల యత్నం

    • ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు, తోపులాట

    • మాజీ మంత్రి జోగు రామన్న సహా పలువురు అరెస్టు

  • Jan 03, 2026 13:47 IST

    అసెంబ్లీలో మంత్రి తుమ్మలను కలిసేందుకు వచ్చిన ఆదిలాబాద్ రైతులు

    • రైతులు పండించిన సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్

    • రంగు మారిన సోయాబీన్ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ విజ్ఞప్తి

    • మంత్రిని కలిసేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందంటూ వెనక్కి పంపిన పోలీసులు

  • Jan 03, 2026 12:54 IST

    మంత్రి ఉత్తమ్ తో భేటీ అయిన ఏంఐఏం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్

    • దాదాపు నలభై నిమిషాల పాటు మాట్లాడుకున్న ఉత్తమ్, అక్బరుద్దీన్

    • కాసేపట్లో శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న ఉత్తమ్

  • Jan 03, 2026 12:44 IST

    విద్యుత్‌ ప్రమాదం నుంచి అంజన్నే కన్ను కాపాడారు: పవన్‌

    • కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది: పవన్‌ కల్యాణ్‌

    • అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలి

    • దీక్ష విరమణకు మండపం, సత్రం కావాలని నన్ను కోరారు

    • భక్తులు కోరుకున్న బలమైన సంకల్పమిది: పవన్‌ కల్యాణ్‌

    • టీటీడీ, తెలంగాణ నేతల అందరి సమష్టి కృషితోనే సాధ్యమైంది: పవన్‌

    • గిరిప్రదక్షిణకు నా వంతు సహకారం అందిస్తా: పవన్‌

  • Jan 03, 2026 11:51 IST

    అసెంబ్లీకి రావొద్దని నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్

    • తాము బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు ప్రకటించి సభకు వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు

    • తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు ప్రకటించిన కడియం శ్రీహరి

    • నేడు సమావేశాలకు హాజరైన కడియం శ్రీహరి

    • తెల్లం వెంకట్రావును బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్

    • నేడు సభకు వచ్చిన తెల్లం వెంకట్రావు

  • Jan 03, 2026 11:51 IST

    అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

    • మొదట గృహజ్యోతిపై ఎమ్మెల్యేలు మధు సూదన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, నాగరాజు ప్రశ్నలు

    • సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఓట్టి విక్రమార్క

  • Jan 03, 2026 11:47 IST

    రష్యా నుంచి చమురు దిగుమతుల వివరాలు ఇవ్వాలని రిఫైనరీలను ఆదేశించిన కేంద్రం

    • అమెరికాతో ట్రేడ్‌ డీల్‌తో కేంద్రం చర్యలు

  • Jan 03, 2026 11:43 IST

    అల్లూరి: అరకులోయలో దారుణం

    • అరకులోయ ఏరియా ఆస్పత్రి బాత్రూమ్‌లో మృత శిశువు కలకలం

    • నిన్న శిశువుకు జన్మనిచ్చి వెళ్లిపోయిన ఓ మహిళ

    • మృత శిశువుకి జన్మనిచ్చిందా లేదా ప్రసవం తర్వాత చనిపోయిందా అన్న దానిపై రాని స్పష్టత

    • మృత శిశువు ఆస్పత్రిలో ఉండగా గుర్తించిన సిబ్బంది

    • సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్న ఆస్సత్రి సిబ్బంది, దర్యాప్తు చేస్తున్న అరకులోయ పోలీసులు

  • Jan 03, 2026 11:27 IST

    నూజివీడు మ్యాంగో బే క్లబ్‌కు ఏపీ హైకోర్టులో దక్కని ఊరట

    • పేకాట ఆడించవద్దని మ్యాంగో బే క్లబ్‌కు ఏపీ హైకోర్టు ఆదేశం

    • విచారణకు సహకరించాలని మ్యాంగో బే క్లబ్‌కు ఆదేశం

    • పేకాటకు హైకోర్టు అనుమతి ఉందంటూ క్లబ్‌ నిర్వాహకులు ఫ్లెక్సీలు

  • Jan 03, 2026 11:24 IST

    కాంగ్రెస్ ప్రభుత్వం అనైతిక విధానాలు అవలంభిస్తోంది: హరీష్‌రావు

    • సంప్రదాయాలు అంటూ ప్రతిపక్షంలో కాంగ్రెస్ నేతలు నీతులు చెబుతారు

    • కాంగ్రెస్‌ పాలనలో సంప్రదాయాలు తుంగలో తొక్కారు: హరీష్‌రావు

  • Jan 03, 2026 11:24 IST

    కొండగట్టుకు చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

    • జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    • కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్‌

  • Jan 03, 2026 11:22 IST

    హైదరాబాద్‌: అసెంబ్లీ ముట్టడికి ఆదిలాబాద్ రైతుల యత్నం

    • అడ్డుకుని రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు

    • జిల్లాలో కొరటా-చనాకా ప్రాజెక్ట్ పూర్తిచేయాలని రైతుల డిమాండ్‌

  • Jan 03, 2026 11:10 IST

    చిత్తూరు: కుమార్తెపై తండ్రి అత్యాచారం, పోక్సో కేసు నమోదు

    • మొదటి భార్య కుమార్తెపై తండ్రి అత్యాచారం

    • చిత్తూరు: బాలిక నానమ్మ అడ్డుకోగా దాడి చేసి నిందితుడు పరారీ

  • Jan 03, 2026 11:10 IST

    బాపట్ల: నిజాంపట్నం హార్బర్ దగ్గర చేపల బోటులో అగ్నిప్రమాదం

    • జెట్టీ దగ్గర ఆపి ఉంచిన బోటులో ప్రమాదవశాత్తూ చెలరేగిన మంటలు

    • మంటలు చెలరేగడంతో బోటులో నుంచి దూకేసిన మత్స్యకారులు

    • బాపట్ల: అగ్నిప్రమాదంలో బోటు, వలలు దగ్ధం

  • Jan 03, 2026 11:09 IST

    హైదరాబాద్‌: కాంగ్రెస్ నేత సతీష్ మాదిగ అరెస్ట్‌

    • BRS భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో అరెస్ట్ చేసిన పోలీసులు

  • Jan 03, 2026 11:09 IST

    తమిళనాడు పుదుక్కోట్టైలో జల్లికట్టు పోటీలు

    • 12 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

  • Jan 03, 2026 11:09 IST

    ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌

    • ఇద్దరు మావోయిస్టులు మృతి, కొనసాగుతున్న ఎదురుకాల్పులు

  • Jan 03, 2026 11:07 IST

    నల్లగొండ: పట్టణంలోని మునిసిపల్ వార్డులలో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ బి.చంద్రశేఖర్

    • స్థానికులతో ముఖాముఖి.. మున్సిపాలిటీ ద్వారా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరాపై ఆరా

    • పారిశుద్ధ్యం, మురికి కాలువల పరిశుభ్రత పరిశీలన

    • డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశం

    • వీధులలో చెత్త పోస్తే జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు

  • Jan 03, 2026 11:07 IST

    కడప: అట్టహాసంగా ప్రారంభమైన కడప జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్

    • పోలీస్ పరేడ్ మైదానంలో నేటి నుంచి 5 వరకు జరగనున్న క్రీడలు

    • కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు సబ్ డివిజన్లు, ఏఆర్ నుంచి పాల్గొంటున్న క్రీడాకారులు

    • క్రీడలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్

  • Jan 03, 2026 11:05 IST

    స్విట్జర్లాండ్‌ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రమాదంలో ట్విస్ట్‌

    • వైన్ సీసా క్యాండిల్‌ వల్లే ప్రమాదం జరిగిందని గుర్తింపు

    • రిసార్ట్‌లో అగ్నిప్రమాదంతో 40 మంది మృతి, 120 మందికి గాయాలు

  • Jan 03, 2026 11:05 IST

    గుంటూరు: ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ

    • శ్రీనివాస కల్యాణంతో తెలుగు మహాసభలకు శ్రీకారం

    • కల్యాణంలో పాల్గొన్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

  • Jan 03, 2026 11:05 IST

    ప్రయాగ్‌రాజ్‌లో మాఘ మేళా ప్రారంభం

    • త్రివేణీ సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు

    • ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్న మాఘ మేళా

  • Jan 03, 2026 11:02 IST

    ఢిల్లీలో మెరుగపడ్డ వాయు నాణ్యత

    • గాలి వేగం పెరగడంతో తగ్గిన కాలుష్యం, పొగమంచు

    • ఢిల్లీలో AQI 235 పాయింట్లుగా నమోదు

  • Jan 03, 2026 11:01 IST

    మూడో రోజు కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    • తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

  • Jan 03, 2026 07:57 IST

    నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    • తెలంగాణ శాసనసభలో నేడు జలాలు నిజాల పై లఘు చర్చ

    • పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి

    • ఉదయం 10గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభం

    • మొదట ప్రశ్నోత్తరాలు

    • అనంతరం బిల్లుల పై చర్చ

    • నేడు అసెంబ్లీకి 4కీలక బిల్లులు

    • చర్చించి ఆమోదించనున్న శాసన సభ

  • Jan 03, 2026 07:57 IST

    నేడు తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

    • ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

    • కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో సమావేశంకానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

    • ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్

    • నేడు సభకు హాజరు కావొద్దని బీఆర్ఎస్ నిర్ణయం

    • సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని బీఆర్ఎస్ ఆరోపణ

    • తెలంగాణ భవన్ లో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న బీఆర్ఎస్