Share News

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్.. వీడియో వైరల్

ABN , Publish Date - Feb 12 , 2026 | 08:41 PM

ఝాన్సీ రైల్వేస్టేషన్ లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. అప్పటికే అప్రమత్తమైన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ వెళ్లి ఆ వ్యక్తిని రక్షించాడు.

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్.. వీడియో వైరల్
Jhansi Railway Station

ఇంటర్నెట్ డెస్క్: రైల్వేస్టేషన్ల(Railway Stations)లో ‘కదులుతున్న రైలు ఎక్కొద్దు.. దిగొద్దు’ అని రైల్వేశాఖ(Railway Department) ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కొంతమంది ప్రయాణికులు చేసే పొరపాట్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ రైల్వేస్టేషన్‌(Jhansi Railway Station)లో అలాంటి ఘటనే జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.


ఏం జరిగిందంటే?..
ఝాన్సీ రైల్వేస్టేషన్‌లో ఓ ప్రయాణీకుడు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి జారిపడ్డాడు. ఆ వ్యక్తి పట్టాల మధ్య పడిపోవడం చూసి సెకన్ల వ్యవధిలో RPF (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ అప్రమత్తమై సురక్షితంగా బయటకు లాగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వే అధికారి సెకన్ల వ్యవధిలో స్పందించకపోయి ఉంటే.. ఆ వ్యక్తి చనిపోయి ఉండేవాడని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు సదరు కానిస్టేబుల్‌ను ‘రియల్ హీరో’ అంటూ కొనియాడుతున్నారు.

Updated Date - Feb 12 , 2026 | 08:52 PM