Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 04 , 2026 | 07:11 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 04, 2026 21:50 IST

    తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్‌రెడ్డి?

    • ఇప్పటికే అభిషేక్‌ మను సింఘ్వీ పేరు ప్రకటించిన కాంగ్రెస్‌

    • రేపు నామినేషన్లు వేయనున్న వేం నరేందర్‌రెడ్డి, సింఘ్వీ

  • Mar 04, 2026 21:49 IST

    పొత్తు ఖరారు

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో DMK, కాంగ్రెస్‌ పొత్తు ఖరారు

    • కాంగ్రెస్‌కు 28 అసెంబ్లీ, ఒక రాజ్యసభ స్థానం కేటాయింపు

  • Mar 04, 2026 21:49 IST

    ఢిల్లీ: హోంమంత్రి అమిత్‌ షాతో ముగిసిన సీఎం రేవంత్‌ భేటీ

    • అమిత్‌షాతో గంటకుపైగా సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

    • తెలంగాణకు సంబంధించిన కీలకాంశాలపై సీఎం రేవంత్ చర్చ

  • Mar 04, 2026 20:21 IST

    ఇరాన్ క్షిపణిని ధ్వంసం చేసిన నాటో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్

    • తుర్కియే గగనతలంపైకి దూసుకొచ్చిన ఇరాన్ క్షిపణి

    • ఇరాన్‌తో 500 కిలోమీటర్లు సరిహద్దు కలిగిన నాటో సభ్యదేశం టర్కీ

    పూర్తి కథనం

  • Mar 04, 2026 19:41 IST

    26కి చేరిన మృతుల సంఖ్య

    • కాకినాడ: వేట్లపాలెం పేలుడు ఘటనలో 26కి చేరిన మృతుల సంఖ్య

    • జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ లక్ష్మి (48) మృతి

  • Mar 04, 2026 19:22 IST

    T20 WC తొలి సెమీస్‌: సౌతాఫ్రికా Vs న్యూజిలాండ్

    • టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌

  • Mar 04, 2026 19:22 IST

    ఢిల్లీ: కాసేపట్లో హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్‌ భేటీ

    • తెలంగాణకు సంబంధించిన కీలకాంశాలపై చర్చించనున్న రేవంత్

    • పాల్గొననున్న డీజీపీ శివధర్‌రెడ్డి, SIB ఐజీ సుమతి, ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌

    పూర్తి కథనం

  • Mar 04, 2026 18:30 IST

    PPP విధానం అంటే ప్రైవేటీకరణ కాదు: సీఎం చంద్రబాబు

    • ప్రజలకు మెరుగైన సేవల కోసమే PPP విధానం: చంద్రబాబు

    • PPPలో మెడికల్‌ కాలేజీలు ముమ్మాటికీ ప్రభుత్వ ఆస్తే: చంద్రబాబు

    • వేగవంతమైన ఫలితాల కోసమే PPP విధానం: చంద్రబాబు

    • ఏపీ బ్రాండ్‌ను నిలబెట్టడం కోసం చాలా కష్టపడ్డాం: చంద్రబాబు

    • 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు: చంద్రబాబు

    పూర్తి కథనం

  • Mar 04, 2026 18:29 IST

    ఎవరూ ఊహించని విధంగా విశాఖకు పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

    • విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ వస్తోంది: సీఎం చంద్రబాబు

    • టాటా, TCS వచ్చాక మిగతా కంపెనీలు క్యూ కట్టాయి: సీఎం చంద్రబాబు

    • దేశంలో 25.6శాతం పెట్టుబడులు ఏపీకే వచ్చాయి: సీఎం చంద్రబాబు

  • Mar 04, 2026 18:29 IST

    కూటమి పాలనలో 25 నూతన పాలసీలు తెచ్చాం: సీఎం చంద్రబాబు

    • టూరిజం శాఖకు తొలిసారి పారిశ్రామిక హోదా: సీఎం చంద్రబాబు

    • 30,598 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం: సీఎం చంద్రబాబు

    • పరిశ్రమలు, సంస్థల్లో 6.28లక్షల మందికి ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

  • Mar 04, 2026 18:12 IST

    ఇప్పటికే 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం: సీఎం చంద్రబాబు

    • అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు

    • తిరుపతి, విశాఖ, అమరావతిలో ఎకనమిక్‌ జోన్‌ అభివృద్ధి: చంద్రబాబు

    • సమపాళ్లలో అభివృద్ధి, సంక్షేమం: సీఎం చంద్రబాబు

  • Mar 04, 2026 18:12 IST

    వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్‌ దెబ్బతీశారు: సీఎం చంద్రబాబు

    • గత వైసీపీ పాలకులు పరిశ్రమలను తరిమికొట్టారు: చంద్రబాబు

    • వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలను బెదిరించారు: చంద్రబాబు

    • యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: సీఎం చంద్రబాబు

  • Mar 04, 2026 18:11 IST

    పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పనపై సీఎం చంద్రబాబు

    • ఏపీ విద్యాశాఖలో అనేక నూతన మార్పులు వచ్చాయి: చంద్రబాబు

    • ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా పేదలకు రూ.25లక్షల బీమా: చంద్రబాబు

    • సంజీవని ద్వారా డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు: సీఎం చంద్రబాబు

    • మాతృభాష తెలుగును కాపాడుకోవాలి: సీఎం చంద్రబాబు

    • తెలుగు నేర్చుకోకుంటే మన ఉనికి కోల్పోతాం: సీఎం చంద్రబాబు

  • Mar 04, 2026 17:56 IST

    భారీ స్థాయిలో పతనమైన రూపాయి

    • డాలర్‌తో పోల్చితే ఒక్కరోజులో 67 పైసలు పతనం

    • 92.16 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరిక

    • పశ్చిమాసియా యుద్ధ ప్రభావమే కారణమని మార్కెట్ నిపుణుల వెల్లడి

    పూర్తి కథనం

  • Mar 04, 2026 17:54 IST

    ఇరాన్ యుద్ధవిమానాన్ని కూల్చేసిన ఇజ్రాయెల్ ఎఫ్-35 ఫైటర్ జెట్

    • టెహ్రాన్ గగనతలంలో యాక్-130ని కూల్చేసినట్టు ప్రకటించిన ఐడీఎఫ్

    • శత్రు విమానాన్ని ఎఫ్-35 ఫైటర్ జెట్ కూల్చేయడం ఇదే మొదటిసారి

    • ప్రపంచంలోని అడ్వాన్స్‌డ్‌ ఫైటర్ జెట్లలో ఎఫ్-35 కూడా ఒకటి

  • Mar 04, 2026 17:53 IST

    తమిళనాడు: తంజావూరు TVK సభలో విజయ్‌ కీలక వ్యాఖ్యలు

    • TVK ఉన్నంతవరకు DMKను అధికారంలోకి రానివ్వం: విజయ్‌

    • రెండు ద్రవిడ పార్టీలు డ్రామాలాడుతున్నాయి: TVK చీఫ్‌ విజయ్‌

    • అవినీతి, దోపిడీలో ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం: విజయ్‌

  • Mar 04, 2026 17:51 IST

    గుంటూరులో విషాదం

    • గొంతులో బెలూన్‌ చిక్కుకుని నాలుగేళ్ల బాలిక శిరీష మృతి

    • ఆస్పత్రికి తరలించేలోపే బాలిక శిరీష మృతి

    పూర్తి కథనం

  • Mar 04, 2026 17:34 IST

    రాజీనామా దిశగా నితీష్ కుమార్.. రాజ్యసభకు పోటీ చేసే అవకాశం

    • బిహార్ ఉపముఖ్యమంత్రి కానున్న నితీశ్ తనయుడు నిశాంత్ కుమార్‌

    • బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరికి ముఖ్యమంత్రి పగ్గాలు దక్కే ఛాన్స్

    • బిహార్ నుంచి 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నేపథ్యంలో ఊహాగానాలు

    పూర్తి కథనం

  • Mar 04, 2026 17:33 IST

    ఏపీకి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం: మంత్రి లోకేష్‌

    • విశాఖకు కాగ్నిజెంట్‌, TCS తీసుకొచ్చాం: మంత్రి లోకేష్‌

    • విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ వస్తోంది: మంత్రి లోకేష్

  • Mar 04, 2026 17:16 IST

    టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నాయి: ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ

    • ఏపీలో టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నాయి: ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ

    • ఈ విషయంలో జాతీయ స్థాయిలో ఏపీది మూడో స్థానం: రాయపాటి శైలజ

    • విశాఖ మినహా అన్ని జిల్లాల్లో ఈ ప్రెగ్నెన్సీలు ఎక్కువగా ఉన్నాయి: రాయపాటి శైలజ

    పూర్తి కథనం

  • Mar 04, 2026 17:05 IST

    చిత్తూరు: తుమ్మెదపాలెంలో కాల్పులు

    • నాటు తుపాకీతో కాల్పులు, యువకుడు మృతి

    • సాయికుమార్‌ను కాల్చిచంపిన ఢిల్లీ అనే మరో యువకుడు

    • నిందితుడి కోసం పోలీసుల గాలింపు

    పూర్తి కథనం

  • Mar 04, 2026 16:13 IST

    ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా

    • అధికార, విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా

    పూర్తి కథనం

  • Mar 04, 2026 16:12 IST

    మా హక్కులను వైసీపీ సభ్యులు హరిస్తున్నారు: సోము వీర్రాజు

    • వైసీపీ హయాంలో వెంకన్నకు అపచారం చేశారు: సోము వీర్రాజు

    • హిందువులకు వైసీపీ అపకారం చేస్తోంది: సోము వీర్రాజు

    • ఎక్కడైనా రూ.320కి కిలో ఆవు నెయ్యి దొరుకుతుందా?: సోము వీర్రాజు

    • హిందువుల మనోభావాలను వైసీపీ గుర్తించట్లేదు: సోము వీర్రాజు

  • Mar 04, 2026 16:11 IST

    ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధం: మంత్రి పయ్యావుల

    • వైసీపీ తీరు చూస్తుంటే చర్చకు సిద్ధంగా లేనట్లుంది: పయ్యావుల

  • Mar 04, 2026 16:10 IST

    ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన

    • మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

    • జగన్‌ క్రిస్టియన్‌ అనే మాటలకు కట్టుబడి ఉన్నా: అచ్చెన్న

    • నా వ్యాఖ్యలకు ఆధారాలు కూడా ఇస్తా: మంత్రి అచ్చెన్న

  • Mar 04, 2026 15:57 IST

    ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి

    • శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి.. 101 మంది గల్లంతు

    • ఇరాన్ నౌక నుంచి సంకేతాలు అందడంతో రంగంలోకి దిగిన శ్రీలంక నేవీ

    • 32 మందిని సురక్షితంగా రక్షించిన నావికాదళం

    • దాడి ఎవరు చేశారనే దానిపై అస్పష్టత

    పూర్తి కథనం

  • Mar 04, 2026 15:39 IST

    ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ

    • వైసీపీ ఆరోపణలకు దీటుగా సమాధానం ఇచ్చిన మంత్రి లోకేశ్

    • కల్తీ జరగలేదని చెప్పేందుకు వైసీపీ సభ్యులు సిగ్గుపడాలి: మంత్రి

    • దేవుడు మిమ్మల్ని వదలిపెట్టడు: మంత్రి లోకేశ్

  • Mar 04, 2026 15:38 IST

    మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియా సమావేశం..

    • పెద్దపల్లి జిల్లా కలెక్టర్, డీసీపీ సహా కిందిస్థాయి అధికారులు..

    • కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

    • స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలపై మండిపడిన బాల్క సుమన్

    • క్యాతనపల్లిలో ఘర్షణకు కాంగ్రెస్ నేతలే కారణం: బాల్క సుమన్

    పూర్తి కథనం

  • Mar 04, 2026 15:32 IST

    ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో కొనసాగుతున్న అభిషేక్ శర్మ

    • టీ20 ర్యాంకింగ్స్ జాబితా విడుదల చేసిన ఐసీసీ

    • విఫలమవుతున్నప్పటికీ అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ

    • బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి టాప్

    పూర్తి కథనం

  • Mar 04, 2026 15:31 IST

    హైదరాబాద్ మియాపూర్‌లో డ్రగ్స్ కలకలం

    • సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయం

    • డ్రగ్స్ విక్రయిస్తూ ముగ్గురు సాఫ్ట్‌వేర్ యువకుల అరెస్ట్

    • వారి వద్ద నుంచి 12.6 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ డ్రగ్స్ స్వాధీనం

    పూర్తి కథనం

  • Mar 04, 2026 15:23 IST

    ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల దురుసు ప్రవర్తన

    • తిరుమల లడ్డూ అంశంపై ప్రకటన సమయంలో..

    • మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు

    • మాధవరావుకు మద్దతుగా కదిలిన ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు

    • రా తేల్చుకుందామంటూ మాధవరావుకు ఎదురెళ్లిన ఆనం

  • Mar 04, 2026 15:21 IST

    మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్‌ అభ్యంతరం

    • క్రిస్టియన్‌ అని ఎవరిని అంటున్నారు?: మండలి చైర్మన్‌ మోషేన్ రాజు

    • నేను క్రిస్టియన్‌ కాదు.. హిందువుని: మండలి చైర్మన్‌

    • నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: మంత్రి అచ్చెన్న

    • తప్పు ఒప్పుకుంటున్నా: మంత్రి అచ్చెన్నాయుడు

  • Mar 04, 2026 15:20 IST

    మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలపై శాసనమండలిలో గందరగోళం

    • తిరుమల శ్రీవారిపై వైసీపీ అధ్యక్షుడికి ఎందుకంత పగ?: అచ్చెన్న

    • మీరు.. మీ నాయకుడు క్రిస్టియన్లు: మంత్రి అచ్చెన్న

    • మేం హిందువులమైనా.. మిమ్మల్ని తప్పుబట్టడం లేదు: అచ్చెన్న

    • ఎవరి మతవిశ్వాసాలు వారివి: మంత్రి అచ్చెన్న

  • Mar 04, 2026 15:19 IST

    YSRCP హయాంలో అన్ని ఆలయాల్లో ప్రసాదం కల్తీ జరిగింది: మంత్రి పయ్యావుల

    • లడ్డూ కల్తీపై చర్చించకుండా సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు: మంత్రి పయ్యావుల

    • TTDలో తప్పులపై YSRCP హయాంలో ఎందుకు చర్యల్లేవ్‌?: మంత్రి పయ్యావుల

    • నెయ్యిలో కల్తీ జరిగిందా? లేదా? YSRCP స్పష్టం చేయాలి: మంత్రి పయ్యావుల

  • Mar 04, 2026 14:49 IST

    ములుగులో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రుల సమీక్ష

    • ములుగులో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: మంత్రులు

    • భూ సేక‌ర‌ణ‌కు సంబంధించి 15 రోజుల్లో అంచ‌నాలు సిద్ధం చేయాలి: మంత్రులు

    • సీఎం దృష్టికి తీసుకెళ్లి ప‌రిహారాన్ని చెల్లిస్తాం: మంత్రులు

  • Mar 04, 2026 14:48 IST

    మధ్యప్రాచ్యంలో ఐదో రోజు మరింత తీవ్రమైన దాడులు

    • ఇరాన్ క్షిపణి లాంచర్లు, ఆయుధ ఫ్యాక్టరీలపై ఇజ్రాయెల్ దాడులు

    • ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్

    • ఐదురోజుల్లో 1,700 లక్ష్యాలపై దాడులు చేశామన్న యూఎస్ సెంట్రల్ కమాండ్

  • Mar 04, 2026 13:53 IST

    తిరుమల శ్రీవారి లడ్డూపై జగన్‌ విషం చిమ్మారు: టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ

    • వైఎస్ఆర్ నుంచి జగన్‌ వరకూ శ్రీవారిపై పగబట్టారు.. కక్షగట్టారు: అనురాధ

    • లడ్డూ కల్తీ చేసిన వైసీపీ సభకు క్షమాపణ చెప్పాలి: అనురాధ

    • రసాయనాలతో తిరుమల శ్రీవారి లడ్డూలు తయారుచేశారు: అనురాధ

    • వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా టెండర్‌ నిబంధనలు మార్చారు: అనురాధ

    • టెండర్‌ నిబంధనల మార్పు డాక్యుమెంట్స్‌పై వైవీ సుబ్బారెడ్డి సంతకాలు చేశారు

    • జంతుకొవ్వు అవశేషాలున్నట్లు NDDB నివేదికలో ఉంది: అనురాధ

    • ఇది కేవలం కుంభకోణం మాత్రమే కాదు.. హిందుత్వంపై దాడి: అనురాధ

  • Mar 04, 2026 13:51 IST

    టీటీడీని బలోపేతం చేసింది మేమే: మంత్రి పయ్యావుల

    • 2022 CFTRI నివేదికలో కల్తీ నెయ్యిపై నివేదిక వచ్చింది: పయ్యావుల

    • CFTRI నివేదికను వైవీ సుబ్బారెడ్డి తొక్కిపెట్టారు: మంత్రి పయ్యావుల

    • టెండర్లపై మాట్లాడుతుంటే వైసీపీ ఉలిక్కిపడుతోంది: పయ్యావుల

  • Mar 04, 2026 13:28 IST

    మండలి వెల్‌లోకి వెళ్లి వైసీపీ సభ్యుల నిరసన

    • అధికారపక్షం తీరుకు నిరసనగా వాకౌట్‌ చేస్తామన్న వైసీపీ

    • తిరుమల లడ్డూపై చర్చ పూర్తయ్యేవరకు..

    • వైసీపీ సభ్యులు సభలో ఉండేలా చూడాలన్న మంత్రి అచ్చెన్న

  • Mar 04, 2026 13:28 IST

    ప్రభుత్వం లడ్డూపై చర్చకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది: పయ్యావుల

    • ఒకే అంశంపై రెండు తీర్మానాల చర్చకు చైర్మన్‌ అనుమతించారు: నాదెండ్ల

    • ఒకవేళ అనుమతిస్తే ముందు ప్రభుత్వ స్టేట్‌మెంట్‌కి అనుమతి ఇవ్వాలి: నాదెండ్ల

    • రూల్‌ 65 వాయిదా తీర్మానానికి వర్తిస్తుంది.. ఇతర అంశాలకు కాదు: చైర్మన్‌

    • ప్రభుత్వ స్టేట్‌మెంట్‌కి అనుమతించకపోవడం చెడు సంప్రదాయం: నాదెండ్ల

    • చెడు సంప్రదాయానికి అనుమతించానన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నా: చైర్మన్‌

    • ప్రభుత్వం ముందు స్టేట్‌మెంట్‌ చేయడానికి హక్కు ఉంది: మంత్రి పయ్యావుల

  • Mar 04, 2026 13:27 IST

    తిరుమల లడ్డూ అంశంపై మండలిలో చర్చ ప్రారంభం

    • లడ్డూ కల్తీపై సమగ్ర వివరాలతో 20 పేజీల ప్రకటన పంపిణీ

    • లడ్డూ చారిత్రక నేపథ్యం, ప్రామాణిక పదార్థాలపై వివరణ

    • 2014-19 మధ్య ఉన్న టెండర్‌ నిబంధనలు 2020లో సడలింపు

    • మారిన టెండర్‌ నివేదికలో మార్పులను స్పష్టం చేసిన ప్రభుత్వం

    • నెయ్యి కల్తీ గుర్తింపు, ల్యాబ్‌ నివేదికలను వివరించిన ప్రభుత్వం

  • Mar 04, 2026 13:26 IST

    అమరావతి: ఏపీ శాసన మండలిలో యుద్ధ వాతావరణం

    • తిరుమల నెయ్యి కల్తీ అంశంపై చర్చ సందర్భంగా వివాదం

    • మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి - తుమాటి మాదవరావుల మధ్య వివాదం

    • ఒకరికిపై మరొకరు దూసుకెళ్లే ప్రయత్నం

    • అడ్డుకున్న ఇరుపక్షాల సభ్యులు

  • Mar 04, 2026 12:56 IST

    ఏపీ శాసన మండలిలో గందరగోళం

    • వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్య వాగ్వాదం

  • Mar 04, 2026 12:30 IST

    లడ్డూపై చర్చకు గంట సమయం కేటాయించిన చైర్మన్‌

    • వైసీపీకి 30 నిమిషాలు, టీడీపీకి 20 నిమిషాలు, మంత్రికి 10 నిమిషాలు

  • Mar 04, 2026 12:19 IST

    ఢిల్లీ: మరో నలుగురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

    • మహారాష్ట్ర నుంచి నలుగురు అభ్యర్థులకు బీజేపీ అవకాశం

    • రామ్‌దాస్ అథవాలే, మాయా చింతామన్ ఇవ్నాతే,..

    • వినోద్ థావడే, రామారావు వాడ్‌కుటేకు అవకాశం ఇచ్చిన బీజేపీ

  • Mar 04, 2026 12:18 IST

    IAEA అధినేత రాఫెల్‌ గ్రోసీ కీలక వ్యాఖ్యలు

    • ఇరాన్‌ దగ్గర అణుబాంబు సిద్ధంగా లేదు: రాఫెల్‌ గ్రోసీ

    • ఇరాన్‌ అణుబాంబు తయారు చేస్తోందనడానికి ఆధారాలు కూడా లేవు

    • ఇరాన్‌ దగ్గర యురేనియం నిల్వలు మాత్రమే ఉన్నాయి: రాఫెల్‌ గ్రోసీ

  • Mar 04, 2026 12:03 IST

    ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్‌ రెడ్డి

    • రాజ్యసభ స్థానాలపై AICCతో చర్చించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

    • తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక

    • ఇప్పటికే ఒక స్థానం సింఘ్వీకి కేటాయించిన హైకమాండ్‌

    • రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్న సింఘ్వీ

    • రెండో స్థానానికి వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం

  • Mar 04, 2026 11:59 IST

    కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్‌రెడ్డి?

    • నరేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం

    • త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం

  • Mar 04, 2026 11:11 IST

    ఏపీ అసెంబ్లీ: భూవివాదాల కేసులపై మంత్రి అనగానికి స్పీకర్‌ సూచన

    • హైకోర్టులో ప్రభుత్వం అన్ని హక్కులు ఉన్న కేసులు కూడా ఓడిపోతోంది: స్పీకర్‌

    • కొందరు లైజనింగ్‌ అధికారులు కక్షిదారులతో కుమ్మక్కవుతున్నారు: అయ్యన్న

    • సమస్య ప్రభుత్వం దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటామన్న మంత్రి

    • భూవివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది: అనగాని

    • హైకోర్టులో ఉన్న ప్రభుత్వ భూవివాదాల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాం

    • కేసుల లైజనింగ్‌ కోసం జిల్లాకు ఒక అధికారిని నియమించాం: అనగాని

  • Mar 04, 2026 11:06 IST

    విజయవాడ: ఐఏఎస్ కిషోర్ కుమార్ భార్య మృతిపై వీడిన మిస్టరీ

    • సత్య దీపికది సహజ మరణంగా ఫోరెనిక్స్ రిపోర్ట్

    • జనవరి 4న మృతి చెందిన కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక

  • Mar 04, 2026 10:38 IST

    కొండా మురళీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

    • వరంగల్: మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

    • పరకాల మా అడ్డా.. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచే కొండా సురేఖ పోటీ చేస్తుంది

    • నా బిడ్డ కొండా సుష్మిత ఎవడినైనా ఎదిరిస్తుంది

    • నాకన్నా కొండా సుస్మిత ధైర్యవంతురాలు

    • కార్యకర్తలకు సమస్య వస్తే ఎవరిని వదిలిపెట్టదు

    • ఎంతటివారినైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది

  • Mar 04, 2026 10:34 IST

    ఇరాన్‌ రహస్య అణు కేంద్రంపై ఇజ్రాయెల్‌ దాడి

    • టెహ్రాన్‌ సరిహద్దుల్లోని మింజాదెహైలో రహస్యంగా ఏర్పాటు చేసిన న్యూక్లియర్‌ కేంద్రం.

    • ఈ న్యూక్లియర్‌ కేంద్రం కాంపౌండ్‌పై ఇజ్రాయెల్‌ దాడి: ఐడీఎఫ్‌

    • అణు కేంద్రంలో శాస్త్రవేత్తలు రహస్యంగా పనిచేస్తున్నారు: ఐడీఎఫ్‌

    • ఇజ్రాయెల్‌ దాడిలో స్వల్పంగా ధ్వంసమైన ఇరాన్‌ రహస్య అణు కేంద్రం: ఐడీఎఫ్‌

  • Mar 04, 2026 10:33 IST

    ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల

    • క్యాతనపల్లి మున్సిపాలిటీ ఘర్షణ కేసులో రిమాండ్‌లో ఉన్న బాల్క సుమన్

    • బెయిల్ మంజూరు కావడంతో విడుదల

    • కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం: సుమన్

  • Mar 04, 2026 10:32 IST

    తిరుమల లడ్డూ కల్తీ అంశంపై మండలిలో చర్చకు అనుమతి

    • ప్రశ్నోత్తరాల తర్వాత లడ్డూ కల్తీ అంశంపై చర్చ

  • Mar 04, 2026 10:29 IST

    చిత్తూరు: పలమనేరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

    • కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొన్న కారు, ఐదుగురు మృతి

    • మృతుల్లో ముగ్గురు మహిళలు

    • బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఘటన

    • గంగవరం మండలం వైఎస్‌ఆర్‌ జంక్షన్‌ దగ్గర ఘటన

    పూర్తికథనం

  • Mar 04, 2026 10:09 IST

    డ్రోన్‌ యుద్ధతంత్రానికి భారత్‌ పదును

    • శేష్‌నాగ్‌-150 డ్రోన్‌ అభివృద్ధి వేగవంతం

    • 25-40 కేజీల వార్‌హెడ్‌ తీసుకెళ్లగల సామర్థ్యం

    • 1000 కిలోమీటర్ల రేంజ్‌లో దాడిచేసేలా చర్యలు

  • Mar 04, 2026 10:06 IST

    ఇరాన్‌: మషాద్‌ నగరంలో ఖమేనీ అంత్యక్రియలు

    • వివరాలు వెల్లడించిన ఫార్స్‌ న్యూస్‌ ఏజెన్సీ

    • అదే నగరంలో జన్మించిన అలీ ఖమేనీ

    పూర్తికథనం

  • Mar 04, 2026 10:04 IST

    హర్మూజ్‌లో చమురు నౌకలకు అవసరమైతే అమెరికా నేవీ రక్షణ: ట్రంప్‌

    • ప్రపంచానికి ఇంధన సరఫరాలో ఇబ్బందులు లేకుండా అమెరికా చూస్తుంది

    • ట్రంప్‌ ప్రకటన తర్వాత స్వల్పంగా కోలుకున్న చమురు మార్కెట్లు

  • Mar 04, 2026 10:03 IST

    పశ్చిమాసియా సంక్షోభ బాధితుల కోసం కేంద్రం హెల్ప్‌లైన్‌

    • కాంటాక్ట్‌ చేసేందుకు వీలుగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

    • నంబర్లు: 1800118797, +91 11 2301 2113, +91 11 2301 4104, +91 11 2301 7905

    • బాధితుల సహాయార్థం దేశాల వారీగా నెంబర్లు ఏర్పాటు

  • Mar 04, 2026 09:54 IST

    అమరావతి: ప్రశ్నోత్తరాలతో ఏపీ అసెంబ్లీ ప్రారంభం

    • పీపీపీ మోడల్‌ కింద వైద్యకళాశాలలపై సభ్యుల ప్రశ్నలు

    • వీబీజీ రామ్‌ జీ జాబ్‌కార్డ్స్‌, రెవెన్యూ శాఖ పెండింగ్ కేసులపై ప్రశ్నలు

    • సింహాచలం పంచగ్రామాల్లో అనధికారిక నిర్మాణాలపై సభ్యుల ప్రశ్నలు

    • విశాఖ జిల్లాలో పరిశ్రమలు, కోనసీమలో MSME పార్కులపై ప్రశ్నలు

    • వరి రైతులకు ఇబ్బందులు, గృహ నిర్మాణ కాలనీల్లో సదుపాయాలపై ప్రశ్నలు

    • విశాఖ ఉక్కు కర్మాగారం, 2014-2019 మధ్య పక్కా గృహాల బిల్లులపై ప్రశ్నలు

  • Mar 04, 2026 09:53 IST

    అల్లూరి: అరకు ప్యాసింజర్ రైలు పది రోజులు రద్దు

    • కేకే లైన్ (కొత్తవలస - కిరండూల్), సిమిలిగూడ - కరకవలస స్టేషన్ల మధ్య డబ్లింగ్ ఇంటర్ లాకింగ్ పనులు

    • ఈనెల 15వ వరకు తాత్కాలికంగా రద్దు

  • Mar 04, 2026 09:41 IST

    భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

    • 1,700 పాయింట్లకుపైగా నష్టపోయిన సెన్సెక్స్

    • 500 పాయింట్లకుపైగా పతనమైన నిఫ్టీ

    • ఒక్కరోజే 67 పైసలు పతనమైన రూపాయి

    • డాలర్‌తో పోలిస్తే 92.17కు చేరిన రూపాయి విలువ

    పూర్తికథనం

  • Mar 04, 2026 09:40 IST

    ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ ఎన్నిక

    • మొజ్తబాను ఎన్నుకున్నట్టు ఇరాన్‌ మీడియా వెల్లడి

    పూర్తికథనం

  • Mar 04, 2026 08:49 IST

    అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

    • అసెంబ్లీ ఆవరణలో గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వరుసలో తెలంగాణ తల్లి విగ్రహం

    • గాంధీ విగ్రహానికి ఎడమవైపు 8 అడుగుల ఎత్తుతో తెలంగాణ తల్లి విగ్రహం

    • ఈ నెల 16న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

  • Mar 04, 2026 08:48 IST

    కామారెడ్డి: తెలంగాణ వర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ

    • సౌత్‌ క్యాంపస్‌ హాస్టల్‌లో హోలీ సంబరాల సందర్భంగా..

    • సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు పరస్పరం దాడులు

    • పలువురు విద్యార్థులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు: ఎస్సై ఆంజనేయులు

  • Mar 04, 2026 08:11 IST

    దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్‌ దాడి

    • అమెరికా కాన్సులేట్‌ సమీపంలో డ్రోన్‌ దాడి, భారీగా మంటలు

    • దాడికి ధ్రువీకరించిన US విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో

    • అమెరికా కాన్సులేట్‌లోని సిబ్బంది సురక్షితం: US విదేశాంగ శాఖ

    పూర్తికథనం

  • Mar 04, 2026 08:07 IST

    హైదరాబాద్: బాచుపల్లి సమీపంలో భారీ అగ్నిప్రమాదం

    • రోడ్డు పక్కన ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు

    • ఫుట్‌పాత్‌పై ఉన్న షాపుల్లో ఒక్కొక్కటిగా అంటుకున్న మంటలు

    • 50 షాపులకు వ్యాపించిన మంటలు

    • భారీగా ఫర్నిచర్ దగ్ధం

    • మంటలను అదుపు చేసిన 10 ఫైర్ ఇంజిన్లు

    పూర్తికథనం

  • Mar 04, 2026 07:15 IST

    ఇరాన్‌తో యుద్ధం కోసం భారీగా ఖర్చు చేస్తున్న అమెరికా

    • మొదటి రోజు ఖర్చు రూ.6,900 కోట్లు

    • యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే అమెరికాపై పెను ఆర్థిక భారం

    • రూ.18.87 లక్షల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా

    పూర్తికథనం

  • Mar 04, 2026 07:15 IST

    తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న ఆలయాలు

    • మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలు మూసివేత

    • ఆలయాల్లో దర్శనాలు పునఃప్రారంభం

  • Mar 04, 2026 07:11 IST

    స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

    • ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,67,610

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,640

    • కిలో వెండి ధర రూ.2.94 లక్షలు

    పూర్తికథనం