-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National International trending Live Updates of 1st April 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 01 , 2026 | 07:40 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 01, 2026 18:32 IST
లోక్‌సభలో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్
BRS దానం వల్లే తెలంగాణకు BJPకి 8 ఎంపీ సీట్లు: చామల
BRS స్క్రిప్ట్‌ను కిషన్‌రెడ్డి చదివారు: ఎంపీ చామల
-
Apr 01, 2026 18:19 IST
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 40.7 డిగ్రీలు
కర్నూలు జిల్లా లద్దగిరిలో 39.9 డిగ్రీలు నమోదు
విజయనగరం జిల్లా నెలివాడలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత
బాపట్లలో అత్యల్పంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
-
Apr 01, 2026 18:17 IST
ఒంటిమిట్ట ఆలయం దగ్గర తప్పిన ప్రమాదం
ఆలయం ఎదుట జనరేటర్ వ్యాన్‌లో చెలరేగిన మంటలు
ఆలయం చుట్టూ అలముకున్న దట్టమైన పొగ
మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
-
Apr 01, 2026 18:15 IST
చండీగఢ్ బీజేపీ కార్యాలయం ఎదుట పేలుడు
పార్క్ చేసిన స్కూటీలో భారీ పేలుడు
ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలినట్లు అనుమానం
పేలుడు ఘటనాస్థలిలో పోలీసుల దర్యాప్తు
-
Apr 01, 2026 18:11 IST
తెలంగాణలోని కొత్తగూడెంలో అత్యధికంగా 40.7 డిగ్రీలు
అత్యల్పంగా యాదాద్రిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
-
Apr 01, 2026 18:02 IST
కడప: ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు దంపతులు
ఒంటిమిట్ట ఆలయంలో సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం
ఆలయం నుంచి కల్యాణ వేదిక వరకు శోభాయాత్ర
సా.6:30 నుంచి 8:30 వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం
శ్రీకోదండ రామస్వామి కల్యాణానికి భారీగా తరలివస్తున్న భక్తులు
-
Apr 01, 2026 17:47 IST
ఆటో గ్యాస్ సరఫరాపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమీక్ష
గ్యాస్ సరఫరా పెంచాలని ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశం
సరఫరా పునరుద్ధరణలో విఫలమైతే కఠిన చర్యలు: స్టీఫెన్ రవీంద్ర
ఆటో డ్రైవర్ల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం కృషి: స్టీఫెన్
-
Apr 01, 2026 17:23 IST
ఆర్టెమిస్-2: జాబిలి చెంతకు చిన్నారి రూపొందించిన బొమ్మ
మరి కాసేపట్లో ఆర్టెమిస్-2 ప్రయోగానికి సిద్ధమైన NASA
నలుగురు వ్యోమగాములతో ప్రయోగం
వ్యోమగాములతో పాటు పయనించనున్న..
8 ఏళ్ల చిన్నారి తయారుచేసిన 'రైజ్' అనే బొమ్మ
-
Apr 01, 2026 16:35 IST
అమెరికాకు మరోసారి బ్రిటన్ ప్రధాని షాక్
ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొనేదిలేదు: పీఎం స్టార్మర్
మాకు బ్రిటన్ ప్రయోజనాలే ముఖ్యం: పీఎం స్టార్మర్
యుద్ధంతో మాకు సంబంధం లేదు: పీఎం స్టార్మర్
-
Apr 01, 2026 16:28 IST
2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధానిగా అమరావతి: మంత్రి నారాయణ
అమరావతికి అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు: మంత్రి నారాయణ
ఇక అమరావతిని ఎవరూ ఇంచ్ కూడా కదల్చలేరు: మంత్రి నారాయణ
-
Apr 01, 2026 16:23 IST
హైదరాబాద్: మంగళ్‌హాట్‌లో కుళ్లిన మాంసం గుర్తింపు
రెండు గోదాముల్లో 10 టన్నుల కుళ్లిన మాంసం స్వాధీనం
జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, యూపీ నుంచి..
చనిపోయిన మేకలను తెప్పించి విక్రయిస్తున్న అఫ్రోజ్
-
Apr 01, 2026 16:01 IST
మార్కాపురం బస్సు ప్రమాదం కేసులో ఇద్దరి అరెస్ట్
బస్సు యజమాని హరికృష్ణారెడ్డి, డ్రైవర్ యువరాజ్ అరెస్ట్
మార్చి 26న రాయవరం సమీపంలో లారీ-బస్సు ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి
పూర్తి కథనం
-
Apr 01, 2026 15:55 IST
పెట్రో ధరలపై కేంద్రం క్లారిటీ
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రసక్తే లేదు: కేంద్రం
గృహావసరాల గ్యాస్ ధరలూ పెంచం: కేంద్రం
మరో 2 నెలలకు సరిపడా పెట్రో నిల్వలు: కేంద్రం
-
Apr 01, 2026 15:49 IST
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌తో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణలో యూరియా లభ్యత, యాప్ అమలు విధానంపై..
శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు వివరించిన మంత్రి తుమ్మల
తెలంగాణకు సమయానికి యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి
-
Apr 01, 2026 15:45 IST
నాటో నుంచి వైదొలిగే ఆలోచనలో అమెరికా
నాటో నుంచి తప్పుకునే అంశాన్ని పరిశీలిస్తున్నాం: ట్రంప్
ఇరాన్‌పై యుద్ధంలో నాటో సహకరించలేదు: ట్రంప్
-
Apr 01, 2026 15:41 IST
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
1,187 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
348 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Apr 01, 2026 15:33 IST
రాజమండ్రి: రామదుర్గం కొండపై పెద్దపులి సంచారం
పెద్దపులి సంచరిస్తున్నట్లు నిర్ధారించిన అటవీశాఖ
రామదుర్గం కొండపై రామాలయంలో 50 మందికిపైగా భక్తులు
దర్శనం నిమిత్తం కొండపైకి వెళ్లిన సీతానగరం మండలం పురుషోత్తపట్నం వాసులు
ఆందోళనలో భక్తుల కుటుంబ సభ్యులు
-
Apr 01, 2026 15:22 IST
నేడు రాత్రి ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్
లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు సహకరించిన..
పార్టీలు, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపనున్న లోకేశ్
బిల్లుపై రేపు రాజ్యసభలో చర్చ సందర్భంగా ఢిల్లీలోనే ఉండనున్న లోకేశ్
-
Apr 01, 2026 15:15 IST
నా జీవితంలో వైసీపీ లాంటి పార్టీని చూడలేదు: సీఎం చంద్రబాబు
మూడు రాజధానుల పేరుతో ఏపీని విధ్వంసం చేసి ఆనందించారు: సీఎం
అమరావతి తీర్మానం రోజున వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాలేదు: చంద్రబాబు
ఎవరైనా వైసీపీ కార్యకర్త అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి: సీఎం
ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవారు.. బెదిరించి వెళ్లిపోయేవారు..
తీవ్రవాదుల కంటే వైసీపీ నేతలు ప్రమాదంగా మారారు: చంద్రబాబు
-
Apr 01, 2026 15:11 IST
ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోలేదన్న ఈడీ
కేజ్రీవాల్ తరఫున కోర్టుకు ఎవరూ హాజరుకాకపోవడంతో నోటీసులు
-
Apr 01, 2026 14:04 IST
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం
-
Apr 01, 2026 13:43 IST
ఏపీకి ఎప్పటికీ ఒకే ఒక్క రాజధాని అమరావతి: జనసేన ఎంపీ బాలశౌరి
అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతిస్తున్నాం
అధికారంలోకి వస్తే అమరావతిని రాజధాని చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం
కూటమి హామీలకు ప్రజలు బ్రహ్మరథం పట్టి.. భారీ మెజార్టీతో గెలిపించారు
మూడు రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించారు
చంద్రబాబుపై భరోసాతో రాజధానికి రైతులు భూములు ఇచ్చారు
జగన్ కుట్రల నుంచి అమరావతిని రైతులు రక్షించుకున్నారు
-
Apr 01, 2026 13:26 IST
అమరావతికి చట్టబద్ధత బిల్లును వ్యతిరేకించిన వైసీపీ
బిల్లును వ్యతిరేకిస్తూ లోక్‌సభ నుంచి వైసీపీ వాకౌట్
ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లుకు మేం వ్యతిరేకం: మిథున్‌రెడ్డి
-
Apr 01, 2026 13:25 IST
అమరావతి చట్టబద్ధత బిల్లును సమర్థిస్తున్నాం: ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర
కానీ విశాఖను రాజధానిగా చేసుకుని ఉంటే ఇంత ఖర్చయ్యేది కాదు
రాజధాని కోసం రైతుల భూములు తీసుకుంటారా?
రాష్ట్రాల హక్కుల కోసమే బిల్లుకు మద్దతు ఇస్తున్నాం
-
Apr 01, 2026 13:25 IST
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది: పురందేశ్వరి
ఆనాడు చర్చ లేకుండా ఏపీ విభజన జరిగింది
వైసీపీ హయాంలో రాజధానిపై తీవ్ర అస్థిరత నెలకొంది
రాజధానిపై గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడింది
అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుంది
రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు
-
Apr 01, 2026 12:40 IST
అమరావతిని నాశనం చేసేందుకు జగన్ ఎంతో ప్రయత్నించారు: సీఎం రమేష్
ఇకపై పులివెందుల ఎమ్మెల్యే అమరావతిలో మూడు ముక్కలాట ఆడలేరు
పులివెందుల ఎమ్మెల్యే ఇకపై ఊసరవెల్లిలా రంగులు మార్చలేరు: సీఎం రమేష్
-
Apr 01, 2026 12:40 IST
ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు అమరావతి: ఎంపీ సీఎం రమేష్
రాజధాని అంటే భవనం కాదు.. గౌరవం: ఎంపీ సీఎం రమేష్
ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుంది: సీఎం రమేష్
అమరావతి చట్టబద్ధతకు మోదీ, అమిత్‌షా, చంద్రబాబు, పవన్ సహకరించారు
ఈ బిల్లు ఏపీకి అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తుంది: సీఎం రమేష్
-
Apr 01, 2026 12:38 IST
అమరావతి అంటే నాకు ఎమోషన్ : కేంద్రమంత్రి పెమ్మసాని
అందుకే తెలుగులో మాట్లాడతున్నా
బిల్లుపై మాట్లాడటం అమరావతి బిడ్డగా గర్విస్తున్నా
అమరావతి రైతులకు, మహిళలకు అభినందనలు
-
Apr 01, 2026 12:36 IST
ఏపీ రాజధానికి భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు: పెమ్మసాని
సంస్కృతి, శాంతి, జ్ఞానానికి నెలవు అమరావతి: కేంద్రమంత్రి పెమ్మసాని
అమరావతి నిర్మాణంలో పూర్తి పాత్ర చంద్రబాబుదే: పెమ్మసాని
చంద్రబాబు వల్లే రాజధాని అమరావతి సాధ్యమైంది: పెమ్మసాని
జగన్ హయాంలో భూములిచ్చిన రైతులను అవమానించారు: పెమ్మసాని
మహిళలు అని చూడకుండా తీవ్రంగా హింసించారు: పెమ్మసాని
-
Apr 01, 2026 12:18 IST
అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు
పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలి: కాంగ్రెస్
బిల్లుకు మద్దతిస్తున్నామన్న కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్
అమరావతి కేవలం రాజధాని కాదు.. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ వినతి
అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం ఇవ్వాలి: మాణిక్కం ఠాకూర్
-
Apr 01, 2026 12:17 IST
శ్రీసత్యసాయి: ప్రజలు సంతోషంగా ఉండటం జగన్‌కు ఇష్టం లేదు: అనగాని
రాజధానిపై పార్లమెంట్‌లో బిల్లు పెడుతుంటే ఓర్వలేకపోతున్నారు: అనగాని
ప్రజలకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తే దానిపైనా దుష్ప్రచారం చేస్తున్నారు
ప్రజా సమస్యలు పట్టించుకోని జగన్.. ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు: అనగాని
-
Apr 01, 2026 12:16 IST
శ్రీకాకుళం: జగన్ కంటే బొత్స, ధర్మాన పెద్ద పిచ్చివాళ్లు: అచ్చెన్న
బొత్స, ధర్మాన సీనియర్ నాయకులు ఎలా అయ్యారో అర్థం కావడం లేదు
రాష్ట్రం విడిపోతే తప్ప రాజధానులు మారవని తెలియదా?
3 రాజధానులన్న జగన్‌ను ప్రజలు ఓడించినా సిగ్గురాలేదు
జగన్ లాంటి పిచ్చోడి చేతిలో రాయి ఉండకూడదనే..
అమరావతి రాజధాని బిల్లును తీర్మానం చేశాం: మంత్రి అచ్చెన్నాయుడు
-
Apr 01, 2026 12:14 IST
అమరావతి చట్ట బద్దత బిల్లుపై లోక్ సభలో చర్చ ప్రారంభం
చర్చలో కాంగ్రెస్ తరపున పాల్గొన్న మాణిక్యం ఠాకూర్
-
Apr 01, 2026 12:08 IST
పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు
లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ
ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ బిల్లు
బిల్లుపై చర్చ లేకుండా మూజువాణి ఓటుతోనే ఆమోదం
-
Apr 01, 2026 12:07 IST
ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు?
మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కోసం ప్రత్యేక సమావేశాలు
బెంగాల్, తమిళనాడు ఎన్నికల పోలింగ్‌లోపే కీలక బిల్లులు ప్రవేశపెట్టాలనుకుంటున్న బీజేపీ
-
Apr 01, 2026 12:06 IST
యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన
హోర్ముజ్ ప్రస్తావన లేకుండానే యుద్ధం ముగింపుపై ట్రంప్ స్టేట్‌మెంట్
అమెరికాతో అగ్రిమెంట్ చేసుకోవాలని ఇరాన్ తహతహలాడుతోంది: ట్రంప్
త్వరలోనే ఈ డీల్‌ను ఫినిష్ చేస్తాం: ట్రంప్
ఇరాన్ కోలుకోవడానికి 15-20 ఏళ్ల సమయం పడుతుంది: ట్రంప్
-
Apr 01, 2026 11:58 IST
12 గంటలకు లోక్‌సభలో అమరావతి బిల్లు
అమరావతి బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి
అమరావతి బిల్లుపై మాట్లాడనున్న టీడీపీ ఎంపీలు
అమరావతి బిల్లుపై చర్చ తర్వాతే.. జనవిశ్వాస్ బిల్లుపై చర్చకు సమ్మతించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్
-
Apr 01, 2026 11:14 IST
లోక్‌సభ 12 గంటల వరకు వాయిదా
లోక్‌సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది
ఫారన్ కంట్రీ బ్యూషన్ సవరణ బిల్లుపై విపక్షాల ఆందోళన
విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ 12 గంటలకు వాయిదా
-
Apr 01, 2026 11:13 IST
పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు
కాసేపట్లో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంశాఖ
ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ బిల్లు
లోక్‌సభ బిజినెస్ జాబితాలో అమరావతి చట్టబద్ధత బిల్లు
లోక్‌సభ ఆమోదం తర్వాత రాజ్యసభ ముందుకు బిల్లు
గతనెల 28న ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ప్రభుత్వం
-
Apr 01, 2026 10:55 IST
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన TDP ఎంపీలు
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే..
చర్చకు అనుమతించాలని స్పీకర్ బిర్లాను కోరిన టీడీపీ ఎంపీలు
ఒంటి గంట తర్వాత చర్చకు అనుమతిస్తానన్న స్పీకర్ ఓం బిర్లా
-
Apr 01, 2026 10:44 IST
అన్నమయ్యజిల్లా: సాయంత్రం ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణం
పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు
కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ, అధికారులు
రాత్రికి ఒంటిమిట్టలోనే సీఎం చంద్రబాబు బస
-
Apr 01, 2026 10:43 IST
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ
నిందితులను మరోసారి కస్టడీకి తీసుకున్న పోలీసులు
ఇప్పటికే ముగ్గురిని 3 రోజులపాటు ప్రశ్నించిన పోలీసులు
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులు
-
Apr 01, 2026 10:21 IST
నాగర్ కర్నూల్: సలేశ్వరం జాతరకు పెరిగిన భక్తుల రద్దీ
ఘాట్ రోడ్డు వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
మన్ననూరు చెక్‌పోస్ట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్
-
Apr 01, 2026 10:05 IST
భారీ లాభాల్లో ట్రేడవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ
లాభాల్లో ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్, ఇన్ఫోసిస్ షేర్లు
నష్టాల్లో హ్యుందాయ్ మోటార్స్ షేర్లు
-
Apr 01, 2026 09:14 IST
ఏదులాపురం మద్దులపల్లిలో విషాదం
రోడ్డు ప్రమాదంతో యువకుడు ప్రసాద్ మృతి
రేపు నిశ్చితార్థం ఉండగా నేడు రోడ్డు ప్రమాదంలో మృతి
-
Apr 01, 2026 09:08 IST
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో పెరిగిన విమాన ఇంధన ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెంపు ప్రభావం
రికార్డుస్థాయిలో రూ.2.07 లక్షలకు చేరిన కిలో లీటర్ విమాన ఇంధన ధర
గతంలో కిలోలీటర్ రూ.96,638 ఉండగా..
నేడు రూ.2.07 లక్షలకు చేరిన ధర
-
Apr 01, 2026 08:25 IST
హైదరాబాద్: సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
LPG గ్యాస్ కొరతతో ఆటో డ్రైవర్ల ఆందోళన
సాగర్ రింగ్ రోడ్డులోని పెట్రో బంక్ దగ్గర భారీగా నిలిచిన ఆటోలు
రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన LPG ఆటో డ్రైవర్లు
-
Apr 01, 2026 08:25 IST
కుప్పకూలిన రష్యా సైనిక రవాణా విమానం ఏఎన్-26
విమాన ప్రమాదంలో 29 మంది మృతి
23 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృతి
క్రిమియా ప్రాంతంలో కూలిన ఏఎన్-26
ఏఎన్-26 విమానంపై ఎలాంటి దాడి జరిగిన ఆధారాలు లేవు
సాంకేతిక లోపంతోనే విమాన ప్రమాదం: రష్యా రక్షణశాఖ
-
Apr 01, 2026 07:43 IST
ఇరాక్: బాగ్దాద్‌లో అమెరికాకు చెందిన మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్
మహిళా జర్నలిస్ట్‌ను దుండగులు అపహరించనట్లు ఇరాక్ వెల్లడి
కిడ్నాపర్ల కోసం భద్రతా దళాలు ముమ్మర గాలింపు: ఇరాక్
కిడ్నాపర్ల కారును గుర్తించి వెంబడించిన ఇరాక్ భద్రతా దళాలు
-
Apr 01, 2026 07:42 IST
భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.195.50 పెంపు
హైదరాబాద్‌లో రూ.214.50 పెరిగిన కమర్షియల్ సిలిండర్
హైదరాబాద్‌లో రూ.2,321 పెరిగిన కమర్షియల్ సిలిండర్
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు
-
Apr 01, 2026 07:42 IST
తెలంగాణలో నేటి నుంచి కొత్త కరెంట్ ఛార్జీలు
హైటెన్షన్ కరెంట్ కనెక్షన్ తీసుకున్న ఆరు కేటగిరీల ఛార్జీల్లో మార్పులు
రోజూ ఉదయం, సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య..
కరెంట్ వినియోగిస్తే యూనిట్‌కు రూ.1.50 అధికం
-
Apr 01, 2026 07:42 IST
నేటి నుంచి ATM వినియోగంపై పరిమితులు
లావాదేవీల నిబంధనలను సవరించిన RBI, బ్యాంక్‌లు
ATMలలో కార్డ్‌లెస్, యూపీఐ లావాదేవీలపై చార్జీలు
యాప్‌లలో పదేపదే బ్యాలెన్స్ చెక్ చేస్తే చార్జీలు
బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు నేటి నుంచి అమలు
టోల్‌ప్లాజాల దగ్గర నగదు లావాదేవీలు నిలిపివేత
-
Apr 01, 2026 07:40 IST
నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం
వ్యక్తిగత డేటా గోప్యతకు భద్రత ఇస్తామన్న కేంద్రం
మే 1 నుంచి 30 వరకు ఏపీలో జనగణన
మే 11 నుంచి జూన్ 9 వరకు తెలంగాణలో కార్యక్రమం
రెండోదశలో కులం వివరాలు సేకరిస్తామన్న కేంద్రం