ట్రంప్ కార్డు అదేనా.. ఇరాన్‌పై చర్యల గురించి అమెరికా అధ్యక్షుడి హింట్..
ABN , Publish Date - Apr 12 , 2026 | 02:54 PM
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు జరిగిన కీలక చర్చలు ఫలితం లేకుండా ముగిశాయి
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు జరిగిన కీలక చర్చలు ఫలితం లేకుండా ముగిశాయి. అణు కార్యక్రమం, హార్ముజ్ నియంత్రణ వంటి అంశాల్లో విభేదాలు తలెత్తాయి. చర్చలు విఫలమైన తర్వాత ట్రంప్ చేసిన ఓ పోస్ట్ పలు అనుమానాలకు తావిస్తోంది (Trump Iran blockade).
తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఇరాన్ నౌకలను దిగ్బంధించే అవకాశం ఉన్నట్టు చెబుతున్న ఓ మీడియా కథనాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఇరాన్ విషయంలో ట్రంప్ తదుపరి ప్లాన్ ఇదేనని చాలా మంది ఊహిస్తున్నారు. 'అమెరికా డిమాండ్లకు ఇరాన్ లొంగకపోతే అధ్యక్షుడి వద్ద ఉన్న అస్త్రం నౌకాదళ దిగ్బంధనమే. చమురుతో నిండిన ఇరాన్ నౌకలను కదలనీయకుండా అడ్డుకోవడమే వ్యూహం. దీంతో చమురు ఎగుమతులపై ఆధారపడిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంద'ని ఓ మీడియా సంస్థ రాసిన కథనాన్ని ట్రంప్ పోస్ట్ చేశారు (US Iran war escalation).
'వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించే సమయంలో కూడా అమెరికా ఇదే వ్యూహాన్ని అమలు చేసింది (Naval blockade Iran). ఇరాన్ విషయంలో కూడా ట్రంప్ ఇదే వ్యూహాన్ని అమలు చేసి చమురు నౌకలను అడ్డుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న చైనా, భారత్ వంటి దేశాలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు' అని ఆ కథనం పేర్కొంది. పాకిస్థాన్‌లో చర్చలు విఫలమైన కొన్ని గంటల అనంతరం ట్రంప్ ఈ కథనాన్ని పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
సంజు కాదు.. విజయానికి కారణం వాళ్లే: రుతురాజ్
అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్