సంజు కాదు.. విజయానికి కారణం వాళ్లే: రుతురాజ్
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:43 AM
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు పరాజయాల తర్వాత విజయం సాధించింది. అయితే ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా బౌలర్లేదనని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీని 23 పరుగుల తేడాతో చెన్నై ఓడించింది. సీఎస్కే విజయంలో సంజు శాంసన్, ఆయుశ్ మాత్రేలు కీలక పాత్ర పోషించారు. అయితే మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. బౌలర్ల వల్లే తమ జట్టు విజయం సాధించిదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రుతురాజ్ మాట్లాడుతూ.. ‘ ఈ సీజన్లో సాధించిన తొలి విజయం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో మేము ఆడిన తీరు చాలా గొప్పగా అనిపించింది. చెపాక్ స్టేడియంలో మేము ఎప్పుడు మొదట బ్యాటింగ్ చేసినా 200 నుంచి 210 స్కోరు చేయాలని భావించే వాళ్లం. కానీ స్లో పిచ్ కారణంగా ఆ స్కోరు చేయడం కాస్త కష్టంగా మారింది. గత మ్యాచ్‌లతో పోలిస్తే మ్యాచ్‌లో అన్ని విషయాల్లో మెరుగయ్యాం' అని తెలిపాడు.
'సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆయుశ్ మాత్రే కూడా అద్భుతంగా రాణించాడు. అయితే బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంది. ఈ మ్యాచ్ గెలుపు ప్రధాన కారణం బౌలర్లే. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం, ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయడం మా విజయానికి కలిసొచ్చింది. మా బౌలర్ల కృషిని చూసి సంతోష పడుతున్నాను. అలానే చెన్నై ఫ్యాన్స్ ఎప్పుడూ మాకు అండగా ఉంటారు. మేం ఎక్కడికి వెళ్లినా వారి మద్దతు మమ్మల్ని ఉత్సాహపరుస్తాయి’ అని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
చెన్నై గెలిచె.. సంజూ అజేయ శతకం