నాటో నుంచి తప్పుకునే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ట్రంప్ తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం అమెరికాతో శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో పశ్చిమాసియాలో పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
భారత సంతతికి చెందిన టెక్నాలజీ నాయకురాలు మంగళ కుప్పా యూఎస్ కార్మిక శాఖ ముఖ్య సమాచార అధికారిగా నియమితులయ్యారు. గతేడాది అక్టోబరు నుంచి తాత్కాలిక హోదాలో పనిచేసిన ఆమెకు పూర్తి స్థాయి సీఐవో బాధ్యతలు అప్పగించారు.
ఇరాన్‌పై దాడుల విషయంలో తమకు సహకరించని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మండిపడ్డారు. ఆయా దేశాలు హోర్ముజ్‌కు వెళ్లి తమ ముడి చమురును తామే తెచ్చుకోవాలని అన్నారు. అమెరికా ఎల్లకాలం సాయం చేయదని చెప్పారు.
తీవ్ర ఇంధన కొరతతో సతమతమవుతున్న క్యూబాకు రష్యా ఉపశమనం కలిగించింది. లక్ష టన్నుల ఇంధనాన్ని క్యూబాకు చేరవేసింది. అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబాలో తీవ్ర ఇంధన కొరత, విద్యుత్ కోతలు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇరాన్‌పై దాడులను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న స్పెయిన్ తాజాగా అమెరికాకు మరో షాకిచ్చింది. ఇరాన్‌తో యుద్ధంలో పాలుపంచుకుంటున్న అమెరికన్ యుద్ధ విమానాలను తమ గగనతలంలోకి రాకుండా నిషేధించింది.
తమతో ఇరాన్ త్వరగా డీల్ కుదుర్చుకోకపోతే విధ్వంసం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చల్లో పురోగతి కూడా ఉందని అన్నారు.
ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఇకపై న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్‌లు వేస్తున్నారు. న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధం చేసిపెట్టుకున్న 400 కేజీల యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు.
ఇరాన్‌కు అత్యంత కీలకమైన, ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒక్కసారి తీవ్ర దాడులు మొదలుపెడితే, ఖర్గ్ ద్వీపాన్ని చాలా తేలికగా స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
ఇరాన్‌లోని మినాబ్‌లో ఎలిమెంటరీ స్కూలుపై ఇటీవల అమెరికా క్షిపణి దాడి జరిపి 170 మంది ప్రాణాలను బలిగొన్న సంఘటన టెహ్రాన్-వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ క్షిపణిని ప్రయోగించిన అమెరికా నౌకాదళ అధికారుల ఫోటోలను ఇరాన్ తాజాగా విడుదల చేసింది.