Share News

ఇరాన్ యుద్ధం‌పై కీలక అప్‌డేట్.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ట్రంప్..

ABN , Publish Date - Apr 01 , 2026 | 07:59 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం అమెరికాతో శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో పశ్చిమాసియాలో పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇరాన్ యుద్ధం‌పై కీలక అప్‌డేట్.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ట్రంప్..
Trump primetime address

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం అమెరికాతో శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో పశ్చిమాసియాలో పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ కీలక ప్రకటన చేసింది. బుధవారం రాత్రి 9 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రసంగం చేయనున్నారని తెలిపింది (Trump Iran speech).


'వినండి.. అధ్యక్షుడు ట్రంప్ బుధవారం రాత్రి 9 గంటలకు (ఈటీ) ఇరాన్‌పై ఒక ముఖ్యమైన తాజా సమాచారాన్ని అందించనున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు' అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలను ఈ ప్రైమ్‌టైమ్ ప్రసంగంలో వివరించే అవకాశం ఉంది (White House announcement Iran).


కాగా, హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరవకపోయినా, సైనిక చర్యను ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు (US Iran war update). ఈ మార్గాన్ని తిరిగి తెరవడానికి అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారు. హోర్ముజ్‌ తిరిగి తెరుచుకోవడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

వాహనదారులకు కీలక అప్‌డేట్.. టోల్‌ప్లాజాల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి..


స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 01 , 2026 | 07:59 AM