Share News

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Apr 01 , 2026 | 06:21 AM

బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠాల నుంచి దిగి వచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 1న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠాల నుంచి దిగి వచ్చాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. మంగళవారం బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది (Gold prices).


ఈ రోజు (ఏప్రిల్ 1న) ఉదయం 6:00 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,49,520 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,060 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,49,670కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,37,210కి చేరుకుంది.


మరోవైపు వెండి ధర కూడా క్రమంగా కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయల మార్క్‌ చేరువకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ.1,49,520, రూ.1,37,060

  • విజయవాడలో రూ.1,49,520, రూ.1,37,060

  • ఢిల్లీలో రూ.1,49,670, రూ.1,37,210

  • ముంబైలో రూ.1,49,520, రూ.1,37,060

  • వడోదరలో రూ.1,49,570, రూ.1,37,110

  • కోల్‌కతాలో రూ.1,49,520, రూ.1,37,060

  • చెన్నైలో రూ.1,49,120, రూ.1,36,690

  • బెంగళూరులో రూ.1,49,520, రూ.1,37,060

  • కేరళలో రూ.1,49,520, రూ.1,37,060

  • పుణెలో రూ.1,49,520, రూ.1,37,060


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ.2,49,900

  • విజయవాడలో రూ.2,49,900

  • ఢిల్లీలో రూ.2,50,100

  • చెన్నైలో రూ.2,49,900

  • కోల్‌కతాలో రూ.2,50,100

  • కేరళలో రూ.2,49,900

  • ముంబైలో రూ.2,50,100

  • బెంగళూరులో రూ.2,50,100

  • వడోదరలో రూ.2,50,100

  • అహ్మదాబాద్‌లో రూ.2,50,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఈ వార్తలూ చదవండి:

రిస్క్ తీసుకున్న ఫలితం.. రూ.20 లక్షలతో 3 కోట్ల సంపద సొంతం

వామ్మో.. విమానాల్లో కూడా జనాలు ఇంతేనా! ఫొటోలు వైరల్

Updated Date - Apr 01 , 2026 | 08:35 AM