Share News

బచ్చలి కూర పెరటి మొక్కే కావచ్చు.. దీని లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!

ABN , Publish Date - Feb 12 , 2026 | 06:44 PM

బచ్చలికూరలో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. శరీరానికి కావాల్సిన విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె మెండుగా ఉంటాయి. వీటితోపాటు ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. అయితే..

బచ్చలి కూర పెరటి మొక్కే కావచ్చు.. దీని లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!
Malabar Spinach Benefits

ఇంటర్నెట్ డెస్క్: ఆకుకూరల్లో రారాజు అనగానే వెంటనే గుర్తొచ్చేది పాలకూర. అయితే, పోషకాల విషయంలో దానికి ఏమాత్రం తీసిపోనిది, మన పెరట్లో పెరిగే బచ్చలికూర. చాలామంది దీనిని సాదాసీదా ఆకుకూరగా భావిస్తారు. కానీ, బచ్చలి కూరలో ఉన్న పోషకాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బచ్చలి కూర రెండు రకాలు. తీగ బచ్చలి, కాడ బచ్చలి. ఎక్కువగా కాడ బచ్చలి మనకి దొరుకుతుంది. తీగ బచ్చలిని ఇంటి పెరట్లో పెంచుకోవచ్చు. బచ్చలి కూరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.


1. రక్త హీనతకు దివ్య ఔషధం:

రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు, నీరసంగా ఉన్నవాళ్లు బచ్చలి కూరను డైట్‌లో చేర్చుకుంటే ఎంతో మంచిది. ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచి, రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.

2. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది:

బచ్చలికూరలో ఫైబర్ (పీచు పదార్థం) అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని వదిలించి, జీర్ణక్రియను సాఫీగా చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

3. కంటి చూపు పదిలం:

కంప్యూటర్లు, ఫోన్లు బాగా వాడే వారికి కళ్లు త్వరగా అలసిపోతాయి. అలాంటి వారు బచ్చలి కూర డైట్‌లో చేర్చుకుంటే ఎంతో మంచిది. దీనిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తాయి. రేచీకటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.

4. ఎముకల బలం:

వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనతను తగ్గించడంలో బచ్చలి కూర తోడ్పడుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం, విటమిన్ కె ఎముకలను ఉక్కులా మారుస్తాయి.

5 చర్మ సౌందర్యం:

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ముడతలు రాకుండా నివారించి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!

అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!

For More Latest News

Updated Date - Feb 13 , 2026 | 09:36 PM